అస్సోం : భారత్‌కు రావల్సిన బ్రహ్మాపుత్ర నది నీటిని చైనా అక్రమంగా దారి మళ్లిస్తోందని అస్సాం మాజీ సీఎం తరుణ్ గగోయ్ ట్వీటర్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్ ఎగువన బ్రహ్మాపుత్ర నదిపై చైనా అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుందని, మనకు రావాల్సిన నీటి వాటాను కూడా చైనా అక్రమంగా తరలిస్తోందని వెల్లడించారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించాలని ఆయన ట్వీటర్ వేదికగా కోరారు.
భారత ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని తరుణ్ గగోయ్ కోరారు. భవిషత్తులో నీటి కోసం చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా బ్రహ్మాపుత్ర నదిపై చైనా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మింస్తుందని భారత్ పలు సంధర్భాల్లో అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. కాగా చైనా అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దు, డోక్లాం విషయంలో భారత అభ్యంతరాలను ఖాతరు చేస్తూ సరిహద్దులో తన బలగాలను మోహరించడంతో యుద్ద వాతావరణం నెలకొన్న విషయం విదితమే.
#China has already been diverting #Brahmaputra water with a dam which will create water shortage for us. The artificial rainwater harvesting plan of them will create even more danger. PM @narendramodi should take it seriously or our future will be in dark.
— Tarun Gogoi (@tarun_gogoi) March 28, 2018
Comments
Please login to add a commentAdd a comment