న్యూఢిల్లీ: భారత భూభాగాలను తమ అధికారిక మ్యాప్‌లో కలువుకుని చైనా విడుదల చేసిన మ్యాప్‌పై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పందిస్తూ అది వారికున్న పాత ఆలవాటేనని అన్నారు.
చైనా ఈరోజు విడుదల చేసిన 2023కు సంబంధించిన అధికారిక మ్యాప్‌లో కొన్ని పరాయి దేశాలకు సంబంధించిన భూభాగాలను కలిపేసుకుంది. ఈ మ్యాప్‌లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయి చిన్ వంటి భూభాగాలతో పాటు తైవాన్, దక్షిణా చైనా సముద్రాన్ని కూడా తమ దేశంలో కలుపుకుంది.
ఇదే విషయంపై భారత విదేశాంగ శాఖామంత్రి జయశంకర్‌ను ప్రశ్నించగా అయన మాట్లాడుతూ దీనివలన చైనాకు ఒరిగే ప్రయోజనమేమీ లేదని చెబుతూనే అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటికీ ఎప్పటికీ భారత భూభాగమేనని అన్నారు. తమవి కాని ప్రాంతాలు తమవని చెప్పుకోవడం సరైన పధ్ధతి కాదు. మా ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్‌పై పూర్తి స్పష్టతతో ఉందని అన్నారు.
ఈ సందర్భంగా ఆర్టికల్-370 రద్దు మా ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయమన్నారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా తొలగించడం వెనుక చాలా కారణాలున్నాయి.. దాని వలన ఆ ప్రాంతానికి కలిగిన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని దీనిని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేశారన్నారు. ఈ ఐదేళ్ళలో మేము ఏమి సాధించామంటే కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను కూడా సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని చెబుతానని అన్నారు.
ఇది కూడా చదవండి: వీడియో చెప్పిన కథ : రష్యాను భయపెడుతోన్న ఉక్రెయిన్ డ్రోన్లు
Comments
Please login to add a commentAdd a comment