slow poison
-
మీకు తెలుసా? లతా మంగేష్కర్‌పై గతంలో విష ప్రయోగం జరిగింది!
ఆమె గొంతెత్తి పాడితే సినీ ప్రియులు పులకరించిపోయారు. గాన మాధుర్యానికి మంత్రముగ్ధులయ్యారు. ఎందుకంటే ఆమె గొంతులో అమృతం ఉంది. దానికి అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించగల సామర్థ్యం ఉంది. ఆ కోకిల స్వరం నుంచి జాలువారిన పాటలు వేలల్లోనే ఉన్నా తెలుగులో మాత్రం మూడంటే మూడు పాటలే పాడింది. ఇప్పుడేకంగా ఏ పాట పాడనంటూ శాశ్వతంగా మూగబోయింది. ఆదివారం ఉదయం లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆమె మృతిపై పలువురు సెలబ్రిటీలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గతంలో ఆమెపై విషప్రయోగం జరిగిన విషయాన్ని సైతం ప్రస్తావిస్తున్నారు. 1963లో లతా మంగేష్కర్‌పై విషప్రయోగం జరిగింది. దీంతో ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడింది. వాంతులు కూడా చేసుకుంది. కాళ్లు సైతం కదపడానికి వీల్లేక నొప్పితో విలవిల్లాడుతూ మూడురోజుల పాటు మంచానికే పరిమితమైంది. ఆమెను పరీక్షించిన డాక్టర్.. ఎవరో ఆమెకు స్లోపాయిజన్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని లతాజీకి సన్నిహితంగా మెలిగే ప్రముఖ రచయిత్రి పద్మా సచ్దేవ్ ఓ పుస్తకంలో వెల్లడించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన లతా మంగేష్కర్ తర్వాత కోలుకున్నారు కానీ ఈ విషప్రయోగంతో చాలా నీరసపడిపోయారని అందులో పేర్కొన్నారు. చాలా రోజుల పాటు ఆమె మంచంపైనే ఉండిపోయారట. ఆ సమయంలో గేయ రచయిత సుల్తాన్ పురీ ప్రతిరోజు సాయంత్రం ఆమె ఇంటికి వచ్చి సరదాగా కథలు, కవితలు, జోక్స్ చెప్పి ఆమెను నవ్వించేవారని, ఆమె తినే ప్రతి వంటనూ ముందు ఆయన తిని చెక్ చేసేవారట. ఇలా కొన్నాళ్లపాటు ఆమె వెన్నంటే ఉంటూ ఆమె కోలుకునేందుకు సుల్తాన్‌పురీ ఎంతగానో సాయపడినట్లు తెలుస్తోంది. -
Health Tips: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..!
ప్రకృతి సిద్ధంగా దొరికే తేనె.. ఇంటివైద్యం మొదలుకొని ఆయుర్వేదం వరకు రకరకాల సమస్యల నివారణకు వాడుకలో ఉన్నదే. ప్రకృతి ప్రసాదమేకదా! అని ఎట్లాపడితే అట్లా వాడితో ఔషధం విషంగా మారుతుంది. అవును!! చాలా మంది పరకడుపున వేడినీళ్లలో తేనె కలుపుకుని తాగుతారు. సాధారణంగా ఈ ప్రక్రియను శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కరిగించి బరువును తగ్గిస్తుందనే నమ్మకంతో అనుసరిస్తారు. సహజంగానే తీపి గుణం కలిగిన ప్రకృతి సిద్ధమైన తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మాగ్నిషియం, కాపర్, మాంగనీస్, పొటాషియం, జింక్ వంటి మినరల్స్, ఎన్జైమ్స్ పుష్కలంగా ఉంటాయి. తీపికి ప్రత్నామ్నాయంగా డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు కూడా ముడి తేనె ఉపయోగంలో ఉంది. అంతేకాక ఇది దగ్గు నుంచి ఉపశమనాన్నిస్తుంది. ప్రేగులను శుభ్రపరుస్తుంది. కాలిన గాయాలను నయం చేస్తుంది. చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసుంది కూడా. ఇంతటి సుగుణాలు ఉన్న తేనెను హెర్బల్ టీ, లెమన్ టీ, వేడి పాలు.. వంటి ఏ రకమైన వేడిపదార్ధాలతోనైనా కలిపి తాగడం ఆయుర్వేదం ప్రకారం ప్రమాదమని ప్రముఖ ఆయుర్వేద ఎక్స్పర్ట్ డా. రేఖా రాధామణి హెచ్చరిస్తున్నారు. కారణమేమిటో తెలుసుకుందాం.. చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!! ►తేనెను వేడిగా తీసుకుంటే అది శరీరంలో స్లో పాయిజన్‌గా మారుతుంది. ఒక్కసారి దీనిని వేడిగా తీసుకుంటే దీనిలోని పోషకాలు శరీరంలో హానికారక విషాలుగా రూపాంతరం చెందుతాయి. ఇవి శరీరంలో క్రమంగా పెరిగి అనేక వ్యాధులకు కారణమవుతుంది. ►ముడి తేనెలో పోషకాలు సహజంగానే అధికంగా ఉంటాయి. దీనిని అలాగే నేరుగా వినియోగించాలి. ఐతే స్టోర్లలో లభించే పాశ్చరైజ్డ్ తేనెలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్, కార్న్ (మొక్కజొన్న) సిరప్ వంటివి తీపి కోసం కలుపుతారు. ఇది డయాబెటిస్ రోగులకు చాలా ప్రమాదకరం. అలాగే ముడి తేనెలో ఉండే పుప్పొడి, యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు కూడా దీనిలో ఉండవు. ►అంతేకాకుండా సూపర్ మార్కెట్లలో లభించే అన్నిరకాల తేనెలు విపరీతమైన ఉష్ణోగ్రతల్లో వేడి చేసి ప్యాక్ చేయబడి ఉంటాయి. అటువంటి తేనెను కొనకపోవడం మంచిది. వాడకపోవడం ఇంకా మంచిది. తేనెటీగల నుండి నేరుగా సహజ తేనెను తీసి విక్రయించేవారి నుంచి కొని, వేడి చేయకుండా తింటే తేనెలోని సహజ పోషకాలు నేరుగా శరీరానికి అందుతాయని డాక్టర్ రాధామణి సూచిస్తున్నారు. చదవండి: మీరు బాదం పాలు తాగుతున్నారా? వికారం, థైరాయిడ్, అలర్జీ.. -
చేపల కూరలో స్లో పాయిజన్.. అత్తా, మరదలిని
న్యూఢిల్లీ: అత్తింటివారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ వ్యక్తి భారీ కుట్ర పన్నాడు. భార్యతో పాటు అత్తామామలు, మరదలిని అంతమొందించేందుకు చేపల కూర వండి, వారికి తినిపించాడు. అందులో థాలియం అనే రసాయన మూలకాన్ని కలపడంతో వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో నిందితుడి అత్త, మరదలు మృత్యువాత పడగా, భార్య, మామ చికిత్స పొందుతున్నారు. వివరాలు... వరుణ్ అరోరా(37) దక్షిణ ఢిల్లీవాసి. అతడికి కొన్నేళ్ల క్రితం దివ్య అనే మహిళతో వివాహం జరిగింది. అయితే, పెళ్లైన నాటి నుంచి తనను సరిగా పట్టించుకోవడంలేదనే అక్కసుతో వరుణ్ అత్తింటివాళ్లపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో చేపల కూర వండి, అందులో థాలియం కలిపాడు. వారింటికి వెళ్లి అందరికీ కూర వడ్డించి తినాల్సిందిగా కోరాడు. కాగా స్లో పాయిజన్‌లా పనిచేసే, థాలియం దుష్ప్రభావం అప్పటికపుడు తెలిసే వీలు లేనందున అంతా బాగానే ఉందని భావించారు బాధితులు. కానీ కొన్ని రోజుల తర్వాత వారి ఆరోగ్యంలో మార్పులు రాసాగాయి. జుట్టు ఊడటం, కాళ్లలో మంటలు పుట్టడం వంటి పరిణామాల బారిన పడ్డారు. ఈ క్రమంలో వరుణ్ అత్త అనితా దేవి, మరదలు ప్రియాంక మృతిచెందారు. అతడి భార్య దివ్య సైతం తీవ్ర అనారోగ్యం పాలుకావడంతో ఆస్పత్రిలో చేరింది. ఇక దివ్య తండ్రి మోహన్లో స్లో పాయిజన్ లక్షణాలు అంతగా కనిపించలేదు. ఇక అనిత, ప్రియాంక హఠాన్మరణాల నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పగ తీర్చుకునేందుకు తానే చేపల కూరలో థాలియం కలిపానని, స్లో పాయిజన్ ద్వారా వారిని చంపడమే తన ఉద్దేశమని వరుణ్ అసలు విషయం బయటపెట్టాడు. కాగా ఫోరెన్సిక్ రిపోర్టులు, వరుణ్ ఇంట్లో దొరికిన ఆనవాళ్ల ఆధారంగా పోలీసులు మంగళవారం అతడిని అరెస్టు చేశారు. చదవండి: తొలి రాత్రే షాకిచ్చిన వధువు: రాడ్‌తో భర్తను కొట్టి.. రాసలీలల సీడీ కేసు: నిందితుడి భార్య అరెస్టు! -
ఇమ్రాన్ హత్యకు రెండో భార్య కుట్ర?
పాకిస్థాన్ రాజకీయ నాయకుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌ను అతని రెండో భార్య రెహమ్ విషమిచ్చి చంపాలనుకుందా.. తద్వారా అతని రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని ప్లాన్ వేసిందా? అందుకోసమే ఇద్దరి మధ్య ఘర్షణ.. తత్ఫలితంగానే తలాఖ్ వరకు వ్యవహారం వెళ్లిందని తాజాగా తెలుస్తోంది. చివరకు పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇమ్రాన్‌ను ఆయన సన్నిహితుల ద్వారా ఈ విషయమై హెచ్చరించాయట. పాకిస్థాన్ తెహ్రిక్ ఇన్ సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ రెండో భార్య రెహమ్‌కు విడాకులు ఇచ్చిన నేపథ్యంలో ఇపుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు అరిఫ్ నిజామి స్థానిక మీడియాతో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లిద్దరు పరస్పరం అంగీకారంతో విడాకులు తీసుకున్నారన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. పార్టీ వ్యవహారాలను తనకు చెప్పాల్సిందిగా రెహమ్ ఇబ్బంది పెట్టిందని, ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగిందని చెప్పుకొచ్చారు. ఆమెను లండన్‌లో జరుగుతున్న మీటింగ్‌కు పంపించి, ఆమెకు డైవోర్స్ నోటీసును ఈ -మెయిల్ ద్వారా పంపించారన్నారు. ఇమ్రాన్ జీవితాన్ని రెహమ్ నరకంగా మార్చివేసిందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇమ్రాన్ సన్నిహితుల ద్వారా అతణ్ని హెచ్చరించాయని తెలిపారు. ఆమె అతణ్ని మట్టుబెట్టే అవకాశాలున్నాయనే అనుమానాల్ని వ్యక్తం చేశాయన్నారు. అసలు రెహమ్ - ఇమ్రాన్ పెళ్లి జరగకుండా ఉండేందుకు తాను గట్టిగా ప్రయత్నించానన్నాడు. ఒకదశలో ఇమ్రాన్‌కు దూరంగా ఉండాలని రెహమ్‌ను తాను హెచ్చరించినట్టు కూడా తెలిపారు. అయినా తమ సలహాను ఇమ్రాన్ లక్ష్యపెట్టలేదన్నారు. ఇమ్రాన్‌కు అత్యంత సన్నిహితుడైన మరో జర్నలిస్టు షాహిద్ మసూద్ కూడా నిజామి వ్యాఖ్యలను సమర్ధించారు. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ అస్వస్థతకు గురైనపుడు వైద్య పరీక్షలు చేయించగా. అతడి శరీరంలో ఎలకల మందుకు సంబంధించిన అవశేషాలు లభించాయన్నారు. కాగా 63 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, టీవీ జర్నలిస్ట్ రెహమ్ ఇద్దరూ 2014 డిసెంబర్ నెలలో పెళ్లి చేసున్నారు. ఏడాది తిరగక ముందే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని ప్రకటించడం సంచలనం రేపింది. -
దహిస్తోంది అసూయాగ్ని
న్యూఢిల్లీ: మనకు లేదనుకుంటే బాధ... ఎదుటివారికి ఉందనుకుం టే మరింత బాధ. అది మనల్ని ఆవహించినప్పుడు అంతగా తెలీదు... దహిస్తున్నప్పుడు తెలుస్తుంది. దాన్ని వదిలించుకోవడం ఎంత కష్టమో..! అసూయ అంటే ఒక భావోద్వేగం. ప్రపంచంలో దీనికి అ తీతులైనవారెవరైనా ఉన్నారంటే వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చేమో. అసూయకు లోనైతే... అసూయకు గురైనవారు భయం, కోపం, ఓటమి, అనుమానం, ఒత్తిడి, విచారం, బాధ, ఆత్మన్యూనత లాంటి వివిధ రకాల భావాలకు లోనవుతా రు. నిరుత్సాహపూర్వకమైన, నిరాశాపూరితమైన పరిస్థితుల్లోకి ఇది వారిని నెట్టేస్తుంది. కనీసం సన్నిహితులతో కూడా పంచుకోలేని పరిస్థితి ఇది. దీని ని అణచుకోకుండా పెరగనిచ్చామంటే అది స్లోపాయిజన్‌లా మారిపోతుంది. అంచనాలు అందుకోలేకపోవడం మన గురించి, మన చుట్టూ ఉన్నవారి గురించి చాలాసార్లు మనం కొన్ని వాస్తవ విరుద్ధమైన అంచనాల్లో ఉంటాం. అదే విధంగా మన పనులన్నీ సులభంగా అయిపోవాలని, అన్నీ తేలికగా అమరిపోవాలని ఆశిస్తాం. అయితే అలా జరగనప్పుడు, అవి సమకూర్చుకున్నవారి వైపు అనుకోకుండానే చూస్తాం. నిజానికి అది అనవసరమైన చూపే. కానీ ఆ చూపే మనల్ని అసూయ అనే అగాథంలోకి విసిరేస్తుంది. అభద్రతాభావం సమాజంలో మన చుట్టూ ఉన్నత స్థాయిలో మన జీవితం కూడా ఉండాలని భావిస్తాం. అలా కానప్పుడు మనల్ని మిగిలిన వారు చిన్నచూపు చూస్తారేమోననే అభద్రతా భావానికి లోనవుతాం. ఆ అభద్రతా భావమే ఎదుగుతున్నవారిపై మనం అసూయపడేలా చేస్తుంది. పోలిక వద్దు మనం ఎవరికి వారు వైవిధ్యంతో, మనదైన వ్యక్తిత్వంతో జన్మించాం. సమాజపరమైన స్థాయి బేధా లు ఎలా ఉన్నా... మనం మాత్రం ఇతరులతో పోల్చుకోవడం మానుకోవాలి. మనం స్పెషల్ అనే ఫీలింగ్‌ని ప్రేమించాలి. ఇతరులకు ఉన్న డబ్బు, కీర్తి, విజయాలు, రూపం... మనకు లేవే అనుకోవడం కన్నా మనకు ఉన్నవే ఉన్నతమైనవిగా భావించి ఆనందించాలి. మన ప్రయాణం మనదే అని గుర్తించాలి. మన గురించి మనమే చింతించడం మానాలి ఎప్పుడూ మన గురిం చే ఎక్కువగా ఆలోచిం చడం వల్ల వచ్చే సమస్యల్లో ఇదొకటి. కాబ ట్టి అది తగ్గించాలి. ఇతరుల్ని పొగడడం నేర్చుకోవాలి. ఇతరుల విజ యాలను గుర్తించడం, వారిని ప్రశంసించడం అల వరచుకోవాలి. తోటివారిని అభినందించడం ద్వారా వచ్చే ఆనందాన్ని ఆస్వాదించాలి. ఇలాంటి మార్పు చేర్పుల వల్ల ఒకప్పుడు మనకు అసూయ ను కలిగించినవి ఎంత చిన్న విషయాలో అర్థమౌతుంది. లాజిక్ అవసరం ఒక వ్యక్తి శారీరకంగా ఫిట్‌గా ఉండి, చూడడానికి ఆరోగ్యవంతంగా కనిపిస్తే వెంటనే అసూయకు గురవ్వడం సులభం. అయితే మనం నిజంగా రోజూ వర్కవుట్స్ చేయగలమా? మనం ఆరోగ్యకరమైన ఆహారానికి మాత్రమే పరిమితం కాగలమా? అలా కానప్పుడు ఇక అసూయ చెందాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి లాజికల్ థిం కింగ్‌తో అంకురించిన అసూయ ఆమడ దూరం పారిపోతుంది. మీ జీవితంలోని మంచి మీద దృష్టి పెట్టండి మన జీవితంలోనూ ఎన్నో విజయాలుంటాయి. చుట్టుపక్కల ఉన్నవారు సాధించలేనివేవో మనం సాధించే ఉంటాం. అవి గుర్తించాలి. చాలా మంది కి లేని సామర్థ్యాలను మనకు భగవంతుడు ఇచ్చే ఉంటాడు. అవి ఏమిటో వెలికి తీసి వాటిని ఉపయోగించుకుని ఇతరులకుసాయపడడం మొదలు పెట్టాలి. తప్పకుండా మనకన్నా చాలా విషయా ల్లో తక్కువగా ఉన్నవారు ఉండే ఉంటారు. వారిని చూసి గొప్పలకు పోకుండా వారికి అవసరమైన సాయం చేయడం ద్వారా మన ఉన్నతిని మనమే గౌరవించుకున్నవారమవుతాం. అసూయ గుడ్డిది కూడా ప్రేమ ఒక్కటే కాదు అసూయ కూడా గుడ్డిదేనట. డెలావెర్ యూనివర్సిటీకి చెందిన సైకాలజీ డిపార్ట్మెంట్ నిర్వహించిన ఓ సర్వేలో అసూయ అనే పొరలు కళ్లకు కమ్ముకోవడం అనే మాట నానుడికి అనేది మాత్రమే కాదని నిజమని తేలింది. మనిషి మస్తిష్కంలో అసూయ పెరిగిపోతే అది కంటి ముందు కనపడేచిత్రాలను చూడనీకుండా తాత్కాలికంగా అంధత్వాన్ని ప్రాప్తింపజేస్తుందని తమ ముందున్న వాటిలో ఏది సరైందో తెలుసుకోలేకపోతారని ఈ సర్వేలో వెల్లడైంది. అలాగే అనుబంధాలకు సంబంధించిన అంశంలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా ఈర్ష్యాసూయలకు గురవుతున్నారని మిస్సోరి వెస్ట్రన్ స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మెదడే కీలకం బ్రెయిన్లోని కొన్ని ప్రాంతాలు మనల్ని జెలసీకి గురయ్యేలా చేస్తున్నాయని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించే సిఎన్ఎస్ స్పెక్ట్రమ్స్ జర్నల్ తన తాజా వ్యాసంలో ఓ పరిశోధనా ఫలితాలు వెల్లడిం చింది. మానవ అనుభూతికి సంబంధించిన ఒక సహజమైన భావోద్వేగమే అయినప్పటికీ ఇది ఆత్మహత్యలకు, ఉన్మాదానికి, తీవ్రమైన మానసిక ఒత్తిడికి, హత్యలకు సైతం దారితీయడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నట్టు వీరు గుర్తించారు. పరిశోధకుల్లో ఒకరైన డొనాటెల్లా మరాజ్జిటి మాట్లాడుతూ... ‘అసూయ కలిగే పరిస్థితిని ఒకప్పుడు కేవలం సైకాలజిస్ట్‌లు, సైక్రియాట్రిస్ట్లు మాత్రమే పరిశీలించేవారు. అయితే ఇప్పుడు ఇది ఒక న్యూరో సైన్స్‌కు సంబంధించిన అంశంగా కూడా మారింది’ అన్నారు. ఫేస్బుక్ ఒక కారణం ఇటీవలి ఆధునిక పరిస్థితులు ఈ భావోద్వేగం మరింత పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని గుర్తిస్తున్నారు. వాటిలో ఫేస్బుక్ కూడా ఒకటి. వ్యక్తిగత విషయాలను చెప్పుకునేందుకు చాలా మంది ప్రాధాన్యం ఇస్తున్న ఈ సోషల్ మీడియా అసూయను రాజేస్తోందట. అత్యధికంగా ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నవారిలో అత్యధికులు అసూయాపరులుగా మారుతున్నారని ఓ ఆన్లైన్ సర్వేలో తేలింది. మానసిక నిపుణుల మాట స్వల్పంగా అసూయ ఉండడం అనేది చాలా సహజమైనది, అవసరమైనది కూడా. జీవితంలో ఎదిగేందుకు విజయాలు సాధించేందుకు అది ఉపయోగపడుతుంది. అయితే కొందరి విషయంలో ఇది శృతి మించుతోంది. దీన్నే ‘డెల్యూజనల్ డిజార్డర్’గా సైకలాజికల్ పరిభాషలో వ్యవహరిస్తాం. ఈ పరిస్థితికి లోనైనవారు తాము కోరుకున్నది ఇతరులకు దక్కడాన్ని సహించే దశను దాటిపోతారు. దీంతో వీరిలో నేరస్వభావం కూడా ఏర్పడుతుంది. నలుగురితో కలవలేకపోవడం, తరచుగా ఇతరులతో పోల్చుకుంటూ బాధపడుతుం డడం... వంటి లక్షణాలున్న వారి విషయంలో కుటుంబసభ్యులు అప్రమత్తంగా ఉండాలి. ఈ తరహా స్వభా వంతమలో పెరుగుతుంటే అదొక వ్యాధిగా గుర్తిం చాలే తప్ప తమ ఆలోచన సరైనదే అనుకోకూడదు. అవసరమైతే చికిత్సకు సిద్ధపడాలి. మరోవైపు చిన్నవయసు నుంచే ఈ తరహా స్వభావాలు పెరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలని గుర్గావ్లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి చెం దిన మానసిక వైద్యుడు అన్నారు.