
పరీక్షలకు వారం ముందు తీవ్ర ఒత్తిడి
మరో వారంలో పరీక్షలు ఉన్నాయంటే విద్యార్థులు పడే ఒత్తిడి ఓ రేంజ్‌లో ఉంటుందని ఇటీవల ఒక అధ్యయనంలో వెల్లడైంది.
న్యూఢిల్లీ: మరో వారంలో పరీక్షలు ఉన్నాయంటే విద్యార్థులు పడే ఒత్తిడి ఓ రేంజ్‌లో ఉంటుందని ఇటీవల ఒక అధ్యయనంలో వెల్లడైంది. పరీక్షలు ఒక నెల రోజుల సమయం ఉండగా కేవలం 13.4 శాతం మాత్రమే ఉన్న ఒత్తిడి అదే వారం రోజుల ముందు 82.2 శాతానికి చేరుకుంటుందని తేలింది. విద్యార్థుల శారీరక, మానసిక పరిస్థితులపై ఈ పరీక్షల ఒత్తిడి ఎంతో ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
తల్లిదండ్రుల అంచానాలను అందుకోవడంపై 16 ఏళ్ల విద్యార్థి తీవ్ర ఒత్తిడికి గురవుతుండగా, 17 ఏళ్ల విద్యార్థి గతంలో పొందిన తక్కువ మార్కులపై తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడని అధ్యయనం తేల్చింది. ఒక కచ్చితమైన సమయపాలన, చదివే విధానాలను అవలంబించి ఒత్తిడిని అధిగమించవచ్చునని సైకాలజిస్టు సుష్మ హెబ్బార్ సూచించారు. సాధారణంగా చాలా మంది చివరి నిమిషంలో చదివే విధానాలను మార్పు చేస్తుంటారని అలా చేయకుండా అవే పద్ధతులను కొనసాగించాలని సుష్మ తెలిపారు.