రియల్ జ్యూస్‌కు అదిరే షాక్ ఇచ్చిన బాలిక
న్యూఢిల్లీ: 'రియల్' ఫ్రూట్ జ్యూస్ తెలుసు కదా!. ఆ కంపెనీకి ఓ తొమ్మిదేళ్ల బాలిక ఇచ్చిన షాక్‌తో దిమ్మతిరిగింది. గువాహటికి చెందిన మృంగా కే మజుందార్(9) తన తండ్రితో పాటు బయటకు వెళ్లింది. ఓ షాపు వద్ద కూతురికి రియల్ ఫ్రూట్ జ్యూస్ కొనిచ్చాడు. ఫ్రూట్ జ్యూస్ ప్యాకేజింగ్‌పై బాలుడు స్కూల్ యూనిఫాం వేసుకుని ఉండటంతో అది కేవలం అబ్బాయిలకేనా అని తండ్రిని ప్రశ్నించి జ్యూస్ తాగడానికి నిరాకరించింది మృంగా. దీంతో ఈ విషయంపై మృంగా తండ్రి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీకి లేఖ రాశారు.
రియల్ ఫ్రూట్ జ్యూస్ ప్యాకేజింగ్ మహిళపై వివక్ష చూపుతున్నట్లు ఉందని లేఖలో పేర్కొన్నారు. దాంతో వెంటనే చర్యలు తీసుకున్న రియల్ ఫ్రూట్ జ్యూస్ ప్యాకేజింగ్‌పై ఉన్న ఫోటోను మార్చేసింది. మహిళల పట్ల తమకు ఎలాంటి వివక్షపూరిత ధోరణి లేదని పేర్కొంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పింది.