‘మానస సరోవర్‌’ రిజిస్ట్రేషన్ ప్రారంభం | "Manasa Sarovar 'registration started | Sakshi
Sakshi News home page

‘మానస సరోవర్‌’ రిజిస్ట్రేషన్ ప్రారంభం

Published Thu, Feb 2 2017 3:06 AM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

"Manasa Sarovar 'registration started

న్యూఢిల్లీ: మానస సరోవర్‌ యాత్రకు నమోదు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ యాత్ర జూన్  12 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు రెండు మార్గాల్లో సాగుతుంది. 2017, జనవరి 1 నాటికి దరఖాస్తుదారుల వయసు 18–70 ఏళ్ల మధ్య ఉండాలి. నమోదుకు గడువు మార్చి 15. లిపులేఖ్‌ పాస్‌ గుండా వెళ్తే రూ.1.6 లక్షలవుతుంది.

24 రోజల ఈ యాత్రలో 60 మంది యాత్రికుల చొప్పున మొత్తం 18 బ్యాచ్‌లుంటాయి. రెండో మార్గమైన నాథులా వృద్ధులకు ఉపయుక్తం. 21 రోజుల ఈ యాత్రకు రూ.2 లక్షల ఖర్చవుతుంది. ఈ మార్గం గుండా 50 మంది యాత్రికుల చొప్పున 8 బ్యాచ్‌లు బయల్దేరుతాయి. కైలాస్‌ మానస సరోవర్‌ టిబెట్‌లో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement