తాడేపల్లిగూడెంలో కిసాన్ రైల్లోకి ఉల్లిపాయలు లోడ్ చేస్తున్న దృశ్యం
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి పశ్చిమబెంగాల్‌లోని మాల్దా పట్టణానికి ఆదివారం ఉల్లిపాయల లోడ్‌తో కిసాన్ రైలు బయల్దేరి వెళ్లింది. విజయవాడ డివిజన్‌లోని బిజినెస్ డెవలప్‌మెంట్ యూనిట్(బీడీయూ) బృందం తాడేపల్లిగూడెం నుంచి ఉల్లిపాయలు రవాణా చేసేందుకు.. పరిసర ప్రాంతాల్లోని రైతులు, వ్యాపారవేత్తలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి దీన్ని ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంది.
తక్కువ ఖర్చు, సురక్షిత రవాణా, సరుకు భద్రత, ప్రభుత్వం అందించే రాయితీల గురించి రైతులు, వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించడం ద్వారా మొదటిసారిగా తాడేపల్లిగూడెం నుంచి మాల్దా పట్టణానికి 246 టన్నుల ఉల్లిపాయలను రవాణా చేశారు. కిసాన్ రైలును విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment