జమ్మూ కశ్మీర్: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. రాంబన్ జిల్లాలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి సురక్షితంగా బయపట్టడారు. .
ఈ ఘటనలో కిరణ్ రిజిజుతో సహా ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని. విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#BREAKING Law Minister @KirenRijiju survived an accident when his Bullet proof car was hit by a full loaded truck near Banihal in Jammu and Kashmir. The car got little damaged but fortunately no one was hurt..@ABPNews pic.twitter.com/tMvkTUVI4e
— Ashish Kumar Singh (ABP News) (@AshishSinghLIVE) April 8, 2023
కాగా కేంద్రమంత్రి కిరణ్ రిజుజు శనివారం జమ్మూ యూనివర్శిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ రాజకీయ కెరీర్‌ను మెరుగుపరచేందుకే ఉద్దేశపూర్వకంగా అదానీ అంశాన్ని లేవనెత్తుతున్నారని ఆరోపించారు. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి నాలుక నరికివేస్తానని తమిళనాడులోని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు బెదిరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. . కాంగ్రెస్ పార్టీ నిరాశాలో ఉందని, న్యాయవ్యవస్థపై దాడి చేస్తోందని అన్నారు. కానీ ఇలాంటి వాటిని ప్రభుత్వం చూస్తూ ఉండదని వార్నింగ్ ఇచ్చారు.
చదవండి: కర్ణాటక ఎన్నికలు: బడా నిర్మాత కారులో రూ.39 లక్షల వెండి వస్తువులు సీజ్!
Comments
Please login to add a commentAdd a comment