Manasa Sarovar Yatra
-
చిక్కుకుపోయారు
పశ్చిమగోదావరి, ఏలూరు (సెంట్రల్): కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లావాసులు టిబెట్‌లో చిక్కుకుపోయారు. మానస సరోవర్‌లో దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా టిబెట్‌లోని పిన్‌కోట్ ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో జిల్లావాసులతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన 90 మంది వరకు ఆగిపోయినట్టు ఏలూరు మేయర్ నూర్జహాన్ భర్త ఎస్ఆర్ఎం పెదబాబు ఆదివారం ‘సాక్షి’కి ఫోన్లో తెలి పారు. పిన్‌కోట్ ప్రాంతంలో దట్టంగా మంచు కురవడంతో నేపాల్ నుంచి ఈ ప్రాంతానికి విమాన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో యాత్రికులు పిన్‌కోట్ ప్రాంతంలో చిక్కుకున్నారు. ఎటువంటి సహాయక చర్యలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మానస సరోవర్ యాత్రికులను సురక్షితమైన ప్రదేశాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు ఇప్పటికే ప్రకటిం చింది. యాత్రికులను నేపాల్ తరలించేందుకు నేపాల్ అధికారులతో సంపద్రింపులు జరుపుతున్నామని, యాత్రికులకు ఆహారం, వైద్యం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చె బుతోంది. అయితే వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకుచేస్తున్న ప్రయత్నాలకు అక్కడి వాతావరణం ప్రతికూలంగా మారింది. జిల్లాలోని ఏలూరు నుంచి మేయరు షేక్ నూర్జహాన్ భర్త ఎస్ఎంఆర్ పెదబాబు, ఆయన బావమరిది బాజీ, కాంట్రాక్టర్ గంటా కోటేశ్వరరావు మరికొందరు గతనెల 23న ౖMðలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. వీరంతా 31న మానస సరోవర్‌లో దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. టిబెట్‌లోని పిన్‌కోట్ ప్రాంతానికి రాగా అక్కడ నుంచి నేపాల్ వచ్చేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో జిల్లావాసులతో పాటు మొత్తం 90 మంది వరకు పిన్‌కోట్ ప్రాంతంలో చిక్కుకుపోయినట్టు పెదబాబు ‘సాక్షి’కి తెలిపారు. పిన్‌కోట్ ప్రాంతం నుంచి ముందుగా నేపాల్‌కి యాత్రికులను తరలించాలంటే విమానాలు ఉపయోగించాల్సి ఉంటుంది. కాని అక్కడ దట్టమైన మంచు కురుస్తుండటంతో విమానాల రాకపోకలకు ఆటంకం కలిగిందని పెదబాబు చెప్పారు. ఆహారం అందక ఇబ్బందులు టిబెట్‌లోని పిన్‌కోట్ ప్రాంతంలో చిక్కుపోయిన జిల్లావాసులకు ఆహారం లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసింది. యాత్రకు వెళ్లిన వారిలో వృద్ధులు, బీపీ, సుగర్‌తో బాధపడుతున్నవారు ఉన్నా రు. వారికి మందులు అందడం లేదు. యాత్రికులకు పూర్తిస్థాయిలో ఆహారం, తాగునీరు లభించకపోవడంతో అవస్థలు పడుతున్నట్టు పెదబాబు చెప్పారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎటువంటి సహాయక కార్యక్రమాలు ప్రారంభం కాలేదని మిగిలిన యాత్రికుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎంపీ మాగంటికి వినతి యాత్రికులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని ఏలూరు ఎంపీ మాగంటి బాబును నగర మేయరు షేక్ నూర్జహాన్ ఫోన్ ద్వారా కోరారు. పెదబాబుతో మాట్లాడామని, ఆయన సురక్షితంగానే ఉన్నారని, బీపీ, సుగర్‌తో బాధపడుతున్నకొందరు యాత్రికులు మందులు అయిపోవడం, సరైన ఆహారం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్టు పెదబాబు చెప్పారని మేయర్ నూర్జహాన్ తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దు టిబెట్‌లోని పిన్‌కోట్ ప్రాంతంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సంపద్రించామని ఏలూరు ఎంపీ మాగంటి బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రక్షణశాఖకు చెందిన ప్రత్యేక హెలికాప్టర్‌ను పంపించారని, ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదని ఎంపీ పేర్కొన్నారు. -
మానస సరోవర యాత్రలో మెరుగైన వాతావరణం
సాక్షి, ఢిల్లీ : మానస సరోవర యాత్రలో మెరుగైన వాతావరణం ఏర్పడింది. ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు గురువారం తగ్గుముఖం పట్టడం, వాతావరణం అనుకూలంగా ఉండటంతో అధికారులు సహాయ చర్యలను ముమ్మరం చేశారు. హెలికాఫ్టర్లు, విమానాలలో యాత్రికులు తమ బృందాలతో తిరుగు ప్రయాణమయ్యారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకోసం ఏపీ, తెలంగాణ ప్రతినిధులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సమికోట్ నుంచి నేపాల్ గంజ్‌కు వందలాది మంది భక్తులను తరలిస్తున్నామని, మూడు రోజుల్లో యాత్రికులంతా వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. -
సురక్షిత ప్రాంతాలకు యాత్రికులు
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి/చాగల్లు/కాకినాడ: ఆధ్యాత్మిక యాత్రల్లో విషాదాలు చోటుచేసుకున్నాయి. కైలాస మానస సరోవరం, అమర్నాథ్ యాత్రకు వెళ్లి అక్కడ కురుస్తున్న మంచు తుపాన్ వల్ల చైనా–నేపాల్ సరిహద్దులోని హిల్సా బేస్ క్యాంప్‌లో చిక్కుకున్న 1,500 మందికి పైగా ఉన్న భారతీయ యాత్రికుల్లో ఎనిమిది మంది మృతిచెందగా.. 104 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కైలాస మానస సరోవరం యాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణమైన తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ప్రముఖ ఇంజినీర్, ఆర్కిటెక్చర్, బిల్డర్ గ్రంధి వీవీఎస్ఎల్ఎన్ సుబ్బారావు (58) టిబెట్ సరిహద్దులో గుండెపోటుతో మృతి చెందినట్లు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. కేరళకు చెందిన నారాయణం లీలా(56) మృతి చెందినట్టు ఎంబసీ పేర్కొంది. మరోవైపు అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన తోట రత్నం(72), అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన లక్ష్మీనారాయణ గుండెపోటుతో కన్నుమూశారు. అనంతపురానికి చెందిన మరో వ్యక్తి మృతిచెందినట్లు వార్తలొస్తున్నాయి. కాగా, అమర్నాథ్ యాత్రలో మరో విషాదం చోటుచేసుకుంది. బల్తాల్ మార్గంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతిచెందగా.. ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. రైల్‌పత్రి, బ్రారిమార్గ్ మధ్య కొండచరియలు విరిగిపడడంతో ఈ విషాదం చోటుచేసుకుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సురక్షిత ప్రాంతాలకు యాత్రికులు.. కైలాస మానస సరోవరం యాత్రకు వెళ్లి చైనా–నేపాల్ సరిహద్దులోని హిల్సా బేస్ క్యాంప్‌లో చిక్కుకున్న యాత్రికుల తరలింపు ఏర్పాట్లు ఓ కొలిక్కి వస్తున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న మంచు తుపాను వల్ల వాతావరణం అనుకూలించకపోవడంతో యాత్ర ముందుకు సాగలేదు. బేస్‌క్యాంపుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన 1500 మందికి పైగా(సిమిల్‌కోట్525, హిల్సా550, టిబెట్ 500) యాత్రికులు ఉన్నారు. వీరిలో ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లా, విజయవాడకు చెందిన సుమారు 100 మంది, తెలంగాణకు చెందిన 110మంది తెలుగువారు ఉన్నారు. మంగళవారం సాయంత్రానికి వాతావరణం అనుకూలించడంతో వీరందరినీ సిమిల్‌కోట్, నేపాల్ గంజ్‌కు తరలించేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. నేపాల్ ఆర్మీ హెలికాఫ్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సిమిల్‌కోట్ నుంచి నేపాల్గంజ్కు 7 ప్రత్యేక విమానాలను నడుపుతున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల్లో ఇప్పటి వరకు 104 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తెలుగు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, ఏఆర్సీ శ్రీకాంత్ ఎప్పటికప్పుడు నేపాల్ భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. హిల్సా నుంచి సమికోట్కు అక్కడి నుంచి నేపాల్గంజ్కు తరలించి యాత్రికులను లక్నో చేరుస్తున్నారు. యాత్రికుల తరలింపునకు చర్యలు మానస సరోవర్ యాత్రలో చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ట్వీటర్లో పేర్కొన్నారు. హాట్‌లైన్ ఏర్పాటు చేసి తెలుగు, మళయాళం, తమిళ్, కన్నడ భాషల్లో యాత్రికుల సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తెలుగు వారికోసం 977–9808082292 హాట్‌లైన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర యాత్రికులు క్షేమం సాక్షి, హైదరాబాద్: అమర్నాథ్ యాత్రకు వెళ్లిన రాష్ట్ర యాత్రికులంతా క్షేమంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత నెల 27 నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల యాత్రకు ఆటంకం కలిగింది. కొందరు యాత్రికులు మార్గం మధ్యలో చిక్కుకుపోవడంతో వారి కుటుంబీకులు ఆందోళన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వంతో పాటు అక్కడి రాయబార కార్యాలయాన్ని సంప్రదించి యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలాచారి, ఎంపీ వినోద్ యాత్రికులకు సౌకర్యాలు అందేలా చూస్తున్నారు. యాత్రలో ఉన్న కరీంనగర్ వాసి గౌరెశెట్టి మునిందర్తో అధికారులు మాట్లాడి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్ర యాత్రికుల కు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రస్తుతం సిమఖోట్ లో సురక్షితంగా ఉన్నట్లు మునిందర్ చెప్పారు. సిమఖోట్ నుంచి గమ్యస్థానానికి చేర్చేందుకు అక్క డి యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. మూడ్రోజుల్లో రాష్ట్ర యాత్రికులు తిరుగు ప్రయాణం అయ్యే అవకాశముందని తెలిసింది. వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోండి సాక్షి, అమరావతి: మానస సరోవర్ యాత్రకు వెళ్లి హిల్సా శిబిరంలో చిక్కుకుపోయిన తెలుగువారిని క్షేమంగా వారి స్వస్థలాలకు చేర్చేలా సత్వర చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా యాత్రికుల భద్రతపై ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యాత్రికులను క్షేమంగా తెచ్చే చర్యలను వేగవంతం చేయడంతో పాటుగా అవసరమైన వారికి ఆరోగ్య సేవలు కూడా అందించాలని వైఎస్ జగన్ కోరారు. -
మానస సరోవరం యాత్రలో చిక్కుకున్న తెలుగువారు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ)/సాక్షి, అమరావతి: కైలాస్–మానస సరోవరం యాత్రకు వెళ్లిన విజయవాడ చిట్టినగర్ ప్రాంతానికి చెందిన ఒగ్గు మురళీకృష్ణ, అతని సోదరుడు కోటేశ్వరరావుతో సహా దాదాపు వందమంది తెలుగువారు తుపానులో చిక్కుకున్నారు. విజయవాడ నుంచి దాదాపు నలభైమంది గత నెల 27వ తేదీన కైలాస్–మానస సరోవరం యాత్రకు బయలుదేరారు. వీరంతా గత నెల 30వ తేదీ చైనా, నేపాల్ సరిహద్దులోని హిల్సా ప్రాంతం వద్ద చిక్కుకుపోయారు. సోమవారం సాయంత్రం స్నేహితులకు, బంధువులకు ఆయన అతి కష్టంమీద ఈ విషయాన్ని ఫోన్‌ద్వారా తెలియజేశారు. కాగా నేపాల్–చైనా సరిహద్దులోని మానస సరోవర్‌లో చిక్కుకున్న ఏపీకి చెందిన యాత్రికుల్ని క్షేమంగా స్వస్థలాలకు చేర్చే ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఏపీ భవన్ కమిషనర్ శ్రీకాంత్‌ను ఆదేశించారు. -
చైనా-భారత్ ఘర్షణ: సిక్కింలో ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: భూటాన్‌లో రోడ్డు విషయంలో భారత్-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ గురువారం సిక్కిం పర్యటన చేపట్టారు. ఆయన రెండురోజుల పాటు సిక్కింలో పర్యటిస్తారని, రాష్ట్రంలో ఉన్న ఫార్మేషన్ హెడ్ క్వార్టర్స్‌లో టాప్ ఆర్మీ కమాండర్లతో భేటీ అయి సరిహద్దుల్లోని పరిస్థితి, కార్యకలాపాలపై సమీక్ష నిర్వహిస్తారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆర్మీ చీఫ్ రావత్ సిక్కిం రాక మామూలు పర్యటనే అని ఆ వర్గాలు వెల్లడించాయి. సిక్కిం సెక్టార్‌లోని భూటాన్ భూభాగంలో చైనా సైన్యం రోడ్డు నిర్మిస్తుండటంతో చైనా-భారత్ సైన్యాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. చైనా రోడ్డు నిర్మాణాన్ని భూటాన్, భారత్ వ్యతిరేకిస్తున్నాయి. అయితే, చైనా మాత్రం భారత దళాలు తమ భూభాగంలోకి వచ్చాయని నిందిస్తూ.. భారతీయులు చేపట్టే మానస సరోవర్ యాత్రను నిలిపేసిన సంగతి తెలిసిందే. దీంతో సిక్కిం సెక్టార్లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. చదవండి: చైనా దుందుడుకుతనం చదవండి: మోదీ అమెరికా టూర్: డ్రాగన్ కుతకుత! చదవండి: పెట్రేగిన చైనా.. మానస సరోవర్ మార్గం బంద్ -
చైనాలోకి భారత దళాలు
చైనా ఆరోపణ బీజింగ్: భారత దళాలు చైనా భూభాగంలోకి వచ్చాయని నిందిస్తూ చైనా మంగళవారం నిరసన వ్యక్తం చేసింది. సైనికులు వెంటనే వెనక్కు వెళ్లాలంది. తాజా ఘర్షణాత్మక వాతావరణానికి చూపే పరిష్కారంపైనే భవిష్యత్తులో భారతీయులను మానస సరోవర్ యాత్రకు అనుమతించాలా లేదా అనేది ఆధారపడి ఉంటుందని చైనా పేర్కొంది. ప్రస్తుతానికి భద్రతా కారణాల వల్లనే మానస సరోవర్ యాత్రకు వచ్చిన భారతీయులను అనుమతించలేదని చైనా తెలిపింది. ‘మా ప్రాంత సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ అంశంలో భారత్ కూడా చైనాతో కలిసి నడుస్తుందనీ, చైనా భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయ సైనికులను వెంటనే వెనక్కు పిలుస్తుందని ఆశిస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూకాంగ్ చెప్పారు. న్యూఢిల్లీలోనూ, బీజింగ్‌లోనూ దౌత్యపరంగా తమ నిరసన, వైఖరిని భారత్‌కు తెలియజేశామని ఆయన వెల్లడించారు. ‘భారత యాత్రికులకు సౌకర్యాలు, భద్రత కల్పించడానికి చైనా ఇప్పటివరకు ఎంతో చేసింది. తాజాగా భారత దళాలు చైనా భూభాగంలోకి ప్రవేశించి, రోడ్ల నిర్మాణాన్ని అడ్డుకున్నాయి. అయితే భద్రతా కారణాల వల్లనే ప్రస్తుతం భారతీయ యాత్రికులను చైనా మీదుగా వెళ్లనీయడం లేదు’ అని కాంగ్ అన్నారు. -
‘మానస సరోవర్’ రిజిస్ట్రేషన్ ప్రారంభం
న్యూఢిల్లీ: మానస సరోవర్ యాత్రకు నమోదు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ యాత్ర జూన్ 12 నుంచి సెప్టెంబర్ 8 వరకు రెండు మార్గాల్లో సాగుతుంది. 2017, జనవరి 1 నాటికి దరఖాస్తుదారుల వయసు 18–70 ఏళ్ల మధ్య ఉండాలి. నమోదుకు గడువు మార్చి 15. లిపులేఖ్ పాస్ గుండా వెళ్తే రూ.1.6 లక్షలవుతుంది. 24 రోజల ఈ యాత్రలో 60 మంది యాత్రికుల చొప్పున మొత్తం 18 బ్యాచ్‌లుంటాయి. రెండో మార్గమైన నాథులా వృద్ధులకు ఉపయుక్తం. 21 రోజుల ఈ యాత్రకు రూ.2 లక్షల ఖర్చవుతుంది. ఈ మార్గం గుండా 50 మంది యాత్రికుల చొప్పున 8 బ్యాచ్‌లు బయల్దేరుతాయి. కైలాస్ మానస సరోవర్ టిబెట్‌లో ఉంది. -
మానస సరోవర్ యాత్ర ప్రారంభం
న్యూఢిల్లీ: ఈ ఏడాది కైలాస్ మానస సరోవర్ యాత్రను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం ఢిల్లీలో ప్రారంభించారు. మొదటి బృందం యాత్ర ప్రారంభం సందర్భంగా సుష్మా మాట్లాడుతూ... యాత్రికులు చైనాలో ప్రవేశించినప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. దాదాపు 1,430 మంది భక్తులు 25 బృందాలుగా చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న మానస సరోవర్‌ను సందర్శించుకుంటారు. వైష్ణోదేవి ఆలయం వద్ద హైఅలర్ట్ జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయ బేస్ క్యాంప్ సమీపంలో ఓ వంతెన వద్ద పోలీసులు జరిపిన తనిఖీలో ఆర్మీకి చెందిన రెండు యూనిఫాంలు, బూట్లు అనుమానస్పదంగా లభ్యమయ్యాయి. దీంతో అక్కడ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. -
ఆరు రోజుల పాటు గరిటే సాంబర్ అన్నమే..!
మహబూబ్‌నగర్: రోజుకు ఒక గరిటె సాంబరు.. రెండు ముద్దల అన్నం.. ఎముకలు కొరికే చలి. అర్ధాకలి, నిద్రలేని రాత్రులు.. ఇదీ మానస సరోవరం యాత్రలో పాలమూరు జిల్లా యాత్రికులు అనుభవించిన నరకయాతన. శుక్రవారం ఉదయం మహబూబ్‌నగర్‌కు చేరుకున్న యాత్రికులు.. తాము పడిన బాధలను మీడియాకు వివరించారు. వారం రోజులు పడిన కష్టాలను గుర్తు తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వివరాలివీ.. జిల్లాకు చెందిన 13మంది యాత్రికులు గత నెల 16న రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లారు. అక్కడి నుంచి 17న ఉదయం ఖాట్మండ్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లారు. అక్కడ ఎన్టీపీ ఏజెన్సీ ప్రతినిధులు అదేరోజు వారిని నేపాల్గంజ్కు తరలించాలి. అయితే 19న తీసుకెళ్లారు. వాతావరణం బాగోలేదని రెండు రోజులపాటు నేపాల్గంజ్లోనే నిలిచిపోయారు. 21న సెమికాట్కు, అక్కడి నుంచి 22న తక్కల్కోట్కు చేరుకున్నారు. 23న రాత్రి మానస సరోవరానికి చేరుకుని, అక్కడి నుంచి కైల పర్వతానికి వెళ్లి శివయ్యను దర్శించుకున్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో హిల్సాకు వచ్చాక వాతావరణం అనుకూలించకపోవడంతో 24వ తేదీ నుంచి 31 వరకు అక్కడే చిక్కుకుపోయారు. వందమంది ఉండాల్సిన ప్రదేశంలో 400మంది యాత్రికులను ఉంచడంతో ఒక్కో గదిలో 20 మంది ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజులో ఒకపూట భోజనం పెట్టారు. ఆరోగ్యం బాగోలేని వారిని పట్టించుకోకపోవటంతో వారు మానసికంగా కుంగిపోయారు. చిన్న చిన్న గుడిసెల్లో.. అందులోనూ ఒక్కొక్క గదిలో 20 మందిని ఉంచారు. పడుకోవడానికి స్థలం లేక రాత్రి మొత్తం కూర్చొని ఉన్నారు. కనీసం తినడానికి సరిపడా భోజనం కూడా లేదు. ఒక్కరికి ఒక గరిటే సాంబర్తో కూడిన అన్నం ఆరు రోజుల పాటు పెట్టారు. అక్కడ తమకు ప్రత్యక్ష నరకం చూపారని యాత్రికుడు శ్రీకాంత్ రెడ్డి, బాలరాజు తెలిపారు. ఆ సమయంలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందడంతో తమకు మరింత ఆందోళన కలిగిందన్నారు. ఆరు రోజుల తర్వాత స్థానికంగా మీడియాలో వచ్చిన కథనాలతో పాటు నేపాల్‌లో వచ్చిన కథనాలకు అక్కడి అధికారులు స్పందించి తమకు భరోసా కల్పించారన్నారు. వాతావారణం అనుకూలించడంతో ప్రత్యేక విమానంలో లక్నోకు పంపించారు. అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నామని తెలిపారు.