ప్రపంచంలోనే అతి పెద్ద మామిడితోట మనదగ్గరే.. ఆ కుబేరుడిదే! | Do You Know This Mukesh Ambani Is World Largest Mango Exporter? See The Story Inside | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అతి పెద్ద మామిడి ఎగుమతిదారు భారతీయ కుబేరుడే!

Published Sat, Jul 20 2024 6:38 PM | Last Updated on Sat, Jul 20 2024 7:41 PM

Mukesh Ambani World Largest Mango Exporter

పెట్రోలియం, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ గురించి అందరికి తెలుసు. కానీ ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారు కూడా అని కొంత మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.

ముకేశ్ అంబానీకి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సుమారు 600 ఎకరాల మామిడి తోట ఉంది. ఇక్కడ 1.5 లక్షల కంటే ఎక్కువ మామిడి పండ్ల రకాలు ఉన్నట్లు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడితోట కావడం గమనార్హం. ఇందులో కేసర్, అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి దేశీయ మామిడి జాతులు.. ఫ్లోరిడాకు చెందిన టామీ అట్కిన్స్, కెంట్ & ఇజ్రాయెల్ దేశానికి చెందిన లిల్లీ, కీట్, మాయా వంటి అంతర్జాతీయ రకాలు ఉన్నట్లు సమాచారం.

ముకేశ్ అంబానీ మామిడి తోటలో ప్రతి ఏటా 600 టన్నుల కంటే ఎక్కువ అధిక నాణ్యత కలిగిన మామిడి పళ్ళు ఉత్పత్తి అవుతాయి. వీటిని రిలయన్స్ సంస్థ భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తూ.. ఆసియాలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారుగా రికార్డ్ సృష్టించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement