commerce and industry
-
వ్యాపారులకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి
గాం«దీనగర్ (విజయవాడ సెంట్రల్)/కడప కల్చరల్/తణుకు అర్బన్: కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారంటూ రావులపాలెంలో వర్తక వ్యాపారులపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులు, ఇతర వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలను విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఖండించగా, రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చింతకుంట పుల్లయ్య మండిపడ్డారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కె.విద్యాధరరావు మీడియాతో మాట్లాడారు. తక్షణమే చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని, కిరాణా వ్యాపారులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు వ్యాఖ్యలు ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. ఎక్కడైనా కిరాణా దుకాణంలో గంజాయి అమ్ముతూ పట్టుబడిన ఘటనలు రాష్ట్ర చరిత్రలో ఉన్నాయా అని ప్రశి్నంచారు. ఎక్కడో గంజాయి దొరికితే వ్యాపారులకు దాన్ని ఆపాదించడం సరికాదన్నారు. ఆర్యవైశ్యులను అవమానించడం బాబుకు అలవాటుగా మారిందని, ఉద్దేశపూర్వకంగానే విమర్శలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు క్షమాపణ చెప్పే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు పల్లపోతు మురళీకృష్ణ మాట్లాడుతూ బాబు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన తీరును ఖండిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఈమని దామోదర్‌రావు, మద్దాల సుధాకర్, శేగు వెంకటేశ్వర్లు, పోకూరి రమేశ్, ఎస్.వెంకటేశ్వరరావు, నాళం నాగేశ్వరరావు, మద్ది బాలు పాల్గొన్నారు. వైశ్యుల ఆత్మగౌరవాన్ని కించపరచకండి కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కడప నగర ఆర్యవైశ్య ప్రముఖుడు, రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చింతకుంట పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైశ్యుల ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ మాట్లాడటం చంద్రబాబుకు తగదన్నారు. తక్షణమే ఆయన మాటలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఆర్యవైశ్యుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓటు రూపంలో తమ సమాధానం చెబుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా శనివారం మధ్యాహ్నం గంటపాటు కిరాణా దుకాణాలను మూసివేశారు. అంత చులకనా?: కారుమూరి కిరాణా వ్యాపారులను గంజాయి అమ్మకందారులుగా చిత్రీకరిస్తున్న చంద్రబాబు దుర్మార్గుడని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రావులపాలెం బహిరంగ సభలో చంద్రబాబు కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారంటూ వ్యాపారులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. అధికారంలో ఉండగా ఎస్సీలు, బీసీలపై, ఈ మధ్య టిప్పర్ డ్రైవర్‌కి ఎమ్మెల్యే సీటా? అంటూ అవహేళన చేసి, తాజాగా ఆర్యవైశ్యులపై వ్యాఖ్యలు చూస్తుంటే పక్కా ప్రణాళిక ప్రకారమే పేద వర్గాలను టార్గెట్ చేస్తున్నట్టుగా అర్థమవుతోందన్నారు. చెప్పినవే కాదు.. చెప్పనివి కూడా చేసిన సీఎం వైఎస్ జగన్ సేవా రాజకీయాలు మాత్రమే చేస్తారని చెప్పడానికి గర్వపడుతున్నానని కారుమూరి అన్నారు. ఈ సమావేశంలో నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల పాల్గొన్నారు. -
వృద్ధి బలపడుతుంది...
ముంబై: భారతదేశంలో ఆర్థిక వృద్ధి బలంగా పుంజుకుంటోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దేశీయంగా ఉన్న అంతర్గత పరిస్థితులు, వివేకవంతమైన పాలసీ విధానాలతో ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోకి వస్తోందని భరోసాను ఇచ్చారు. టోక్యోలో ట్యోక్యో చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భారత్ ఎకానమీపై ఆయన మాట్లాడుతూ ఆర్బీఐ అన్ని సవాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉందని, ద్రవ్య విధానం ద్రవ్యోల్బణం కట్టడికి, వృద్ధికి తోడ్పడుతుందని కూడా చెప్పారు. 2 శాతం ప్లస్ లేదా మైనస్లతో 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగేలా చర్యలు ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. సుపరిపాలన, సమర్థవంతమైన పర్యవేక్షణ, నైతిక ప్రవర్తన, రిస్క్ మేనేజ్మెంట్పై దృష్టి సారించడం భారత్ దృష్టి సారించడం జరిగిందన్నారు. సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ (ఎస్ఆర్ఓ) ద్వారా ఫిన్‌టెక్‌లు తమకుతాము స్వీయ–నియంత్రణను పాటించేలా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతోందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతిలోనూ భారత్ ఎకానమీ పటిష్టంగా కొనసాగుతోందన్నారు. -
Azadi Ka Amrit Mahotsav: అప్పుడే.. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వచ్చే ఐదేళ్లపాటు స్థిరంగా ఏడాదికి తొమ్మిది శాతం వృద్ధి చెందితేనే 2028–29 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సోమవారం పేర్కొన్నారు. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో దువ్వూరి చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు... ► ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్దేశించుకున్న ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలను సాకారం చేసుకోడానికి భారత్‌కు ఎనిమిది కీలక సవాళ్లు ఉన్నాయి. ఇందులో మొదటిది వచ్చే ఐదేళ్లలో భారత్ వరుసగా 9 శాతం చొప్పున వృద్ధిని సాధించాలి. తరువాతి అంశాల్లో కొన్ని పెట్టుబడులు పెరగాలి. ఉత్పత్పాదక మెరుగుపడాలి. విద్య, వైద్య రంగాలు పురోగమించాలి. భారీ ఉపాధి కల్పనలు జరగాలి. వ్యవసాయం మరింత తోడ్పాటును అందించాలి. ఎకానమీ ఫండమెంటల్స్ పటిష్టంగా కొనసాగుతూ ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి వంటి స్థూల ఆర్థిక అంశాలు స్థిరంగా ఉండాలి. పలు రంగాల్లో ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి. పాలనా వ్యవస్థ మెరుగుపడాలి. ► రాష్ట్రాలు ఇచ్చే రాయితీలపై మోడీ చర్చను ప్రారంభించారు. అనవసర సబ్సిడీల పరిస్థితికి ఏ ఒక్కరూ కారణం కాదు. అన్ని రాజకీయ పార్టీలూ ఇందుకు బాధ్యత వహించాలి. ► దేశానికి మిగులు బడ్జెట్లు లేవని, ఈ పరిస్థితుల్లో దేశానికి ఆర్థిక పరమైన భద్రతా వలయం తప్పనిసరిగా అవసరమని, కేంద్రం, రాష్ట్రాలు గుర్తించాలి. ► అప్పు తెచ్చుకున్న డబ్బు నుండి ఎలాంటి ఉచితాలను ఇవ్వాలనే అంశాన్ని కేంద్ర, రాష్ట్రాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఇందుకు సంబంధించి ఎంపికలు జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తు తరాలపై అనవసరమైన అప్పుల భారం మోపకూడదు. ► రూపాయి తన సహజ స్థాయిని కనుగొనడం అవసరమే. ఈ విషయంలో సెంట్రల్ బ్యాంక్ జోక్యం పరిమితంగానే ఉండాలి. తీవ్ర ఒడిదుడుకులను నివారించేలా మాత్రమే ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి. డాలర్ మారకంలో మినహాయిస్తే, పలు కరెన్సీలకన్నా భారత్ మెరుగైన స్థితిలో ఉంది. పలు దేశాల మారకంలో బలపడింది. -
ప్రపంచ దేశాలకు భారత్ ఎగుమతులు, 75 రకాల ఉత్పత్తులు గుర్తింపు
న్యూఢిల్లీ: ఎగుమతులను మరింతగా పెంచుకునే దిశగా ప్రభుత్వం, పరిశ్రమ కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా గణనీయంగా ఎగుమతి చేసేందుకు అవకాశమున్న 75 ఉత్పత్తులను గుర్తించినట్లు పరిశ్రమల సమాఖ్య పీహెచ్‌డీసీసీఐ వెల్లడించింది. వీటిలో వ్యవసాయం, ఖనిజాలు తదితర తొమ్మిది రంగాలకు చెందినవి ఉన్నాయని, అమెరికా.. యూరప్ వంటి మార్కెట్లకు వీటిని ఎగుమతి చేయొచ్చని పేర్కొంది. 2027 నాటికి 750 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యాన్ని సాధించేందుకు ఇవి తోడ్పడగలవని తెలిపింది. రాబోయే 75 నెలల్లో అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా, మెక్సికో, ఆస్ట్రేలియా వంటి దేశాలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ వివరించారు. చేపలు, మాంసం, కాటన్, ఖనిజాలు, వాహనాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఫర్నిచర్, మ్యాట్రెస్లు, బొమ్మలు మొదలైనవి గుర్తించిన ఉత్పత్తుల్లో ఉన్నాయి. ప్రస్తుతం మరింతగా ఎగుమతి చేసేందుకు అవకాశాలు ఉన్న ఈ 75 ఉత్పత్తుల వాటా .. మొత్తం ఎగుమతుల్లో 46 శాతంగా ఉంటోంది. వీటి విలువ సుమారు 127 బిలియన్ డాలర్లుగా ఉంది. చదవండి: యుద్ధ నౌకల తయారీకి, నావల్ గ్రూప్‌తో జీఆర్ఎస్ఈ జట్టు -
మౌలికం... డిసెంబర్లో 1.3 శాతం ‘మైనస్’
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పారిశ్రామిక విభాగాల గ్రూప్ 2020 డిసెంబర్లో 1.3 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గ్రూప్ ఉత్పత్తిలో వృద్ధిలేకపోగా క్షీణత నమోదుకావడం వరుసగా ఇది మూడవనెల. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో 40 శాతం పైగా వాటా కలిగిన గ్రూప్‌లోని క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్ రంగాలు పేలవ పనితీరును ప్రదర్శించాయి. 2019 డిసెంబర్లో ఈ గ్రూప్ 3.1 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. డిసెంబర్ ఐఐపీ గణాంకాలు ఫిబ్రవరి మొదటి లేదా రెండవ వారాల్లో వెలువడనున్నాయి. వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన మౌలిక రంగం గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 2020 డిసెంబర్లో బొగ్గు, విద్యుత్ మినహా అన్ని రంగాలూ క్షీణతను చూశాయి. ► క్రూడ్ ఆయిల్ (–3.6 శాతం), సహజ వాయువు (–7.2 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–2.8 శాతం), ఎరువులు (–2.9 శాతం), స్టీల్ (–2.7 శాతం), సిమెంట్ (–9.7 శాతం) క్షీణతలో ఉండగా, బొగ్గు (2.2 శాతం), విద్యుత్ (4.2 శాతం) వృద్ధి రేటును నమోదుచేసుకున్నాయి. ► 2020–21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ చూస్తే, గ్రూప్ ఉత్పత్తి క్షీణత 10.1 శాతంగా ఉంది. 2019–20 ఇదే సమయంలో 0.6 శాతం స్వల్ప వృద్ధి రేటు నమోదయ్యింది. ► కాగా 2020 సెప్టెంబర్‌లో గ్రూప్ 0.1 శాతం క్షీణత నమోదుచేసుకున్నట్లు తొలి గణాంకాలు పేర్కొనగా, తాజాగా ఈ గణాంకాలను 0.6 శాతం వృద్ధిగా సవరించడం జరిగింది. నిరాశ కలిగిస్తోంది... కీలక మౌలిక రంగం వరుసగా మూడవనెల డిసెంబర్‌లోనూ క్షీణతలో కొనసాగడం నిరాశను కలిగిస్తోంది. అయితే ఆటో పరిశ్రమ పురోగతి, చమురు యేతర ఉత్పత్తుల ఎగుమతులు తత్సబంధ అంశాలను పరిశీలనలోకి తీసుకుంటే, డిసెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ– ఐఐపీ స్వల్పంగానైనా 0.5 శాతం నుంచి 1.5 శాతం శ్రేణిలో వృద్ధిని నమోదుచేసుకుంటుందని భావిస్తున్నాం. – అదితి నాయర్ ఇక్రా ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ -
లెదర్ పార్కుకు గ్రీన్ సిగ్నల్
► రూ.125 కోట్లు విడుదల చేసి కేంద్రం ► లెదర్ పార్కు ఏర్పాటైతే తమ ► గ్రామాలు కనుమరుగవుతాయని ► బాధితుల ఆందోళన ► 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ వాదన కోట మండలం కొత్తపట్నం సెజ్‌లో అంతర్జాతీయ తోళ్ల పరిశ్రమ(మెగా లెదర్ క్లస్టర్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ రూ.125 కోట్లు మంజూరు చేసింది. 2012 నుంచి తీవ్ర వివాదాస్పద అంశంగా మారిన ఈ వ్యవహారానికి రాష్ర్ట ప్రభుత్వ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆజ్యం పోసింది. సాక్షి ప్రతినిధి - నెల్లూరు: కోట మండలం కొత్తపట్నం సెజ్‌లో తోళ్ల పరిశ్రమ ఏర్పాటు కోసం సర్వేనంబర్ 321లో 530 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. కొత్తపట్నం పంచాయితీ వావిళ్లదొరువు వద్ద 2012, డిసెంబరు 27వ తేదీ ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులు గ్రామసభ ఏర్పాటు చేశారు. అప్పటి గూడూరు సబ్ కలెక్టర్ నివాస్, డీఆర్ఓ రామిరెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ మహేష్ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు గ్రామసభకు హాజరయ్యారు. లెదర్ పార్క్ ఏర్పాటును చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి గ్రామసభను అడ్డుకున్నారు. షామియానాలను కూలదోశారు. కుర్చీలను విసిరి చెల్లాచెదురుగా పడవేశారు. దీంతో హడలిపోయిన అధికారులు గ్రామసభను వాయిదా వేశారు. ఆ తర్వాత 2013, మార్చి 6న అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీధర్ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ రెండోసారి గ్రామసభ నిర్వహించారు. ప్రజలు కలెక్టర్‌తో పాటు అధికారులందరి మీద తిరగబడ్డారు. ప్రజాసంఘాలు, పౌరహక్కులు, జనవిజ్ఞాన వేదిక నాయకులు బాధిత గ్రామాల ప్రజలకు మద్దతు ప్రకటించారు. అధికారులపై ప్రజలు ఇసుక వర్షం కురిపించి, కారం పొడి చల్లి, చెప్పులు విసిరారు. పోలీసు వలయంలో జిల్లా కలెక్టర్‌ను తరలించారు. నిరసన కారుల మధ్య గోవిందపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులుండటంతో పోలీసులు, అధికారులు వెనక్కి తగ్గారు. పాఠశాల విద్యార్థులను గ్రామసభకు తీసుకువచ్చినవారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆందోళనల మధ్యే ప్రజాభిప్రాయం తోళ్ల పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వ అభిప్రాయం ఒకరు విన్నా పబ్లిక్ హియరింగ్ పూర్తయినట్లేనని కలెక్టర్ శ్రీధర్ ప్రకటించారు. ఈ ప్రకటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ వివాదాల అనంతరం లెదర్ పార్కు వ్యవహారం మరుగున పడింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రతిపాదనకు మళ్లీ ప్రాణం పోసింది. లెదర్ పార్కు ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. రాష్ర్ట ప్రభుత్వ కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలిపి రూ.125 కోట్లు మంజూరు చేసింది. ఇక్కడ రూ.500 కోట్లు పెట్టుబడులు పెట్టడం ద్వారా 20 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని.. ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం కూడా లభిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. జనంలో భయం తోళ్ల పరిశ్రమ ఏర్పాటు వల్ల చెన్నై నుంచి కొత్తపట్నం వరకు రోజూ 800 లారీల రాకపోకలుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పార్కు పనిచేయడం ప్రారంభిస్తే కొత్తపట్నం పంచాయితీ పరిధిలో ఉన్న వావిళ్లదొరువు, గోవిందపల్లి, గోవిందపల్లిపాళెం, మిట్టపాళెం, జంగిటవానిదిబ్బ, శ్రీనివాససత్రం, యమదిన్నెపాళెం, గున్నంపడియ గ్రామాలు కనుమరుగయ్యే అవకాశముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లెదర్ పార్కు చుట్టుపక్కల ఉండే 40 గ్రామాలు జల, వాయు కాలుష్యం బారిన పడే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు. పరిశ్రమ ఏర్పాటుతో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన 5 సొనకాలువలు, చెరువులు, సముద్రపు క్రీక్(ఉప్పు కాలువలు) పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. క్రీక్‌ను నమ్ముకుని చేపల వేటతో జీవిస్తున్న మూడు వందల గిరిజన కుటుంబాలు, గోవిందపల్లి పాళెంలోని రెండు వందల మత్య్సకార కుటుంబాలకు జీవనోపాధి పోయే ప్రమాదం ఏర్పడుతుందని చెబుతున్నారు. తోళ్లపరిశ్రమలో పచ్చితోలును నిల్వ చేసేందుకు వాడే సున్నం, ఉప్పు, సోడియం సల్ఫైడ్, తోళ్లను శుభ్ర పరిచే టానింగ్ ప్రక్రియలో వాడే సర్ఫూరిక్ యాసిడ్, క్రోమియం, ఫినాల్ లాంటి రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవని జనం ఆందోళన చెందుతున్నారు. ఈ మిశ్రమాలతో కూడిన వాసనను పీల్చడం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, అల్సర్లతో పాటు ముక్కులకు, చేతివేళ్లకు సంబంధించిన వ్యాధులు సోకుతాయని వారు ఆందోళన చెందుతున్నారు. కుళ్ళిపోయిన వ్యర్థాల ద్వారా వచ్చే నీటిని సముద్రంలోకి వదలడం వల్ల మత్య్ససంపద అంతరించిపోతుందని మత్స్య కారులు చెబుతున్నారు. ఆధునిక పరిజ్ఞానంతో ఇబ్బందులుండవు కోట వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన మెగా లెదర్‌పార్క్ నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. మత్స్య కారులు, లెదర్ పార్క్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనవసర భయంతో పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని వారు చెబుతున్నారు. -
వ్యాపార రంగానికి సరికొత్త జోష్..
ఎన్నో ఆశలు రేపుతున్న వ్యాపార రంగం కొత్త సంవత్సరంలోకి సరికొత్త జోష్ తో అడుగుపెడుతోంది. దేశంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త సర్కారు సంస్కరణల బాట పట్టడం.. స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగా ఉండటంతో భారత ఆర్థిక వ్యవస్థపై మళ్లీ విశ్వాసం చిగురించింది. మరోపక్క, అంతర్జాతీయంగా చమురు ధరలు నేలకు దిగి రావడం కూడా మనకు చేదోడుగా నిలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో మరింత పైకి ఎగిసిన చమురు ధరలు.. చివరికొచ్చేసరికి దిగిరావడం సామాన్య ప్రజలకు ఊరటనిచ్చాయి. తగ్గిన చమురు ధరలు ఈ ఏడాది జూన్ నుంచీ చమురు ధరలు గణనీయంగా పడిపోవడం భారత్ ఆర్థిక వ్యవస్థకు ఒక సానుకూల అంశంగా మారింది. జూన్‌లో 110 డాలర్ల స్థాయిలో ఉన్న బ్రెంట్ క్రూడ్ ధరలు డిసెంబర్ నాటికి 60 డాలర్ల స్థాయికి పడిపోయాయి. పెట్రోల్ డీజిల్, ధరలు డిసెంబర్ లో రెండు సార్లు తగ్గడంతో వినియోగదారులకు వరంగా మారాయి. పెట్రోల్ ధర గత ఆగస్టునుంచి వరుసగా ఎనిమిదో సారి తగ్గగా, డీజిల్ ధర గత అక్టోబర్నుంచి వరుసగా నాలుగోసారి తగ్గడం గమనార్హం. అయితే తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న చమురు ధరలు ఎప్పుడు స్థిరత్వం పొందుతాయనే అంశంపై మాత్రం పూర్తి అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామం దేశీ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తోంది. ఈ-కామర్స్ జోరు- రిటైల్ బేజారు ఇండియాలో ఈ కామర్స్ పరిశ్రమ జోరుగా వృద్ధి సాధిస్తోంది. 2014లో ఈ-కామర్స్ విజృంభణ ముఖ్యాంశాల్లో ఒకటి. చైనా దిగ్గజ సంస్థ అలీబాబా సహా పలు దేశాల ఈ కామర్స్ సంస్థల దిగ్గజాలు భారత్‌కు క్యూ కట్టారు. ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలు బిగ్ బిలియన్ డే లాంటి పేర్లతో అత్యంత చవగ్గా వస్తువులు ఇచ్చేయడం లాంటివి ఈ కామర్స్ మరింత పుంజుకోడానికి దోహదపడ్డాయి. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబా రూ.1,50,000 కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓ విజయవంతం కావడం, ఆ సంస్థ చీఫ్ జాక్ మా ఆసియాలోనే అపర కుబేరిడినా అవతరించడం గమనార్హం. దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని ఈ కామర్స్ సంస్థలు హామీ ఇవ్వడంతో రిటైల్ సంస్థల్లో కొంత అనిశ్చితి నెలకొంది. ఈ విభాగం నేరుగా వ్యాపార రంగంలోకి ప్రవేశించడం వల్ల తమ అమ్మకాలు దెబ్బతింటాయని రిటైల్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. తమ అమ్మకాలు భారీ తగ్గుముఖం పట్టేఅవకాశం ఉందని రిటైల్ సంస్థలు బేజారెత్తుతున్నాయి. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు లాభాలతో దుమ్మురేపాయి. ఐదేళ్ల తరువాత మళ్లీ సెన్సెక్స్ ఏకంగా 6,038 పాయింట్లు(29%) ఎగసింది. ఒక దశలో చరిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో డిసెంబర్ 3న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి రూ. 100 లక్షల కోట్లను (ట్రిలియన్లు) అధిగమించింది. ఈ ఏడాది 21,140 పాయింట్లతో ఆరంభమైన సెన్సెక్స్.. డిసెంబర్ 24 నాటికి 27,209 పాయింట్లతో కొనసాగుతోంది. ఇంతక్రితం 2009లో మాత్రమే సెన్సెక్స్ 7,817 పాయింట్లు జమ చేసుకుంది. ఇక ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ సైతం దాదాపు 30% పుంజుకోవడం విశేషం. ఆశాజనకంగా జీడీపీ ఈ ఏడాది రెండో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధిరేటు 5.3 శాతంతో కాస్త కిందికి దిగిజారినా.. గతం కంటే మెరుగ్గా ఉండటం ఆశాజనకంగా మారింది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5.7 శాతం వృద్ధితో ఉత్సాహాన్ని ఇచ్చినా.. తరువాత కిందికి జారిపోవడం కాస్త నిరుత్సహాన్ని నింపింది. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఐదు శాతం దిగువన జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసుకున్నా.. క్రమేపీ ఇది పెరగడం మాత్రం ఉత్సాహాన్ని ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.4% వృద్ధిని సాధించగలదని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ తాజాగా అంచనా వేసింది. పెట్టుబడుల వాతావరణం పుంజుకోవడం ఇందుకు సహకరించగలదని ఒక నివేదికలో తెలిపింది. ఎయిర్ ఏషియా ఇండియా సేవలు ఇండిగో, స్పైస్‌జెట్, గో ఎయిర్, జెట్‌లైట్‌ల తరహాలో ఎయిర్ ఏషియా కూడా చౌక విమానయాన సర్వీసులను అందించడానికి ఈ ఏడాది శ్రీకారం చుట్టింది. టోనీ ఫెర్నాండెస్ నేతృత్వంలోని మలేసియా విమానయాన సంస్థ, ఎయిర్ ఏషియా, టాటా సన్స్, అరుణ్ భాటియాకు చెందిన టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్‌లు కలసి 49:30:21 భాగస్వామ్యంతో ఎయిర్ ఏషియా ఇండియా సంస్థను ఏర్పాటు చేశాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది స్పైస్ జెట్ కష్టాలు కూరుకుపోయింది. విదేశీ, దేశీ సరఫరాదారులు, విమానాశ్రయ నిర్వాహకులు, చమురు కంపెనీలకు బకాయిలు రూ. 1,230 కోట్లకు ఎగబాకడంతో అవి తక్షణం చెల్లింపు జరపాలంటూ పట్టుబట్టాయి. దీంతో ఒకరోజు సర్వీసుల నిలిపివేత వరకూ పరి స్థితి వెళ్లింది. చివరకు ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇవ్వడంతో మళ్లీ సర్వీసులు కొనసాగుతున్నాయి. పెను సవాళ్లతో ఆటోమొబైల్ రంగం అమ్మకాలపరంగా ఆటోమొబైల్ కంపెనీల ప్రయాణం ఈ ఏడాది పెను సవాళ్లను ఎదుర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆటో ఎక్స్‌పోలో ఏకంగా 70 కొంగొత్త మోడల్స్ ఊరించిన మార్కెట్ మాత్రం ఎగుడుదిగుడుగా సాగింది. మొబీలియో, సియాజ్, జెస్ట్ వంటి వాహనాలతో ఏడాది పొడవునా కొత్త కార్లు సందడి చేశాయి. అయితే, అమ్మకాలు మాత్రం ఒక నెల పెరగడం, మరో నెల తగ్గడం లాగా సాగింది. ఏడాది తొలి 11 నెలల్లో అమ్మకాలు 10 శాతం మేర క్షీణించాయి. కాంపిటీషన్ కమిషన్ 14 కార్ల సంస్థలపై రూ. 2,545 కోట్ల జరిమానా విధించడం మరో చెప్పుకోతగ్గ పరిణామం. అయితే, సవాళ్లెన్ని ఎదురైనప్పటికీ.. ఆటోమొబైల్ కంపెనీలు మాత్రం ఇన్వెస్ట్మెంట్ల విషయంలో వెనక్కి తగ్గలేదు. మహీంద్రా, మారుతీ, హీరో మోటోకార్ప్, బజాజ్ తదితర సంస్థలు 5 బిలియన్ డాలర్ల మేర భారీ పెట్టుబడులను ప్రకటించాయి. కొత్త సంవత్సరం సానుకూలంగా ఉండగలదని ఆటోమొబైల్ కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య ' వ్యాపార' పోటీ వ్యాపార రంగంలో తెలుగు రాష్ట్రాలు తమ ఉనికిని చాటి చెప్పేందుకు యత్నిస్తున్నాయి. ఆ రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో వ్యాపార కార్యకలాపాల్ని మరింత ముందుకెళ్లేందుకు బాటలు వేసుకుంటున్నాయి. కొత్త ప్రాజెక్టులు, విస్తరణలు, పెట్టుబడులు ఇలా అన్నింటా రెండు రాష్ట్రాల మధ్య ఒక రకంగా పోటీకి తెరతీసింది. కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి రెండు రాష్ట్రాలు పోటీ పడుతుండటంతో కార్పొరేట్ రంగం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించి ముందంజలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ దిశగా యత్నాలు ఆరంభించింది. హీరో మోటార్ సైకిల్స్ ప్రాజెక్ట్ గురించి ఇరు రాష్ట్రాలు పోటీ పడగా చివరకు ఆ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. అయితే ప్రపంచ అతిపెద్ద రిటైల్ ఫర్నిచర్ సంస్థ ఐకియూ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. అలాగే ఇసుజు, ఏషియన్ పెయింట్స్ వంటి సంస్థలు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే తెలంగాణలో ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, కోజెంట్ గ్లాస్ యూనిట్, జాన్సన్ అండ్ జాన్సన్, కోకకోలా తదితర కంపెనీలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ఐటీ 'విస్తరణ ' తెలంగాణ ప్రభుత్వం గ్రామ స్థాయికి ఐటీని విస్తృతం చేస్తోంది. హైదరాబాద్‌ను వైఫై నగరంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే తన కార్యాచరణను మరింత విస్తృతం చేసింది. తొలుత హైటెక్‌సిటీ ప్రాంతంలో ఎయిర్‌టెల్‌తో కలిసి పబ్లిక్ వైఫై అందుబాటులోకి తెచ్చింది. టెక్నాలజీ స్టార్టప్‌ల కోసం టి-హబ్ పేరుతో దేశంలో అతిపెద్ద ఇంక్యుబేషన్ కేంద్రం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఏర్పాటవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ కూడా ఐటీకి విస్తృత ప్రాధాన్యం ఇస్తోంది. ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో డిజిటల్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగానే గూగుల్, విప్రో తదితర సంస్థలతో చేతులు కలిపింది. ఏరోస్పేస్ కు ప్రత్యేక పాలసీ తెలంగాణ ప్రభుత్వం ఏరోస్పేస్‌కు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. స్విట్జర్లాండ్ కంపెనీ రువాగ్ ఏవియేషన్ తయారీ డార్నియర్-228 విమానాల కోసం విమాన బాడీ, రెక్కల తయారీ కేంద్రాన్ని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఆదిభట్లలోని ఏరోస్పేస్, ప్రెసిషన్ ఇంజనీరింగ్ సెజ్‌లో నెలకొల్పుతోంది. ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రాన్ సహకారంతో జీఎంఆర్ గ్రూప్ ఏరోస్పేస్ ట్రైనింగ్ హబ్‌ను శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేస్తోంది.