Rail accidents
-
రైలు ఢీకొని ఏనుగు, దాని బిడ్డ మృతి
అస్సాం జోర్హాట్ జిల్లాలో రైలు ఢీకొని ఏనుగు దాని 10నెలల బిడ్డ చనిపోయాయి. ఆదివారం రాత్రి 10:50 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు సోమవారం తెలిపారు. రైలు పట్టాలపై ఉన్న ఓ ఏనుగల మందను నాగినిమోరా రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఏనుగు దాని పిల్లను రైలు 50 మీటర్ల పాటు ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలై అవి చనిపోయినట్లు సమాచారం. ఏనుగు వయసు 21 ఏళ్లు, దాని బిడ్డ వయసు 10నెలలు అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. చదవండి: నన్ను గెలిపిస్తే రూ.20కే పెట్రోల్, ఇంటికో బైక్.. -
ప్రమాదాల్లో 11,822 మంది మృత్యువాత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు, రైలు, ఇతర ప్రమాదాల వల్ల 11,822 మంది మృత్యువాత పడ్డట్లు నేషనల్ క్రైమ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. ప్రమాద మరణాలు, ఆత్మహత్యలకు సంబంధించిన జాబితాను గురువారం విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 2019 కంటే 2020 ఏడాదిలో రోడ్డు ప్రమాదాల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య తగ్గినట్లు పేర్కొంది. అలాగే ఆత్మహత్య ఘటనల్లోనూ తగ్గుదల ఉందని వెల్లడించింది. ప్రమాదాల్లో 11,822 మంది.. రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఇతరత్రా ప్రమాదాల కింద మొత్తం 11,822 మంది మరణించినట్లు వెల్లడించింది. 2019–20కి సంబంధించిన జాబితాలో రాష్ట్రంలో జరిగిన 19,505 ఘటనల్లో 7,219 మంది రోడ్డు ప్రమాదాల్లోనూ మృత్యువాత పడ్డుట్టు తెలిపింది. ప్రకృతి వైపరీత్యాల కారణం గా 170 మంది మృత్యువాత పడినట్లు తెలిసింది. రైలు ప్రమాదాల్లో 337 మంది మృత్యువాత పడ్డారని పేర్కొంది. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాలతో పోలిస్తే 11 శాతం మృతుల సంఖ్య తగ్గినట్టు ఎన్సీఆర్బీ స్పష్టం చేసింది. పలు కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనల్లో 8,058 మంది మృతి చెందినట్లు నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో వెల్లడించింది. ఇందులో కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డ వారే అధికంగా ఉన్నారని తెలిపింది. -
ప్రమాదాల ప్రయాణం
కారేపల్లి : రైలు బోగీల్లో కూర్చునేందుకు సీట్లు ఉంటాయి. అయినా సీట్లలో కూర్చోరు. డోర్ వద్ద నిల్చుంటారు. అక్కడే కూర్చుని ప్రయాణిస్తున్నారు. చెవుల్లో హియర్ ఫోన్స్ పెట్టుకొని సెల్‌ఫోన్ పాటలు వింటుంటారు. ఆదమరిచి ప్రయాణించటం యువత ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. రైలు వేగం ఓ వైపు, ట్రాక్ మూలమలుపులు మరో వైపు.. దీనికి తోడు అజాగ్రత్త, మైమరపులతో అదుపు తప్పి, రైలు నుంచి జారిపడి నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ప్రమాదాలతో మృత్యువాత పడి, కన్న తల్లిదండ్రులకు గర్భ శోకాన్ని మిగిల్చుతున్నారు. ప్రమాదాల అంచుల్లో ప్రయాణిస్తూ.. నిండైన నిర్లక్ష్యంతో జీవితానికి ముగింపు పలుకుతున్నారు. కారేపల్లి మీదుగా విజయవాడ, హైదారాబాద్, కొత్తగూడెం వైపు నిత్యం వందల సంఖ్యలో రైళ్లు ప్రయాణిస్తుంటాయి. వీటిలో 15 వరకు ఫ్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కారేపల్లి రైల్వే జంక్షన్ ద్వారా వేలాది మంది ప్రయాణికులు విజయవాడ, హైదరాబాద్, కొత్తగూడెం వైపు నిత్యం ప్రయాణాలను కొనసాగిస్తుంటారు. దీనికి తోడు కారేపల్లిలో ఇంజనీరింగ్, ఎంబీఏ, పాలిటెక్నిక్, డిగ్రీ, జూనియర్, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు ఉండటంతో విద్యార్థుల రద్దీ పెరిగింది. ఇదిలా ఉండగా కారేపల్లి నుంచి గాంధీపురం రైల్వే స్టేషన్ వరకు 4 కిలోమీటర్ల వరకు రైల్వే ట్రాక్ అత్యంత మూలమలుపులతో ఉంది. యువకులు డోర్ల వద్ద కూర్చుంటున్నారు. రైలు వేగంలో డోర్ వెనుకాల నుంచి గట్టిగా తగిలి.. అదుపు తప్పి రైలు కింద పడిపోయి ప్రాణాలను వదులుతున్నారు. దీనికి తోడు కదులుతున్న రైలు ఎక్కడం, దిగటం చేస్తుండటంతో అదుపు తప్పి ప్రమాదాలకు గురౌతున్నారు. జరిగిన కొన్ని ప్రమాదాలు.. మార్చి 4 రాత్రి టేకులపల్లి మండలం లక్ష్మాతండా గ్రామానికి చెందిన బాణోతు యుగేందర్ (25) కొత్తగూడెం నుంచి హైదరాబాద్ కాకతీయ ప్యాసింజర్‌లో వెళ్తున్నాడు. డోర్ వద్ద కూర్చొని ఉండటంతో కొమ్ముగూడెం గేటు సమీపంలో ఉన్న మూలమలుపులో జారి రైలు కింద పడి మృతి చెందాడు. డిసెంబర్ 18, 2016న కొత్తగూడెం ప్రగతి నగర్‌కు చెందిన డీటీ రాజేష్ (17) 10 మంది స్నేహితులతో కలిసి మణూగూరు ప్యాసింజర్‌లో కొత్తగూడెం నుంచి కాజీపేటకు వెళ్తున్నాడు. కొమ్ముగూడెం రైల్వే గేట్ సమీపంలో ఉమ్మివేసేందుకు డోర్ వద్దకు వచ్చాడు. డోర్ వెనుక నుంచి గట్టిగా నెట్టివేయటంతో కింద పడి మృతి చెందాడు. జనవరి 23, 2016న టేకులపల్లి మండలం ఈర్యాతండా గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి నూనావత్ రాములు కారేపల్లి రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు దిగే క్రమంలో కింద పడి మృతి చెందాడు. 2015లో గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం గంగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఆకుల అనసూర్యమ్మ అనే వృద్ధురాలు రొట్టమాకురేవు మూలమలుపు వద్ద కాకతీయ ప్యాసింజర్‌లో నుంచి కిందపడి మృతి చెందారు. -
రైలు ప్రమాదాలు.. 14 మంది మృతి
ముంబై: నగరంలో సోమవారం లోకల్ రైళ్లు ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారాయి. ఒకే రోజు వేర్వేరు లోకల్ రైలు ప్రమాదాల్లో 14 మంది మృత్యువాత పడగా ఎనిమిది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ ఉంది. ఈద్ పర్వదినం పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో ఇళ్ల నుంచి జనం బయటకు వచ్చారు. అప్పటికే వర్షం కారణంగా లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో రైళ్లలో కిక్కిరిసిన జనం ఉన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్నందున డోరువద్ద వేలాడుతున్న వారు కొందరు కిందపడి చనిపోయారు. మరికొందరు నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతూ రైలు ఢీ కొని మృత్యువాత పడ్డారు. ఇందులో వాషి రైల్వే స్టేషన్ హద్దులో 3, వసయి రోడ్ హద్దులో–3, వడాల రోడ్, కల్యాణ్ హద్దులో ఇద్దరు చొప్పున మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అలాగే థానే, డోంబివలి, బోరివలి, ముంబైసెంట్రల్ స్టేషన్ హద్దులో ఒక్కొక్కరు చొప్పున ఇలా మొత్తం 14 మంది చనిపోయారు. ఈద్‌కు ముందురోజు వేర్వేరు చోట్ల జరిగిన లోకల్ రైలు ప్రమాదాల్లో ఎనిమిది మంది చనిపోగా 14 మంది గాయపడ్డారు. -
రైలు కింద పడి ఇద్దరి దుర్మరణం
విజయనగరం టౌన్ : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రైలు కింద పడి ఇద్దరు దుర్మరణం చెందారు. విజయనగరం రైల్వేస్టేషన్ యార్డు డౌన్‌లౌన్ ట్రాక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించి ఉన్నాడని జీఆర్పీ దర్యాప్తు అధికారి బి. గౌరినాయుడు బుధవారం తెలిపారు. ఇతని వద్ద శ్రీకాకుళం నుంచి విజయవాడ జంక్షన్ వరకు తీసిని జనరల్ టికెట్ లభించిందన్నారు. మతుడి వయసు 35 సంవత్సరాలు ఉంటుందన్నారు. చామనఛాయ రంగు కలిగి కుడి భుజంపై ఏసు ప్రభువు, సిలువ పచ్చబొట్టు ఉందని తెలిపారు. 26వ తేదీన ఈప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. నీలం రంగు జీన్‌ఫ్యాంట్, ఆకుపచ్చ ఫుల్‌హ్యాండ్ షర్ట్ వేసుకున్నాడని, వివరాలు తెలిసిన వారు 94416 12121, 94906 17085 నంబర్లకు సంప్రదించాని కోరారు. కోమటిపల్లి స్టేషన్ సమీపంలో... దత్తిరాజేరు : మండలంలోని కోమటిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు కిందపడి మహిళ కన్నుమూసింది. ఈమె వయసు సుమారు 60 సంవత్సరాలు ఉంటుంది. ట్రాక్ పరిశీలన చేస్తుండగా మహిళ శవాన్ని కీమన్ అబద్ధం గుర్తించారు. -
రైలు కింద పడి ఇద్దరి దుర్మరణం
విజయనగరం టౌన్ : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రైలు కింద పడి ఇద్దరు దుర్మరణం చెందారు. విజయనగరం రైల్వేస్టేషన్ యార్డు డౌన్‌లౌన్ ట్రాక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించి ఉన్నాడని జీఆర్పీ దర్యాప్తు అధికారి బి. గౌరినాయుడు బుధవారం తెలిపారు. ఇతని వద్ద శ్రీకాకుళం నుంచి విజయవాడ జంక్షన్ వరకు తీసిని జనరల్ టికెట్ లభించిందన్నారు. మతుడి వయసు 35 సంవత్సరాలు ఉంటుందన్నారు. చామనఛాయ రంగు కలిగి కుడి భుజంపై ఏసు ప్రభువు, సిలువ పచ్చబొట్టు ఉందని తెలిపారు. 26వ తేదీన ఈప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. నీలం రంగు జీన్‌ఫ్యాంట్, ఆకుపచ్చ ఫుల్‌హ్యాండ్ షర్ట్ వేసుకున్నాడని, వివరాలు తెలిసిన వారు 94416 12121, 94906 17085 నంబర్లకు సంప్రదించాని కోరారు. – కోమటిపల్లి స్టేషన్ సమీపంలో... దత్తిరాజేరు : మండలంలోని కోమటిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు కిందపడి మహిళ కన్నుమూసింది. ఈమె వయసు సుమారు 60 సంవత్సరాలు ఉంటుంది. ట్రాక్ పరిశీలన చేస్తుండగా మహిళ శవాన్ని కీమన్ అబద్ధం గుర్తించారు. -
రైలు ప్రమాదాలకు 25 వేల మంది బలి
న్యూఢిల్లీ: గతేడాది రైలు ప్రమాదాల్లో 25 వేల మందిపైగా మృత్యువాత పడ్డారు. 3,882 మంది గాయపాలయ్యారు. 2014లో రైలు ప్రమాదాల్లో 25006 మంది మృతి చెందారని జాతీయ నేర గణాంక విభాగం(ఎన్సీఆర్బీ) వెల్లడించింది. గతేడాది 28,360 రైల్వే ప్రమాద కేసులు నమోదయ్యాని, అంతకుముందు పోలిస్తే ఇది 9.2 శాతం తక్కువని తెలిపింది. 2013లో 31,236 రైల్వే ప్రమాద కేసులు నమోదయ్యాయి. రైలు నుంచి జారిపడడం, రైళ్లు ఢీకొన్న ఘటనల్లో(17,480 కేసులు) ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని ఎన్సీఆర్బీ తెలిపింది. రైలు ప్రమాదాల్లో మహారాష్ట్ర ముందుంది. 25006 మృతుల్లో 14,391 మంది రైలు నుంచి జారిపడి లేదా రైళ్లు ఢీకొనడంతో మృతి చెందారు. సాంకేతిక లోపం కారణంగా 469 ప్రమాదాలు సంభవించాయి. డ్రైవర్ల నిర్లక్ష్యంతో సంభవించిన 60 ప్రమాదాల్లో 67 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఎన్సీఆర్బీ వెల్లడించింది. -
బలి జరిగితేనే కానీ....
ప్రస్తుత పరిస్థితులలో మనిషి ప్రాణాలు గాలిలో దీపంలా తయారయ్యాయి. ఆ ప్రాణాలు ఎక్కడ ఎప్పుడు ఏలా పోతాయో ఎవరికి ఏరుకా. ఏదైన ప్రమాదం జరిగి మనుషులు మరణిస్తే ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరీ చేతులు కాలాక అకులు పట్టుకున్న చందంగా తయారైంది. అందుకు తాజా ఉదాహరణ.... మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గురువారం ఉదయం కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపైకి వచ్చిన స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో విద్యార్థులతోపాటు బస్సు డ్రైవర్, క్లీనర్ మొత్తం 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో మరో 15 మంది వరకు గాయపడ్డారు. దేశంలో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న సంఘటన ఇదే మొదటిది కాదు... గతంలో పలు రాష్ట్రాలలో ఇటువంటి తరహా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లు, స్కూల్ బస్సు ప్రమాదాల నివారణ.... నిర్భయ అత్యాచారం వరకు ప్రభుత్వం ఏన్నో కమిటీలు వేసింది. ప్రభుత్వం కూడా ఆ కమిటీలు అందించిన నివేదికలు భద్రంగా అటకెక్కించింది. అదేమిటో ప్రమాదం జరిగినప్పుడే ప్రభుత్వ అధికారుల్లో స్పందన వస్తుంది. తనిఖీల పేరిట నానాహడావుడి చేస్తారు. అందుకు పాలెం బస్సు దుర్ఘటన అందుకు ఉదాహరణ. ఆ తర్వాత నాలుగైదు రోజులకు వారు మొద్దు నిద్రలోకి జారుకుంటారు. ప్రమాదం జరిగి ప్రజలు బలి అయితేనే అటు రాష్ట్ర ప్రభుత్వంలోకానీ ఇటు కేంద్ర ప్రభుత్వంలో కానీ చిరు కదలిక వస్తుంది. అంతలోనే మళ్లీ ఇలాంటి వన్ని మాములే అని ప్రభుత్వ పెద్దలు సర్థి చెప్పుకుని కామ్‌గా ఉంటారు. ప్రజలకు ఎక్కడ,ఎలా ప్రమాదం జరిగే వీలు ఉంది... అటువంటి సంఘటనలు జరగకుండా ఏలాంటి చర్యలు తీసుకోవాలి... ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి సిబ్బందితో సహా అందరిని భాగస్వామ్యం చేసుకుంటు ముందుకు వెళ్లితే ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవడం ఇలాంటి చర్యలు పునరావృతం కావు. ఏదైన ప్రమాదం జరిగి మనుషుల ప్రాణాలు బలి అయితేనే కానీ ప్రభుత్వం స్పందించదు. ఓ వేళ ప్రభుత్వం స్పందించిన... ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండ చర్యలు తీసుకుంటాం... కమిటీ వేస్తున్నం ... నష్టపరిహారం కింద లక్షలు ఇస్తామని ప్రకటిస్తుంది. అంతే ఆ తర్వాత ప్రమాదంపై ప్రభుత్వం ఓ కమిటీ వేస్తుంది. ఆ కమిటీ నివేదక ఇస్తుంది. దాన్ని తీసుకువెళ్లీ అటకెక్కిస్తారు. అంతే ఆ తర్వాత మళ్లీ ఏదో ప్రమాదం సంభవించి... ప్రజలు పెద్ద సంఖ్యలో మృతి చెందితే... ప్రభుత్వం మళ్లీ ఇదే చిలకపలుకు పలుకుతుంది. అంతే కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా శాశ్వత నివారణ కోసం తీసుకుంటున్న చర్యలు ఏంటి అన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద ఉన్న జవాబు మాత్రం శూన్యం. -
రైలు ప్రమాదాలపై ‘బెస్ట్’ అవగాహన
సాక్షి, ముంబై: బెస్ట్ బస్సుల్లోని సీసీటీవీలలో రైలు ప్రమాదాలపై ప్రయాణికుల్లో అవగాహన కల్పించనున్నారు. నగర శివారులో జరుగుతున్న ఫ్రమాదాల్లో రోజూ దాదాపు 10 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతుండటంతో బెస్ట్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ, రాధీ డిజాస్టర్ విద్యా ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రయాణికుల్లో అవగాహన కల్పించనున్నారు. కాగా ప్రయాణికులు నడుస్తున్న రైలును ఎలా ఎక్కుతున్నారు.. రైలు పట్టాలు దాటుతూ ఎలా మృత్యువాత పడుతున్నారు.. అదేవిధంగా రైళ్లలో ప్రాణాంతక విన్యాసాలు చేస్తూ ఎలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. తదితర అంశాలను బెస్ట్ బస్సుల్లోని టీవీలపై చూపించేందుకు అధికారులు నిర్ణయించారు. రైళ్లలో విన్యాసాలు చేయడం చాలా ప్రమాదకరమని ప్రయాణికులకు తెలియజెప్పడమే తమ ముఖ్య ఉద్దేశంగా అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రధి డిజాస్టర్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ రితా సావ్లా మాట్లాడుతూ.. మొదటి విడతలో తాము రైలు ప్రమాదాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను బెస్ట్ బస్సుల్లోని టీవీలలో చూపించనున్నట్లు తెలిపారు. తర్వాత రోడ్డు ప్రమాదాల వీడియో దృశ్యాలను చూపించనున్నామన్నారు. రైలు ప్రమాదాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను పొందుపర్చామని చెప్పారు. ఈ క్లిప్పింగ్‌లలో అతి వేగంగా వెళుతున్న రైలులో యువకులు ప్రాణాంతక విన్యాసాలు చేస్తూ పట్టు కోల్పోయి ట్రాక్‌పై పడడం లాంటి సన్నివేశాలను పొందుపరిచినట్లు వివరించారు. మరో వీడియోలో మహిళలు నడుస్తున్న రైలు కడ్డీలను పట్టుకుని పరిగెడుతూ ఎలా ఎక్కేందుకు యత్నిస్తున్నారో తదితర దృశ్యాలను బస్సుల్లోని ప్రయాణికులకు చూపించనున్నారు. ఈ కార్యక్రమాన్ని బెస్ట్ చైర్మన్ ధుద్వాడ్కర్ ప్రారంభించనున్నారని రితా సావ్లా తెలిపారు. ఈ వీడియో దృశ్యాలను మొదట 25 బస్సుల్లో ఏడాది వరకు చూపించనున్నారు. ఇందులో రోడ్డు ప్రమాదాలు, వాహన చోదకులు వాహన నియమాలను ఉల్లంఘించడం వంటి దృశ్యాలను కూడా ఈ టీవీల్లో చూపించనున్నట్లు అధికారులు తెలిపారు.