కఠ్మాండు: నేపాల్ నుంచి భారత్‌కు విద్యుత్ ఎగుమతి మొదలైంది. రుతు పవనాల రాకతో ప్రాజెక్టులు నిండి నేపాల్‌లోని జల విద్యుత్ కర్మాగారాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. దీంతో, 600 మెగావాట్ల మిగులు కరెంటును శనివారం నుంచి భారత్‌కు విక్రయిస్తున్నామని నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రతినిధి తెలిపారు.
నేపాల్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టుల ద్వారానే ఎక్కువగా కరెంటు ఉత్పత్తవుతుంది. డిమాండ్ తక్కువగా ఉండే వేసవి కాలంలో విద్యుదుత్పత్తి ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉండే శీతాకాలంలో విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. గత ఏడాది జూన్– నవంబర్ మధ్యలో భారత్‌కు విద్యుత్ ఎగుమతి ద్వారా రూ.1,200 కోట్లను ఆర్జించింది. కొన్ని రోజుల క్రితం డిమాండ్ పెరగడంతో భారత్ నుంచి 400 మెగావాట్ల విద్యుత్‌ను నేపాల్ కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment