సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ నిర్వాకాలను దాచేసి, నిరంతరం విద్యుత్తు అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ పైనా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పైనా విషం కక్కారు రామోజీరావు. గత ప్రభుత్వం చేసిన తప్పులు, ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా చేపట్టిన చర్యలు, విద్యుత్ సంస్థలను తీవ్రంగా దెబ్బతీసేలా తీసుకున్న నిర్ణయాలను ఈనాడు ఉద్దేశపూర్వకంగా మరుగునపరిచింది. పైగా ఆ ప్రభుత్వ కాలంలో అద్భుతాలు జరిగాయన్నట్టుగా తప్పుడు కథనాన్ని అచ్చేసింది.
నిజాలకు పాతరేసి ఈనాడు కథనంలో రాసినవన్నీ అభూత కల్పనలేనని విద్యుత్ సంస్థలు స్పష్టం చేశాయి. రాష్ట్ర విభజన తొలినాళ్లలో ఉన్న విద్యుత్ కొరత పరిస్థితిని తీసివేసి, కేవలం కొన్ని నెలల్లోనే కోతలు లేని రాష్ట్రంగా తయారైందని గత ప్రభుత్వానికి ఈనాడు సరి్టఫికెట్ ఇచ్చేసింది. ఈనాడు రాసింది, చెప్పింది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశాయి. అవి వెల్లడించిన అసలు వాస్తవాలు ఇలా ఉన్నాయి..
♦ గత చంద్రబాబు ప్రభుత్వం 8 వేల మెగావాట్లకు అధిక ధరలకు చేసుకున్న ఒప్పందాల వల్ల ఏటా రూ.3 వేల కోట్ల చొప్పున 25 ఏళ్లపాటు భారాన్ని మోయాల్సిన పరిస్థితులు కలి్పంచారు. ఇది దూరదృష్టి ఎలా అవుతుంది? గత ప్రభుత్వ పెద్దలకు ఉచిత కరెంటు అంటే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడమేనంటూ మాట్లాడిన చరిత్ర ఉంది.
ఇదే పెద్దలు 2014 తర్వాత కూడా రైతుల ఉచిత విద్యుత్ పథకానికి ఎగనామం పెట్టేలా పాలన సాగించారు. ఈ పథకం కింద కరెంటు సరఫరా చేసినందుకు డిస్కంలకు ఇవ్వాల్సిన డబ్బులను ఎగ్గొట్టారు. డిస్కంలు, జెన్‌కోల అప్పులు రూ.29,703 కోట్ల నుంచి రూ.68,596 కోట్లకు పెరిగిపోయేలా చేశారు.
విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు డిస్కంలు ఇవ్వాల్సిన బకాయిలు రూ.2,800 కోట్ల నుంచి రూ.21వేల కోట్లకు గత ప్రభుత్వంలో పెరిగిపోయాయి. ఇలా విద్యుత్ సంస్థలను అన్ని రకాలుగా దెబ్బ తీసి, అవి అప్పులపాలై, కుప్పకూలిపోయే ప్రమాదకర పరిస్థితికి తీసుకెళ్లారు. కరెంటు సంస్థల ఆరి్థకస్థితిని దారుణంగా దెబ్బతీసినా గత ప్రభుత్వం భేషుగ్గా చేసిందని కితాబునివ్వడం ఒక్క ఈనాడు మాత్రమే చేయగలదు.
♦ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా సంక్షేమంతో పాటు ప్రభుత్వ సంస్థల సంక్షేమాన్నీ బాధ్యతగా చేపట్టారు. ఇందులో భాగంగా విద్యుత్ సంస్థల అభివృద్ధికీ బాటలు వేశారు. రైతులకు ఇస్తున్న కరెంటు బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నారు.
అంతేకాకుండా రైతులకు ఉచిత కరెంటు భవిష్యత్తులో కూడా నిరాటంకంగా అందాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో యూనిట్‌కు కేవలం రూ.2.49 కే ఒప్పందం చేసుకుని, అత్యంత పారదర్శకంగా వ్యవహరించింది. ఇది విద్యుత్ వ్యవస్థల్లో అంధకారం నింపడం ఎలా
అవుతుంది?
♦ డిస్కంల నికర విలువ గత ప్రభుత్వం వచ్చే నాటికి 2014లో సుమారు మైనస్ రూ. 4,315 కోట్లు ఉంటే, ఆ ప్రభుత్వం దిగిపోయేనాటికి దారుణంగా క్షీణించి మైనస్ రూ. 20 వేల కోట్లకు చేరింది. మరి గత ప్రభుత్వం ఏ రకంగా వెలుగులు నింపింది? గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సబ్సిడీలకు రూ.12,634 కోట్లు ఇస్తే, ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.33,749 కోట్లు అందించింది.
♦ ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త రాజకీయ పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధం, అంతకు ముందు వచి్చన కోవిడ్ లాంటి విపత్తులు ప్రపంచవ్యాప్తంగా కరెంటు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే బొగ్గు మార్కెట్‌ను అతలాకుతలం చేశాయి. కావాల్సినంత బొగ్గు దొరక్కపోగా, రేట్లు అమాంతంగా పెరిగిపోయా యి. కొందామంటే కూడా దొరకని పరిస్థితి. దేశంలోనూ అంతే. ఒక రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేని ఇ లాంటి పరిస్థితులను తట్టుకుంటూ, ఎప్పటికప్పుడు ప్రణాళికలు వేసుకుంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత సమర్థంగా కరెంటును సరఫరా చేస్తోంది.
♦ ఈ ఏడాది సుదీర్ఘకాలం నడిచిన వేసవి, ప్రతికూల వాతావరణం, ఆగస్టు నెలలో కూడా వేసవిని తలపించేలా ఎండలు తదితర కారణాలతో కరెంటు ఉత్పత్తిలో అసమతుల్యత ఏర్పడింది. దీనిని సర్దుబాటు చేసుకుంటూ విద్యుత్ సంస్థలు వినియోగదారులకు కరెంటును అందిస్తున్నాయి. ఈ క్రమంలో తలెత్తిన స్వల్ప అవాంతరాలను ఆసరా చేసుకుని ఈనాడు ప్రభుత్వం మీదున్న అక్కసుతో వ్యతిరేక ప్రచారానికి దిగింది.
♦ ప్రతి ఏటా మాదిరే ప్రస్తుతం రుతుపవనాల కాలంలో జల విద్యుత్ ప్రారంభమై, పవన విద్యుత్ కూడా అధిక మొత్తంలో అందుబాటులో ఉండాలి. కానీ రుతుపవనాల విస్తరణలో అంతరాయం, ప్రతికూల వాతావరణం కారణంగా జల, పవన విద్యు త్‌లో కూడా తరచూ హెచ్చు తగ్గులు ఏర్పడ్డాయి.
♦ వాతావరణంలో ఎల్నినో పరిణామం వల్ల తీవ్రమైన ఉష్ణోగ్రత, ఉక్కపోత పరిస్థితుల్లో విద్యుత్ డిమాండ్ పెరిగింది. నీటిపారుదల ప్రాజెక్టుల్లో తగినంత నీరు లేకపోవడం వలన వ్యవసాయ రంగంలోనూ సాగునీటి కోసం పంపుసెట్ల వాడకం వల్ల వినియోగం ఎక్కువగా జరుగుతోంది. ఇవన్నీ అసాధారణ పరిస్థితులే. వీటి గురించి ఈనాడు ఎక్కడా ప్రస్తావించలేదు.
♦ ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ విద్యుత్ పంపిణీ సంస్థలు నెల, వారం వారీగా విద్యుత్ డిమాండ్, సరఫరాపై ముందస్తుగా వేసుకున్న ప్రణాళికలను పునఃపరిశీలించుకుని ముందుకెళ్తున్నాయి.
♦ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాల వార్షిక మరమ్మత్తుల షెడ్యూలును కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిర్ణయిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న డిమాండ్ దృష్ట్యా వార్షిక మరమ్మతులు జరుగుతున్న యూనిట్లను వెంటనే అందుబాటులోకి తేవాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది.
♦ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వినియోగదారులకు రాబోయే రోజుల్లో ఎంత ఖర్చయినా ఏ విధమైన అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలుకు విద్యుత్ సంస్థలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో గత రెండు రోజులుగా సరఫరా బాగా మెరుగుపడింది. మంగళవారం ఏ విధమైన లోడ్ రిలీఫ్ ఇవ్వలేదు.
♦ గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ విధానాలు, కొనుగోలు ఒప్పందాలన్నీ అక్రమాల మయం. పారదర్శకత మచ్చుకైనా లేని ఆ చర్యలతో కరెంటు సంస్థలకు, ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారు. ప్రపంచవ్యాప్తంగా సోలార్ విద్యుత్ రేట్లు తగ్గుతున్న సమయంలో కంపెనీలతో కుమ్మక్కై, అక్రమాలకు పాల్పడి యూనిట్ కరెంటును రూ.7కు కొనేలా ఒప్పందాలు చేసుకున్న చరిత్ర గత ప్రభుత్వానిది.
అలాగే పవన్ విద్యుత్ ఒప్పందాల్లో అనేక అవకతవకలకు పాల్పడ్డారు. యూనిట్ కరెంటుకు రూ.5 చెల్లించేలా చేసుకున్న ఒప్పందాలు ఎవరి ప్రయోజనం కోసం? ఈ భారాన్ని మోయలేక విద్యుత్ సంస్థలు బావురుమన్న వైనం గత ప్రభుత్వంలో జరిగిందే. ఇవి రాష్ట్రంలో విద్యుత్ రంగానికి అంధకారం నింపే కార్యక్రమాలే రామోజీ.
♦ ప్రస్తుతం రాష్ట్రంలో అసాధారణ డిమాండ్ పెరుగుదల లేదని ఈనాడు పత్రిక చెప్పడం పూర్తిగా అబద్ధం. ప్రస్తుత ఆగస్టు నెలలో వేసవి మాదిరి రోజువారి గ్రిడ్ డిమాండ్ దాదాపు 230 మిలియన్ యూనిట్లు ఉంటోంది. అసలు ఈ సీజన్లో విద్యుత్ డిమాండ్ తగ్గిపోయి రోజుకి 170 నుంచి 185 మిలియన్ యూనిట్లు ఉండేది. కానీ రోజుకి 45 మిలియన్ యూనిట్ల నుంచి 55 మిలియన్ యూనిట్లు ఎక్కువగా ఉంటోంది. దీన్ని అసాధారణ పెరుగుదల అని కాక ఇంకేమంటారు?
♦ గతేడాది ఇదే కాలంలో దాదాపు 2500 నుంచి 3000 మెగావాట్ల వరకూ వచ్చే పవన విద్యుత్ ఇప్పుడు ఒక్కోసారి 150 నుంచి 200 మెగావాట్ల కనిష్ట స్థాయికి పడిపోతోంది. ఈ ఉత్పత్తి తగ్గుదల సాయంత్రం, రాత్రి సమయాల్లో ఎక్కువగా ఉంటోంది.
♦ ప్రస్తుతం రాయలసీమ థర్మల్ కేంద్రంలో ఒక యూనిట్ మాత్రమే వార్షిక మరమ్మతుల కోసం ఆపారు. కృష్ణపట్నం కేంద్రంలో ఒక 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య కార్యకలాపాలు మొదలుపెట్టిన తరువాత చట్టబద్దంగా చెయ్యవలసిన ఒరిజినల్ పరికరాల తనిఖీ కోసం తాత్కాలికంగా నిలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదీనంలోని జెన్‌కో విద్యుత్ కేంద్రాల వార్షిక మరమ్మతుల షెడ్యూలును ప్రస్తుత అధిక డిమాండ్ కారణంగా వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment