రైలు ప్రమాదాలకు 25 వేల మంది బలి
న్యూఢిల్లీ: గతేడాది రైలు ప్రమాదాల్లో 25 వేల మందిపైగా మృత్యువాత పడ్డారు. 3,882 మంది గాయపాలయ్యారు. 2014లో రైలు ప్రమాదాల్లో 25006 మంది మృతి చెందారని జాతీయ నేర గణాంక విభాగం(ఎన్సీఆర్బీ) వెల్లడించింది. గతేడాది 28,360 రైల్వే ప్రమాద కేసులు నమోదయ్యాని, అంతకుముందు పోలిస్తే ఇది 9.2 శాతం తక్కువని తెలిపింది. 2013లో 31,236 రైల్వే ప్రమాద కేసులు నమోదయ్యాయి.
రైలు నుంచి జారిపడడం, రైళ్లు ఢీకొన్న ఘటనల్లో(17,480 కేసులు) ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని ఎన్సీఆర్బీ తెలిపింది. రైలు ప్రమాదాల్లో మహారాష్ట్ర ముందుంది. 25006 మృతుల్లో 14,391 మంది రైలు నుంచి జారిపడి లేదా రైళ్లు ఢీకొనడంతో మృతి చెందారు. సాంకేతిక లోపం కారణంగా 469 ప్రమాదాలు సంభవించాయి. డ్రైవర్ల నిర్లక్ష్యంతో సంభవించిన 60 ప్రమాదాల్లో 67 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఎన్సీఆర్బీ వెల్లడించింది.