ముంబై: నగరంలో సోమవారం లోకల్ రైళ్లు ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారాయి. ఒకే రోజు వేర్వేరు లోకల్ రైలు ప్రమాదాల్లో 14 మంది మృత్యువాత పడగా ఎనిమిది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ ఉంది. ఈద్ పర్వదినం పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో ఇళ్ల నుంచి జనం బయటకు వచ్చారు. అప్పటికే వర్షం కారణంగా లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో రైళ్లలో కిక్కిరిసిన జనం ఉన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్నందున డోరువద్ద వేలాడుతున్న వారు కొందరు కిందపడి చనిపోయారు.
మరికొందరు నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతూ రైలు ఢీ కొని మృత్యువాత పడ్డారు. ఇందులో వాషి రైల్వే స్టేషన్ హద్దులో 3, వసయి రోడ్ హద్దులో–3, వడాల రోడ్, కల్యాణ్ హద్దులో ఇద్దరు చొప్పున మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అలాగే థానే, డోంబివలి, బోరివలి, ముంబైసెంట్రల్ స్టేషన్ హద్దులో ఒక్కొక్కరు చొప్పున ఇలా మొత్తం 14 మంది చనిపోయారు. ఈద్‌కు ముందురోజు వేర్వేరు చోట్ల జరిగిన లోకల్ రైలు ప్రమాదాల్లో ఎనిమిది మంది చనిపోగా 14 మంది గాయపడ్డారు.
రైలు ప్రమాదాలు.. 14 మంది మృతి
Published Tue, Jun 27 2017 7:19 PM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM
Advertisement