ఘట్‌కేసర్: ఆర్థిక సమస్యల కారణంగా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్లోని వెంకటాద్రి టౌన్‌షిప్‌లో నివాసం ఉండే రాజేంద్రప్రసాద్(40), అన్నపూర్ణ(35) దంపతులు సోమవారం రాత్రి విషం తాగారు.
మంగళవారం వారు ఉదయం లేవకపోయేసరికి వారి ఇద్దరు కుమారులు చుట్టుపక్కల వారికి తెలిపారు. వారు వచ్చి చూసేసరికి విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తల్లిదండ్రుల మృతితో కుమారులు విషాదంలో మునిగిపోయారు.