న్యూఢిల్లీ: ఎగుమతులను మరింతగా పెంచుకునే దిశగా ప్రభుత్వం, పరిశ్రమ కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా గణనీయంగా ఎగుమతి చేసేందుకు అవకాశమున్న 75 ఉత్పత్తులను గుర్తించినట్లు పరిశ్రమల సమాఖ్య పీహెచ్‌డీసీసీఐ వెల్లడించింది.
వీటిలో వ్యవసాయం, ఖనిజాలు తదితర తొమ్మిది రంగాలకు చెందినవి ఉన్నాయని, అమెరికా.. యూరప్ వంటి మార్కెట్లకు వీటిని ఎగుమతి చేయొచ్చని పేర్కొంది. 2027 నాటికి 750 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యాన్ని సాధించేందుకు ఇవి తోడ్పడగలవని తెలిపింది. రాబోయే 75 నెలల్లో అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా, మెక్సికో, ఆస్ట్రేలియా వంటి దేశాలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ వివరించారు.
చేపలు, మాంసం, కాటన్, ఖనిజాలు, వాహనాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఫర్నిచర్, మ్యాట్రెస్‌లు, బొమ్మలు మొదలైనవి గుర్తించిన ఉత్పత్తుల్లో ఉన్నాయి. ప్రస్తుతం మరింతగా ఎగుమతి చేసేందుకు అవకాశాలు ఉన్న ఈ 75 ఉత్పత్తుల వాటా .. మొత్తం ఎగుమతుల్లో 46 శాతంగా ఉంటోంది. వీటి విలువ సుమారు 127 బిలియన్ డాలర్లుగా ఉంది.
చదవండి: యుద్ధ నౌకల తయారీకి, నావల్ గ్రూప్‌తో జీఆర్‌ఎస్‌ఈ జట్టు
Comments
Please login to add a commentAdd a comment