Quality tests
-
పేదల ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కింద తొలి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాల నాణ్యతలో ఎక్కడా రాజీ పడేందుకు వీల్లేదన్న ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో గృహ నిర్మాణ శాఖ ఆ మేరకు చర్యలు తీసుకుంటోంది. ఇళ్ల నిర్మాణాల్లో వినియోగించే మెటీరియల్‌కు నాణ్యత పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రధానంగా సిమెంట్ నాణ్యత విషయంలో ఎటువంటి తేడా రాకుండ పటిష్టమైన నాణ్యత పరీక్షలకు మార్గదర్శకాలు జారీ చేసింది. పేదల ఇళ్ల నిర్మాణాలకు తక్కువ ధరకే నాణ్యమైన సిమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తున్న విషయం తెలిసిందే. ఇందు కోసం గృహ నిర్మాణ శాఖ గ్రామ సచివాలయాలు, మండల స్థాయిల్లో గోదాములను అద్దెకు తీసుకుంది. సిమెంట్, స్టీలు, ఇతర మెటీరియల్‌ను ఆ గోదాముల్లో నిల్వ చేస్తోంది. సిమెంట్‌ను జిల్లాల వారీగా వైఎస్సార్ నిర్మాణ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలు చేసే సిమెంట్‌కు తొలుత 98 శాతం మాత్రమే బిల్లు చెల్లించాలని, నాణ్యత పరీక్షలు పూర్తయ్యాకే మిగతా రెండు శాతం చెల్లించాలని స్పష్టం చేసింది. మార్గదర్శకాలు ఇలా.. ► ప్రతి సంస్థ సరఫరా చేసిన సిమెంట్ నుంచి జిల్లా యూనిట్‌గా రెండు గోదాముల నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి (ఏప్రిల్–జూన్, జూలై–సెప్టెంబర్, అక్టోబర్–డిసెంబర్, జనవరి–మార్చి) నమూనాలను సేకరించాలి. ► ప్రతి త్రైమాసికంలో వేర్వేరు గోదాముల నుంచి నమూనాలను సేకరించాలి. నమూనాల సేకరణ సమయంలో సిమెంట్ కంపెనీల ప్రతినిధిని భాగస్వామ్యం చేయాలి. ► సేకరించిన నమూనాలను ప్రాజెక్టు డైరెక్టర్లు పరీక్షల కోసం తిరుపతిలోని ఐఐటి, ఎస్వీ విశ్వవిద్యాలయం.. తాడేపల్లిగూడెం ఎన్ఐటి, హైదరాబాద్‌లోని ఎన్‌సీసీబీఎం, విమ్తా ల్యాబ్స్, బ్యూరో వెరిటాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భగవతి–అనా–ల్యాబ్స్‌కు పంపాలి. ► వీటితో పాటు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, కాకినాడ జేఎన్టీయూ, విజయవాడలోని కేఎల్ విశ్వవిద్యాలయం, సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజయనగరం, అనంతపురంలోని జేఎన్టీయూ ప్రయోగశాలలకు పంపించాలి. ► సిమెంట్ నాణ్యతను నిర్ణయించడానికి గోదాముల వద్ద క్షేత్ర స్థాయి పరీక్షలు చేయాలి. సిమెంట్‌లో గట్టి ముద్దలు ఉంటే తిరస్కరించాలి. సిమెంట్‌ను వేళ్లతో రుద్దినప్పుడు సున్నితంగా ఉండాలి. అలాకాకుండా కణికలాగ ఉంటే ఇసుకతో కల్తీ చేసినట్లు భావించాలి. క్షేత్ర స్థాయి తనిఖీల్లో తేడా ఉంటే ఆ సిమెంట్‌ను తిరస్కరించాలి. -
చైనా పీపీఈ కిట్లు నాసిరకం!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనా కంపెనీలు వ్యక్తిగత రక్షణ ఉపకరణాల(పీపీఈ) కిట్లను ప్రపంచ దేశాలకు భారీగా ఎగుమతి చేస్తున్నాయి. అయితే, వీటిలో నాణ్యత లోపించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ 5వ తేదీన చైనా నుంచి 1,70,000 పీపీఈ కిట్లు భారత్‌కు చేరుకున్నాయి. ఇందులో 50 వేల కిట్లు నాణ్యతా పరీక్షలో విఫలమైనట్లు ఓ పత్రిక వెల్లడించింది. గ్వాలియర్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)ప్రయోగశాలలో ఈ నాణ్యతా పరీక్ష నిర్వహించినట్లు పేర్కొంది. ఈ 1,70,000 కిట్లు చైనా నుంచి విరాళంగా వచ్చినట్లు సమాచారం. తాము చైనా నుంచి సీఈ/ఎఫ్‌డీఏ సర్టిఫైడ్ పీపీఈ కిట్లను మాత్రమే దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. నాణ్యతపై సందేహాలు వద్దు చైనా సంస్థలు సరఫరా చేస్తున్న పీపీఈ కిట్ల నాణ్యతపై సందేహాలు అక్కర్లేదని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి రోంగ్ చెప్పారు. నాణ్యమైన కిట్లను చైనా ఎగుమతి చేస్తోందని చెప్పారు. ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల నుంచి టెస్టింగ్ కిట్లు, వైద్య పరికరాలు దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. -
జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ షాంపూ వాడుతున్నారా?
జైపూర్ : అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్‌కు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ మాత్రమే కాదు బేబీ షాంపూ కూడా ప్రమాదకరమైనదేనని తాజా పరీక్షల్లో తేలింది. రాజస్థాన్‌లో జరిపిన నాణ్యతా పరీక్షల్లో జాన్సన్ అండ్ జాన్సన్ షాంపూ భారత ప్రమాణాలను అందుకోలేకపోయింది. ఈ మేరకు రాజస్థాన్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జాన్సన్ అండ్ జాన్సన్‌కు మార్చి 5వ తేదీని నోటీసులు జారీ చేసింది. కంపెనీ బేబీ షాంపూ రెండు బ్యాచ్‌ల నమూనాల పరీక్షల్లో షాంపూలో హాని కారక పదార్థాలు ఉన్నాయని తెలిపింది. ఈ శాంపిల్స్‌లో ప్రమాదకర ఫార్మల్ డిహైడ్ ఉన్నట్లు తేలిందని పేర్కొంది. ఈ ఫార్మల్డిహైడ్ను భవన నిర్మాణ సామగ్రి (కార్సినోజెన్) తయారీలో ఉపయోగిస్తారని వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ అంశాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రతినిధి తిరస్కరించారు. తమ కంపెనీకి చెందిన ఎస్యూరెన్స్ ప్రాసెస్ ప్రపంచంలోనే అత్యంత కఠినంగా ఉంటుందనీ అత్యంత సురక్షితంగా తమ ఉత్పత్తులను ఉంచుతామంటూ ఈ ఆరోపణలను తిరస్కరించారు. ఈ ఫలితాలు ఏకపక్షమైనవనీ, వీటిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమన్నారు. కాగా జే అండ్ జే బేబీ పౌడర్‌లో ప్రమాదకర క్యాన్సర్ కారకాలు ఉన్నాయని ఇప్పటికే తేలింది. అలాగే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థపై ప్రపంచ వ్యాప్తంగా వేలాది కేసులు విచారణలో ఉన్నాయి. పలు కేసులో భారీ నష్టపరిహారం చెల్లించాలని సంబంధిత కోర్టులు సంస్థను అదేశించిన సంగతి తెలిసిందే. -
పారదర్శకంగా నాణ్యత పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: బంకుల్లో పెట్రోల్, డీజిల్ తూకం, నాణ్యతల పరీక్షలు మరింత పారదర్శకం గా ఉండేందుకు తూనికల కొలతల శాఖ సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా గాజుతో తయారు చేసిన 5 లీటర్ల ఓ కొత్త జార్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ గాజు జార్‌ను యుఎస్పీ టైప్ క్లాస్–ఏతో తయారు చేశారు. అందులో పోసే ఇంధనం స్పష్టంగా కనబడటంతోపాటు సరైన తూకాన్ని సూచిస్తుంది. ఈ జార్లో ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. సోమవారం పౌరసరఫరాల భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పెట్రోల్ అండ్ డీజిల్ డీలర్స్ అసోసియేషన్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ఆయిల్ కంపెనీలతో జరిగిన సమావేశంలో ఈ పరికరాన్ని తూనికల కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ పరిశీలించారు. ఈ పరికరాలను ఆయా పెట్రోల్ బంక్ యాజమాన్యాలే సమకూర్చుకోవాలని సూచించారు. వీటిని వినియోగించేందుకు తూనికల కొలతల శాఖ నుంచి ధ్రువీకరణపత్రం పొందాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో రాష్ట్ర పెట్రోల్, డీజిల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ అమరం, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి అమరేందర్‌రెడ్డి, హెచ్‌పీసీఎల్ డీజీఎం (రిటైల్) రాజేశ్, బీపీసీఎస్ మేనేజర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఔషధం..గరళం
ఏదైనా అనారోగ్యంతో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి మందులు తీసుకున్నారా..? వాళ్లిచ్చిన మందులు వాడినా ఏమాత్రం అనారోగ్యం తగ్గలేదా..అయితే మీకిచ్చినవి నాసిరకం మందులేమో ఓ సారి పరిశీలించుకోండి. నాణ్యతా పరీక్షలు పూర్తికాకుండానే బడా ఫార్మాసూటికల్ కంపెనీలు పంపే నాసిరకం మందులను నేరుగా వైద్యశాలలకు పంపిణీ చేసి రోగులకు ఇచ్చేస్తున్నారు. ఒంగోలు డ్రగ్ ఇన్స్పెక్టర్ పంపిన ల్యాబ్ తనిఖీల్లో ఈ నాసిరకం మందుల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఒంగోలు సెంట్రల్: ప్రభుత్వ వైద్యశాలల్లో నాసిరకం మందులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. నాసిరకం మందులు తయారు చేస్తున్న మందుల కంపెనీలు రాష్ట్ర స్థాయిలో మందుల సరఫరాకు కమీషన్లు ఇచ్చి కాంట్రాక్టులు పొందుతున్నాయి. గతంలో కంపెనీలు మందులను సరఫరా చేసిన అనంతరం రాష్ట్ర స్థాయిలోనే నాణ్యతాపరీక్షలకు పంపించే వారు. ఆ పరీక్షలలో నాణ్యమైన మందులు అని తేలితేనే జిల్లాలకు పంపించేవారు. అయితే నాలుగేళ్లుగా జిల్లాలకు పంపించి, అక్కడ నుంచి మందుల నాణ్యతకు ల్యాబొరేటరీలకు పంపుతున్నారు. ఈ సమయాన్నే క్వారన్‌టైమ్ అంటారు. అయితే మందులకు సంబంధించిన నాణ్యతా నివేదికలు రాకుండానే మందులు క్షేత్ర స్థాయిలో అయిపోతుండటంతో విడుదల చేస్తున్నారు. దీంతో మందులు వాడిన తర్వాత నాణ్యతా పరీక్షలలో మందుల కంపెనీలు నిలబడటంలేదు. అయితే అప్పటికే మందులను దాదాపు పూర్తి స్థాయిలో రోగులు వినియోగిస్తున్నారు. ఒంగోలు డ్రగ్ఇన్స్పెక్టర్ కొన్ని రకాల మందులను ఈ మధ్య కాలంలో నాణ్యతా పరీక్షల కోసం ల్యాబొరేటరీలకు పంపించారు. ఈ పరీక్షలలో చాలా వరకూ కంపెనీలు నెగ్గలేదు. పైగా కొన్ని కంపెనీలు సెంట్రల్ ల్యాబొరేటరీలకు తమ మందులను పంపినా అక్కడ కూడా నెగ్గలేదు. దీంతో ఇటువంటి నాణ్యతా లోపం ఉన్న మందులను సరఫరా చేసిన కంపెనీలపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. అమాక్సీ క్లావనేట్:ఇది యాంటి బయోటెక్ ఈ మందును అనేక రోగాలకు, జ్వరాలకు వైద్యులు విరివిగా వాడుతుంటారు. ప్రభుత్వ వైద్యశాలలో ఎక్కువగా వాడే రెండు, మూడు రకాల యాంటి బయోటెక్ లలో దీనిది రెండో స్థానం. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తదితర కారణాలతో వచ్చే జ్వరాలకు వాడుతుంటారు. ఇంతటి ముఖ్య అవసరమైన ఈ యాంటిబయోటెక్ను ఈ మధ్య కాలంలో స్టాండార్ట్ ఫార్మస్యూటికల్స్ అనే కోల్‌కతాకు చెందిన కంపెనీ సరఫరా చేసింది. ఈ కంపెనీ బ్యాచ్ నెంబర్ సిఎల్ఎండీ 743 కింద 1,90,000ల ట్యాబ్లెట్లను సరఫరా చేసింది. అయితే కంపెనీ తయారు చేసిన ఈ మందుల నాణ్యతపై అధికారులకు అనుమానం రావడంతో ఒంగోలు డ్రగ్ ఇన్స్పెక్టర్ మందులను పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీలకు పంపించారు. అక్కడ నాణ్యత లేనట్లు నిర్ధారణ అయింది. ఈ విషయంపై కంపెనీకి నోటీసులు ఇవ్వడంతో కంపెనీ సెంట్రల్ ల్యాబొరేటరీకి నాణ్యత పరీక్షల కోసం పంపగా అక్కడ కూడా మందులు నాణ్యత లేవన్నట్లు నివేదిక వచ్చింది. దీంతో అధికారులు సదరు కంపెనీపై ఒంగోలు కోర్టులో కేసు నమోదు చేశారు. అయితే కంపెనీ సరఫరా చేసిన లక్షా తొంభైవేల మాత్రలను అధికారులు నివేదికలు రాకుండానే పీహెచ్‌సీలకు, ప్రాంతీయ వైద్యశాలలకు పంపించారు. అక్కడి వైద్యులు రోగులకు కూడా వాడారు. మిగిలిన 1800 మాత్రలను మాత్రమే వెనక్కి తెప్పించారు. ఇటువంటి నాసిరకం మందులు వాడటంతో చాలా మందికి రోగం నయం కావడంలేదు. పైగా ఎక్కువ శక్తివంతమైన యాంటిబయోటెక్లను వాడాల్సి వస్తుంది. హైయోసిన్ బ్యుటైల్ బ్రొమైడ్–బుస్కొపాన్:హైయోసిన్ బ్యుటైల్ బ్రొమైడ్ దీన్నే బుస్కోపాన్ అని కూడా అంటారు. ఈ మందును రోగులకు అనేక తీవ్రమైన నొప్పులకు వాడతారు. ఇది ఖరీదు కూడా తక్కువగానే ఉంటుంది. అరియన్ హెల్త్ కేర్ అనే కంపెనీ ఈ మందులను ఎస్7005 సరఫరా చేసింది. అయితే ఈ కంపెనీ తయారు చేసిన మందులు కుడా నాణ్యతా పరీక్షలలో విఫలమయ్యాయి. అయితే మందులను వైద్యశాలలకు సరఫరా చేయలేదు. వీటిని వెనక్కి పంపించాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి ఐరన్, ఫోలిక్ యాసిడ్ సిరప్:ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఈ మందును రక్తహీనతకు వాడతారు. ముఖ్యంగా మహిళలు, గర్భిణులు రక్తహీనతతో బాధపడుతుంటారు. దీంతో ఈ మందును ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. రక్త హీనతతోనే ఎక్కువ మంది గర్భిణులు కాన్పు సమయంలో మరణిస్తుంటారు. ఇంతటి ముఖ్యమైన ఔషధంలో నాణ్యత లేదు. గత నెలలో ఈ మందులను ర్యాడికో రెమిడీస్ అనే కంపెనీ సరఫరా చేసింది. అయితే అప్పటికే క్షేత్ర స్థాయిలో చాలా మందులను వినియోగించారు. మిగిలిన 550 బాటిళ్ల సిరప్‌ను మాత్రమే వెనక్కి తెప్పించారు. స్థానిక బాలాజీ నగర్‌లోని అర్బన్ హెల్త్ సెంటర్లో మందులు నాణ్యత లేనివిగా అధికారులు గుర్తించి, కేసులు నమోదు చేశారు. అసిటైల్ శాల్సిలిక్ యాసిడ్–ఆస్పిరిన్:ఈ మందును అర్ధరైటిస్ ద్వారా వచ్చే జ్వరాలకు, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించేందుకు, అదేవిధంగా ఇతర జ్వరాలకు వాడుతుంటారు. అయితే ఈ మందును ల్యాక్కెమ్కో అనే కంపెనీ సరఫరా చేసింది. ఈ కంపెనీ 64 వేల మందులను సరఫరా చేసింది. ఈ కంపెనీ సరఫరా చేసిన మందులు నాణ్యత లేనట్లుగా పరీక్షల్లో తేలింది. దీంతో అధికారులు ఈ మందులను వెనక్కి తెప్పిస్తున్నారు.ఇలా అనేక రకాల మందులు క్షుణ్ణంగా పరిశీలిస్తే నాణ్యత లోపం బయటపడే అవకాశం ఉంది. కమీషన్లకు కక్కుర్తి పడుతున్న అధికారులు ఇటువంటి మందులను సరఫరా చేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. -
నిబంధనలపై పెట్రోల్
సాక్షి, సిటీబ్యూరో: పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. చమురు సంస్థల నిబంధనలను పాతరేస్తున్నాయి. బంకుల్లో సౌకర్యాల కల్పనలో విఫలమవుతున్నాయి. వాహనదారులకు ఇంధనం తప్ప ఇతర సేవలు అందని ద్రాక్షగానే మారాయి. బంకులకు వచ్చిన వాహనాల్లో పెట్రోల్, డీజిల్ పోయడమే కాదు.. వాటికి ఉచితంగా గాలి, వాహనదారులకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కచ్చితంగా కల్పించాల్సి ఉంటుంది. మరోవైపు పెట్రోల్ బంకుల్లో ఇంధన నాణ్యత పరీక్ష పరికరాలను అందుబాటులో ఉంచాలి. ఎండ, వానల నుంచి రక్షణకు తగిన నీడ వసతి కల్పించాలి. కానీ.. ఇవేవీ పెట్రోల్ బంకుల్లో కనిపించడంలేదు. వీటి పట్టింపేలేదు.. పెట్రో బంకులకు మూడు వైపులా ఆరు అడుగుల ఎత్తులో ప్రహరీ, అగ్ని ప్రమాదాల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవడానికి అనువుగా ఉండాలి. బకెట్లలో ఇసుక. సమీపంలో నీరు అందుబాటులో ఉండాలి. మరోవైపు ప్రథమ చికిత్స పెట్టెలు అత్యవసరం. అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయాల్లో వాటిని ఎదుర్కొనేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు అందుకు సంబంధించిన ధ్రువీకరణ యాజమాన్యం వద్ద తప్పకుండా ఉండాలి. బంకుల వద్ద విద్యుత్ తీగలు, హైటెన్షన్ తీగలు లేకుండా చూసుకోవాలి. పొగ తాగరాదు అనే బోర్డులను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. కానీ ఇవేవీ మచ్చుకైనా కనిపించడం లేదు. కనిపించని నాణ్యత పరిశీలన.. పెట్రోల్ బంకుల్లో నాణ్యత పరిశీలన కనిపించడం లేదు. ఇంధన నాణ్యతను పరీక్షించేందుకు హైడ్రో ధర్మా మీటర్లు అందుబాటులో లేకుండాపోయాయి. బంకుల్లో కనీసం 20 లీటర్ల పెట్రోల్, 50 లీటర్ల డీజిల్ నిల్వ నిరంతరం ఉండాలి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్, పోలీసులకు, వికలాంగులకు ఇంధనం లేదనకుండా పోయాలి. హైడ్రోమీటర్, ఫిల్టర్ పేపర్, ఐదు లీటర్ల క్యాన్ అందుబాటులో ఉండాలి. వినియోగదారులు అడిగిన సమయంలో వెంటనే వీటిని అందజేయాల్సి ఉంటుంది. పెట్రోల్‌లో హైడ్రోమీటర్ పెట్టినప్పుడు సాంద్రత 700–760 మధ్యలో , డీజిల్ 800–860 చూపితే నాణ్యమైనది. కొలతల్లో అనుమానం ఉంటే క్యాన్‌లో పోయించుకొని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. కానీ దానిని పెట్రో బంకుల యాజమానులు మాత్రం అనుమతించడం లేదు. వినియోగదారులుఇలా తెలుసుకోవచ్చు.. ఇంధనం నాణ్యతను పరీక్షించే అధికారం వినియోగదారులకు ఉంటుంది. అందుకు సంబంధించిన కిట్లను వారు కోరినప్పుడు బంక్ సిబ్బంది అందించాలి. కిట్లు అందుబాటులో లేకపోయినా, వాటిని ఇవ్వడానికి వెనుకాడినా మోసం జరుగుతుందని గ్రహించాలి. కల్తీ ఉందా అనేది తెలుసుకోవాలంటే ఫిల్టర్ పేపర్‌పై ఒక్క చుక్క ఇంధనం వేస్తే పది సెకన్లలో ఆవిరి అయిపోతుంది. ఆరిన తర్వాత పేపర్ప మరక కనిపించకూడదు. మరక కనిపిస్తే కల్తీ జరిగినట్లు గ్రహించాలి. హైడ్రో మీటర్ల ద్వారా కూడా నాణ్యత తెలుసుకోవచ్చు. నగరంలో 49 లక్షల వాహనాలు.. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 49 లక్షల వరకు వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. ఇందులో పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు 29 లక్షలు, డీజిల్‌తో నడిచే బస్సులు, మినీబస్సులు, కార్లు, జీపులు, టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతరత్రా వాహనాలు కలిపి సుమారు 20 లక్షల వరకు ఉంటాయని అంచనా. మహానగరం పరిధిలో సుమారు 460 పైగా పెట్రోల్, డీజిల్ బంక్‌లు ఉండగా, ప్రతిరోజు సగటున 40 లక్షల లీటర్ల పెట్రోల్, 33 లక్షల డీజిల్ వినియోగమవుతోంది. -
క్వాలిటీ పరీక్షల తర్వాతే బిల్లులు
శ్రీకాకుళం టౌన్/కొత్తూరు : ఉపాధి నిధులతో పచ్చతోరణం కార్యక్రమానికి అమర్చిన బోర్డుల అమరికపై సాక్షిలో ఇటీవల ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగంలో కదలిక వచ్చింది. పచ్చతోరణం వద్ద అమర్చనున్న బోర్డులకు నిబంధనలు ప్రకటించడంతో పాటు డీఈఈ స్థాయి అధికారి క్వాలిటీ చెక్ చేసిన తర్వాత బిల్లులు చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ ఆర్.కూర్మనాథ్ ఆదేశాలు జారీ చేశారు. సాక్షిలో ఈ నెల 24న కథనం ప్రచురితం కావడంతో ఆ శాఖలో కదలిక వచ్చింది. ఈ నెల 26న కొత్తగా ఆదేశాలు జారీ చేస్తూ ప్రాజెక్టు డెరైక్టర్ కూర్మనాథ్ లేఖాంశానికి కథనం ప్రచురితమైన తేదీ కంటే ముందు జారీ చేసినట్టు లేఖలో ఈ నెల 16వ తేదీని పొందుపరచడం విశేషం. అయితే బోర్డు కచ్చితంగా 10గేజి బరువు కలిగి ఉండాలని, 3 ప్లస్2 సైజ్‌లో పసుపు రంగు వేసిన స్టాండ్‌తో ఉన్న బోర్డుపై నల్లని అక్షరాలతో పూర్తి వివరాలు రాయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. బోర్టు ఏర్పాటుకు మాత్రం రూ.5వేలుగా నిర్థారించి బోర్డుకు కింద సిమ్మెంటు దిమ్మలు కట్టాలని కొత్త రూల్‌ను పొందుపరిచారు. దీనికితోడు బోర్టులు అమర్చిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ డీఈఈ పరిశీలించిన తర్వాత బిల్లులు చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనికి తోడు కాంట్రాక్టరుకే పనులు అప్పగించడం కాకుండా స్థానికులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే వారికి అవకాశం ఇవ్వాలన్న నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అభ్యర్థనను మెమోలో పేర్కొనడం విశేషం. ఏది ఏమైనా అధికారుల్లో చలనం రావడం వల్ల పనిలో నాణ్యత పెరిగే అవకాశం ఉందని పలువురు బావిస్తున్నారు.