
మాదకద్రవ్యాలకు బానిసలు కావొద్దు
మండ్య: జీవితంలో ఎదేరయ్యే సమస్యల ఒత్తిడిని జయించలేక నేటి యువత మాదకద్రవ్యాలకు బానసలవుతున్నారని మండ్య యూత్ గ్రూప్ అధ్యక్షుడు అనిల్ విచారం వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రభుత్వ కాలేజ్‌లో మండ్య యూత్ గ్రూప్, సాంస్కృతిక వేదికల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు విద్యార్థులపై చూపుతున్న దుష్ర్పభావాలపై శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
దేశ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించవలసిన విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు బానిసలవుతుండడం శోచనీయమన్నారు. మాదకద్రవ్యాల మత్తులో యువత నేరాలకు పాల్పడుతుండడంతో వారితో పాటు వారి కుటుంబ సభ్యలు కూడా సమాజంలో ఛీత్కారాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.