First Automatic Cashier-Less Shopping Store In Dubai Mall - Sakshi
Sakshi News home page

ఆ భారీ షాపింగ్‌ మాల్‌లో కనిపించని క్యాషియర్‌.. మరి పేమెంట్‌ ఎలాగంటే..

Published Mon, Aug 7 2023 10:36 AM | Last Updated on Mon, Aug 7 2023 1:32 PM

First Automatic Cashierless Shopping Store in Dubai - Sakshi

ఏవైనా నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలంటే ఇంటి పక్కనున్న కిరాణా దుకాణానికో లేదా మార్కెట్‌కు వెళుతుంటాం. పెద్ద పట్టణాలు, నగరాల్లో అయితే షాపింగ్‌ స్టోర్‌కు వెళుతుంటారు. షాపింగ్‌మాల్‌లోకి వెళ్లిన తరువాత మనకు కావాల్సిన వస్తువులు తీసుకున్నాక, బిల్లింగ్‌ కౌంటర్‌ దగ్గరకు వచ్చి, క్యాష్‌ పే చేస్తుంటాం. అయితే దుబాయ్‌లోని ఆ స్టోర్‌లో క్యాషియర్‌ ఉండరు. అంటే వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునేందుకు ఎవరూ ఉండరు. మరి సరుకులు తీసుకున్నాక ఆ స్టోర్‌లో క్యాష్‌ ఎలా పే చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

యూఏఈలోని దుబాయ్‌ పగలు, రాత్రి అనే తేడాలేకుండా నిత్యం వెలుగు జిలుగులతో మెరిసిపోతుంటుంది. ఈ మహానగరంలో 2018లో అమెజాన్‌ కెరెఫోర్‌ మినీ అనే షాపింగ్‌ స్టోర్‌ తెరిచింది. ఇది చూసేందుకు ఇతర స్టోర్ల మాదిరిగానే కనిపిస్తుంది. అయితే ఇది అత్యాధునిక స్టోర్‌గా పేరొందింది. ఈ స్టోర్‌లో సరుకులు కొనుగోలు చేసే వినియోగదారుల దగ్గర ఈ స్టోర్‌కు సంబంధించిన యాప్‌ ఉండాలి. ఇది ఉంటేనే స్టోర్‌లోనికి ఎంట్రీ లభిస్తుంది. లోనికి వచ్చాక వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు.  ఈ స్టోర్‌లో హై రిజల్యూషన్‌ కలిగిన సీసీ కెమెరాలు ఉంటాయి. అవి సెన్సార్‌ను కలిగివుంటాయి. ఇవి వినియోగదారుల ప్రతీ కదలికను పర్యవేక్షిస్తుంటాయి.

స్టోర్‌లోని వచ్చిన వినియోగదారులు తాము సరుకులు తీసుకుని బ్యాగులో వేసుకోగానే రసీదు వివరాలు వారి ఫోనులోప్రత్యక్షమవుతాయి. షాపింగ్‌ పూర్తయిన తరువాత పేమెంట్‌ ఆదే ఫోను ద్వారా చేయాల్సివుంటుంది. కెరెఫోర్‌ సీఈఓ హనీ వీస్‌ మాట్లాడుతూ భవిష్యత్‌లో అంతా ఇలానే ఉంటుందని, ఈ స్టోర్‌లోకి వచ్చే వినియోగదారులు ప్రత్యేక అనుభూతికి లోనవుతారని అన్నారు.
ఇది కూడా చదవండి: 200 ఏ‍ళ్ల నేలమాళిగలోకి దూరిన అమ్మాయిలు.. లోపల ఏముందో చూసి..  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement