న్యూఢిల్లీ: మనకు లేదనుకుంటే బాధ... ఎదుటివారికి ఉందనుకుం టే మరింత బాధ. అది మనల్ని ఆవహించినప్పుడు అంతగా తెలీదు... దహిస్తున్నప్పుడు తెలుస్తుంది. దాన్ని వదిలించుకోవడం ఎంత కష్టమో..! అసూయ అంటే ఒక భావోద్వేగం. ప్రపంచంలో దీనికి అ తీతులైనవారెవరైనా ఉన్నారంటే వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చేమో.
అసూయకు లోనైతే...
అసూయకు గురైనవారు భయం, కోపం, ఓటమి, అనుమానం, ఒత్తిడి, విచారం, బాధ, ఆత్మన్యూనత లాంటి వివిధ రకాల భావాలకు లోనవుతా రు. నిరుత్సాహపూర్వకమైన, నిరాశాపూరితమైన పరిస్థితుల్లోకి ఇది వారిని నెట్టేస్తుంది. కనీసం సన్నిహితులతో కూడా పంచుకోలేని పరిస్థితి ఇది. దీని ని అణచుకోకుండా పెరగనిచ్చామంటే అది స్లోపాయిజన్‌లా మారిపోతుంది.
అంచనాలు అందుకోలేకపోవడం
మన గురించి, మన చుట్టూ ఉన్నవారి గురించి చాలాసార్లు మనం కొన్ని వాస్తవ విరుద్ధమైన అంచనాల్లో ఉంటాం. అదే విధంగా మన పనులన్నీ సులభంగా అయిపోవాలని, అన్నీ తేలికగా అమరిపోవాలని ఆశిస్తాం. అయితే అలా జరగనప్పుడు, అవి సమకూర్చుకున్నవారి వైపు అనుకోకుండానే చూస్తాం. నిజానికి అది అనవసరమైన చూపే. కానీ ఆ చూపే మనల్ని అసూయ అనే అగాథంలోకి విసిరేస్తుంది.
అభద్రతాభావం
సమాజంలో మన చుట్టూ ఉన్నత స్థాయిలో మన జీవితం కూడా ఉండాలని భావిస్తాం. అలా కానప్పుడు మనల్ని మిగిలిన వారు చిన్నచూపు చూస్తారేమోననే అభద్రతా భావానికి లోనవుతాం. ఆ అభద్రతా భావమే ఎదుగుతున్నవారిపై మనం అసూయపడేలా చేస్తుంది.
పోలిక వద్దు
మనం ఎవరికి వారు వైవిధ్యంతో, మనదైన వ్యక్తిత్వంతో జన్మించాం. సమాజపరమైన స్థాయి బేధా లు ఎలా ఉన్నా... మనం మాత్రం ఇతరులతో పోల్చుకోవడం మానుకోవాలి. మనం స్పెషల్ అనే ఫీలింగ్‌ని ప్రేమించాలి. ఇతరులకు ఉన్న డబ్బు, కీర్తి, విజయాలు, రూపం... మనకు లేవే అనుకోవడం కన్నా మనకు ఉన్నవే ఉన్నతమైనవిగా భావించి ఆనందించాలి. మన ప్రయాణం మనదే అని గుర్తించాలి.
మన గురించి మనమే చింతించడం మానాలి
ఎప్పుడూ మన గురిం చే ఎక్కువగా ఆలోచిం చడం వల్ల వచ్చే సమస్యల్లో ఇదొకటి. కాబ ట్టి అది తగ్గించాలి. ఇతరుల్ని పొగడడం నేర్చుకోవాలి. ఇతరుల విజ యాలను గుర్తించడం, వారిని ప్రశంసించడం అల వరచుకోవాలి. తోటివారిని అభినందించడం ద్వారా వచ్చే ఆనందాన్ని ఆస్వాదించాలి. ఇలాంటి మార్పు చేర్పుల వల్ల ఒకప్పుడు మనకు అసూయ ను కలిగించినవి ఎంత చిన్న విషయాలో అర్థమౌతుంది.
లాజిక్ అవసరం
ఒక వ్యక్తి శారీరకంగా ఫిట్‌గా ఉండి, చూడడానికి ఆరోగ్యవంతంగా కనిపిస్తే వెంటనే అసూయకు గురవ్వడం సులభం. అయితే మనం నిజంగా రోజూ వర్కవుట్స్ చేయగలమా? మనం ఆరోగ్యకరమైన ఆహారానికి మాత్రమే పరిమితం కాగలమా? అలా కానప్పుడు ఇక అసూయ చెందాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి లాజికల్ థిం కింగ్‌తో అంకురించిన అసూయ ఆమడ దూరం పారిపోతుంది.
మీ జీవితంలోని మంచి మీద దృష్టి పెట్టండి
మన జీవితంలోనూ ఎన్నో విజయాలుంటాయి. చుట్టుపక్కల ఉన్నవారు సాధించలేనివేవో మనం సాధించే ఉంటాం. అవి గుర్తించాలి. చాలా మంది కి లేని సామర్థ్యాలను మనకు భగవంతుడు ఇచ్చే ఉంటాడు. అవి ఏమిటో వెలికి తీసి వాటిని ఉపయోగించుకుని ఇతరులకుసాయపడడం మొదలు పెట్టాలి. తప్పకుండా మనకన్నా చాలా విషయా ల్లో తక్కువగా ఉన్నవారు ఉండే ఉంటారు. వారిని చూసి గొప్పలకు పోకుండా వారికి అవసరమైన సాయం చేయడం ద్వారా మన ఉన్నతిని మనమే గౌరవించుకున్నవారమవుతాం.
అసూయ గుడ్డిది కూడా
ప్రేమ ఒక్కటే కాదు అసూయ కూడా గుడ్డిదేనట. డెలావెర్ యూనివర్సిటీకి చెందిన సైకాలజీ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన ఓ సర్వేలో అసూయ అనే పొరలు కళ్లకు కమ్ముకోవడం అనే మాట నానుడికి అనేది మాత్రమే కాదని నిజమని తేలింది. మనిషి మస్తిష్కంలో అసూయ పెరిగిపోతే అది కంటి ముందు కనపడేచిత్రాలను చూడనీకుండా తాత్కాలికంగా అంధత్వాన్ని ప్రాప్తింపజేస్తుందని తమ ముందున్న వాటిలో ఏది సరైందో తెలుసుకోలేకపోతారని ఈ సర్వేలో వెల్లడైంది. అలాగే అనుబంధాలకు సంబంధించిన అంశంలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా ఈర్ష్యాసూయలకు గురవుతున్నారని మిస్సోరి వెస్ట్రన్ స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
మెదడే కీలకం
బ్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలు మనల్ని జెలసీకి గురయ్యేలా చేస్తున్నాయని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించే సిఎన్‌ఎస్ స్పెక్ట్రమ్స్ జర్నల్ తన తాజా వ్యాసంలో ఓ పరిశోధనా ఫలితాలు వెల్లడిం చింది. మానవ అనుభూతికి సంబంధించిన ఒక సహజమైన భావోద్వేగమే అయినప్పటికీ ఇది ఆత్మహత్యలకు, ఉన్మాదానికి, తీవ్రమైన మానసిక ఒత్తిడికి, హత్యలకు సైతం దారితీయడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నట్టు వీరు గుర్తించారు. పరిశోధకుల్లో ఒకరైన డొనాటెల్లా మరాజ్జిటి మాట్లాడుతూ... ‘అసూయ కలిగే పరిస్థితిని ఒకప్పుడు కేవలం సైకాలజిస్ట్‌లు, సైక్రియాట్రిస్ట్‌లు మాత్రమే పరిశీలించేవారు. అయితే ఇప్పుడు ఇది ఒక న్యూరో సైన్స్‌కు సంబంధించిన అంశంగా కూడా మారింది’ అన్నారు.
ఫేస్‌బుక్ ఒక కారణం
ఇటీవలి ఆధునిక పరిస్థితులు ఈ భావోద్వేగం మరింత పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని గుర్తిస్తున్నారు. వాటిలో ఫేస్‌బుక్ కూడా ఒకటి. వ్యక్తిగత విషయాలను చెప్పుకునేందుకు చాలా మంది ప్రాధాన్యం ఇస్తున్న ఈ సోషల్ మీడియా అసూయను రాజేస్తోందట. అత్యధికంగా ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నవారిలో అత్యధికులు అసూయాపరులుగా మారుతున్నారని ఓ ఆన్‌లైన్ సర్వేలో తేలింది.
మానసిక నిపుణుల మాట
స్వల్పంగా అసూయ ఉండడం అనేది చాలా సహజమైనది, అవసరమైనది కూడా. జీవితంలో ఎదిగేందుకు విజయాలు సాధించేందుకు అది ఉపయోగపడుతుంది. అయితే కొందరి విషయంలో ఇది శృతి మించుతోంది. దీన్నే ‘డెల్యూజనల్ డిజార్డర్’గా సైకలాజికల్ పరిభాషలో వ్యవహరిస్తాం. ఈ పరిస్థితికి లోనైనవారు తాము కోరుకున్నది ఇతరులకు దక్కడాన్ని సహించే దశను దాటిపోతారు. దీంతో వీరిలో నేరస్వభావం కూడా ఏర్పడుతుంది. నలుగురితో కలవలేకపోవడం, తరచుగా ఇతరులతో పోల్చుకుంటూ బాధపడుతుం డడం... వంటి లక్షణాలున్న వారి విషయంలో కుటుంబసభ్యులు అప్రమత్తంగా ఉండాలి. ఈ తరహా స్వభా వంతమలో పెరుగుతుంటే అదొక వ్యాధిగా గుర్తిం చాలే తప్ప తమ ఆలోచన సరైనదే అనుకోకూడదు. అవసరమైతే చికిత్సకు సిద్ధపడాలి. మరోవైపు చిన్నవయసు నుంచే ఈ తరహా స్వభావాలు పెరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలని గుర్గావ్‌లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి చెం దిన మానసిక వైద్యుడు అన్నారు.
దహిస్తోంది అసూయాగ్ని
Published Tue, Jul 29 2014 10:29 PM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM
Advertisement
Advertisement