టిబెట్ రాజధాని లాసాలోని పశ్చిమ ప్రాంతంలో పర్యాటకులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొట్టింది.
బీజింగ్: టిబెట్ రాజధాని లాసాలోని పశ్చిమ ప్రాంతంలో పర్యాటకులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొట్టింది. అనంతరం బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 44 మంది పర్యాటకులు మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. క్షతగాత్రులు లాసా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది పర్యాటకులు ఉన్నారని తెలిపింది. మరో ఐదుగురు బస్సు ఎదురుగా వస్తున్న వాహనంలో ప్రయాణిస్తున్నారని చెప్పింది. మృతి చెందిన పర్యాటకులంతా అన్హుయి, షాంగై, షాన్డాంగ్, హిబి ప్రాంతాలకు చెందిన వారని వెల్లడించింది. ఆ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని మీడియా వివరించింది.