మరోసారి చైనా కవ్వింపు చర్య.. అరుణాచల్‌, అక్సాయిచిన్‌ మావే! | China Released 2023 Edition Of New Standard Official Map, Shows Arunachal As Part Of Its Territories - Sakshi
Sakshi News home page

మరోసారి చైనా కవ్వింపు చర్య.. అరుణాచల్‌, అక్సాయిచిన్‌ మావేనంటూ మ్యాప్‌ విడుదల

Published Tue, Aug 29 2023 11:39 AM | Last Updated on Tue, Aug 29 2023 12:35 PM

China Release New standard map shows Arunachal Among Its territories - Sakshi

సరిహద్దు విషయంలో పొరుగుదేశం చైనా తీరు మారలేదు. స్టాండర్డ్‌ మ్యాప్‌ పేరుతో డ్రాగన్‌ కంట్రీ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. భారత్ భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపుతూ సోమవారం చైనా కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. ‘ది 2023 ఎడిషన్‌ ఆఫ్‌ చైనా స్టాండర్డ్‌ మ్యాప్‌’ పేరుతో చైనా సహజ వనరుల శాఖ రూపొందించిన ఈ మ్యాప్‌ను అధికారికంగా విడుదల చేసింది.  డిజిటల్‌, నావిగేషన్‌ మ్యాపుల్ని కూడా విడుదల చేస్తున్నట్టు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ మ్యాప్‌ పొరుగు దేశాలతో చైనా జాతీయ సరిహద్దులను డ్రాయింగ్‌ పద్దతి ద్వారా చూపుతోంది.

చైనా సరిహద్దులు.. అందులో భూభాగాల్ని తెలుపుతూ రూపొందించిన ఈ మ్యాప్‌లో సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలైన అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయిచిన్‌ తమ భూభాగంలోనివిగా పేర్కొంది. వాటి పేర్లను కూడా మార్చేస్తూ మ్యాప్‌లో చూపించింది. భారత్‌లోని వివాదాస్పద భూభాగాలతోపాటు, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం కూడా తమ దేశంలో అంతర్భాగంగా పేర్కొంది. వాటి పేర్లను కూడా మార్చేస్తూ మ్యాప్‌లో చూపించింది.
చదవండి: ఇండోనేషియా: భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల్లేవ్‌

అయితే దక్షిణ చైనా సముద్ర ప్రాంతాలపై చైనాతోపాటు వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై, తైవాన్‌ దేశాలకు వివాదాలు కలిగి ఉన్నాయి. కాగా 1962లో భారత్‌తో జరిగిన యుద్ధంలో అరుణాచల్ ప్రదేశ్‌ను ఆక్రమించుకున్న చైనా.. ఆ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్‌గా పిలుస్తోంది. అయితే అరుణాచల్ ప్రదేశ్‌ ఎప్పటికీ ఇండియాలోనే అంతర్భాగమని కేంద్రం పలుసార్లు స్ఫష్టం చేసింది. అయినా చైనా తన తీరును మార్చుకోలేదు.

బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, జిన్‌పింగ్ భేటీ అయిన నాలుగు రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మరికొన్ని రోజుల్లో జీ20 సదస్సు జరగనున్న వేళ, మ్యాపుల వ్యవహారంపై భారత్‌ ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement