సూర్యాపేట : రవికృష్ణ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు రావడంతో అమ్మమ్మ ఊరికి వెళ్లాలని ఫోన్ చేశాడు. ఇంతలోనే స్కూల్ నుంచి రవికృష్ణ తల్లికి ఫోన్‌వచ్చింది. వేసవి సెలవుల్లోనే పదో తరగతికి ప్రత్యేక తరగతులు ప్రారంభమవుతున్నాయి. ఫలానా తేదీ నుంచి పంపండి.. మీ పిల్లాడు రాకపోతే వెనుకబడిపోతాడు. మీ ఇష్టం అంటూ చెప్పారు. తల్లిదండ్రులు కుమారుడ్ని ఊరికి పంపకుండా పాఠశాలకు పంపేలా నిర్ణయం తీసుకున్నారు. ఇది రవికృష్ణ ఒక్కడిదే బాధే కాదు.. సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట పట్టణాల్లోని చాలా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పిల్లల పరిస్థితి ఇదే.
మానసిక ఆనందాన్ని కోల్పోతున్న పిల్లలు
ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతమైన పోటీతత్వం పెరగడంతో రోజూ తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు చదువు అంటూ పిల్లలు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మానసిక ఆనందాన్ని కోల్పోతూ యాంత్రికంగా మా రిపోతున్నారు. కనీసం సెలవు రోజుల్లోనైనా ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపే అవకాశాలు కూడా కరువవుతున్నాయి. పాఠశాల యజమాన్యాలు చెప్పిన విధంగానే తల్లిదండ్రులు మద్దతిస్తూ.. పిల్లలను ఆటపాటలకు దూరం చేస్తున్నారు.
పట్టింపులేని అధికారులు
మామూలుగానే సెలవు రోజుల్లో విద్యాశాఖాధికారులు, ఇటు ఇంటర్ అధికారులకు తెలిసినా స్పందించిన దాఖలాలు లేవు. పేరుకే సెలవులు కానీ పనిచేస్తున్న పాఠశాలలే ఎక్కువగా ఉన్నాయి.
జూనియర్ కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి
జూనియర్ కళాశాలల విద్యార్థులకు మే 31 వరకు సెలవులు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని ప్రభుత్వం జీఓ కూడా విడుదల చేసింది. ఈ నిబంధనలను ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలలు బుట్టదాఖలు చేస్తున్నాయి.
విద్యార్థులపై ‘ప్రత్యేక’ ఒత్తిడి
Published Tue, May 16 2017 4:12 AM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM
Advertisement