తండ్రుల ఒత్తిడి వల్ల పిల్లలకూ సమస్యలే!
మీరు తీవ్రమైన ఒత్తిడితో ఉన్నారా? మీ పిల్లల దగ్గర కూడా మీ అసహనం ప్రదర్శిస్తున్నారా? తండ్రుల మానసిక ఒత్తిడి పిల్లల వికాసంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందంటున్నారు పరిశోధకులు. పారాడే వయసులోనూ పిల్లలు తండ్రుల ఒత్తిడిని గ్రహించగలరని వెల్లడించారు మిషిగన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు.
ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్న తండ్రులను గమనిస్తూ ఉండే పిల్లలు ఆ తర్వాత పెరుగుతూ ఉండే క్రమంలో తమ భావవ్యక్తికరణ సరిగా జరపలేరని పేర్కొంటున్నారు ఈ అధ్యనానికి నేతృత్వం వహించిన టామీషా హేర్‌వుడ్. ఇలాంటి తండ్రులు వెంటనే పిల్లల సమక్షంలో తమ ప్రవర్తన మార్చుకోవాలని సూచిస్తున్నారు. ‘‘ఒత్తిడిని నియంత్రించుకోకపోవడం వల్ల తండ్రులు తాము డిప్రెషన్‌కు లోనుకావడంతో పాటు తమ పిల్లల వికాసానికీ ప్రతిబంధకమవుతారు’’ అంటూ హెచ్చరిస్తున్నారు ఆ అధ్యయనంలో పాలుపంచుకున్న మానసిక నిపుణులు.