బ్రహ్మపుత్ర నదిని బ్లాక్ చేసిన చైనా
బీజింగ్: చైనా మరోసారి భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించే దుందుడుకు చర్యకు పాల్పడింది. పాకిస్థాన్తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని ఇండియా సమీక్షించదలుచుకున్న నేపథ్యంలోమనదేశంలోకి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నదిని బ్లాక్ చేస్తూ చైనా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
బ్రహ్మపుత్ర నదిపై టిబెట్లో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన హైడ్రోఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్టును చైనా నిర్మిస్తోంది. దీని వ్యయం రూ.9765 కోట్టు అని అంచనా.ఇది2.5 బిలియన్ కిలోవాట్ల సామర్థంతో ఆరు యూనిట్లతో నిర్మిస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు. దీని నిర్మాణాన్ని 2019 కల్లా చైనా పూర్తి చేయాలని భావిస్తోంది. బ్రహ్మపుత్ర నది టిబెట్ నుంచి భారత్ లోని అరుణాచల్, అస్సాంలలో ప్రవహిస్తుంది. తాజాగా చైనా బ్రహ్మపుత్ర నదిని బ్లాక్ చేయడం వల్ల ఇండియా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.ఈ ప్రాజెక్టుపై చాలా కాలంగా వ్యతిరేకిస్తున్న భారత్ సరిహద్దుకు 550 కి.మీ దూరంలో ప్రాజెక్టును నిర్మించాలని డిమాండ్ చేస్తోంది.