తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏబీసీడీ వర్గీకరణకు పార్లమెంటులో బిల్లు పెట్టించే విధంగా కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కోకన్వీనర్ తప్పెట్ల శ్రీరాములుమాదిగ అన్నారు.
సూర్యాపేట మున్సిపాలిటీ : తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏబీసీడీ వర్గీకరణకు పార్లమెంటులో బిల్లు పెట్టించే విధంగా కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కోకన్వీనర్ తప్పెట్ల శ్రీరాములుమాదిగ అన్నారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చెప్పుకు, డప్పుకు రూ. 2 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 10 నుంచి మహాపాదయాత్ర కొనసాగుతుందన్నారు. అనంతరం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా కొండగడుపుల సూరయ్య, రాష్ట్ర అధ్యక్షులు యాతాకుల భాస్కర్‌మాదిగలను శ్రీరాములుమాదిగ ప్రకటించారు. సమావేశంలో చింతా బాబు, యాతాకుల సునీల్, పరశురాములు, రవి, ఉపేందర్, మల్సూర్, దుబ్బ రమేష్,ఎల్లయ్య, సాయికుమార్, సంజయ్, మధు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.