శ్రీను, సంతోషిలకు కాంస్యాలు | N.srinu,santoshi won Bronze medals in national weight lifting championship | Sakshi
Sakshi News home page

శ్రీను, సంతోషిలకు కాంస్యాలు

Published Fri, Dec 27 2013 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

N.srinu,santoshi won Bronze medals in national weight lifting championship

గువాహటి: జాతీయ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్లు ఎన్.శ్రీను, మత్స సంతోషి సత్తా చాటారు. ఇద్దరు కాంస్య పతకాలు గెలుపొందారు. గురువారం ఇక్కడ జరిగిన ఈ పోటీల్లో బాలుర 56 కేజీ కేటగిరీలో శ్రీను రెండు కాంస్య పతకాలు చేజిక్కించుకున్నాడు.

స్నాచ్‌లో 97 కేజీల బరువెత్తి మూడో స్థానంలో నిలిచిన శ్రీను... క్లీన్ అండ్ జర్క్‌లో 119 కేజీల బరువెత్తాడు. మొత్తం 216 కేజీల బరువుతో మరో కాంస్య పతకం గెలిచాడు. బాలికల 53 కేజీ కేటగిరీలో మత్స సంతోషి క్లీన్ అండ్ జర్క్‌లో కాంస్యం నెగ్గింది. స్నాచ్‌లో 69 కేజీల బరువెత్తిన ఆమె క్లీన్ అండ్ జర్క్‌లో 89 కేజీల బరువెత్తి తృతీయ స్థానంలో నిలిచింది. ఏపీ అమ్మాయి మొత్తం 158 కేజీల బరువెత్తింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement