న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో మొత్తం 334 జడ్జీల పోస్టులు ఖాళీలుండగా 118 పోస్టుల భర్తీ కోసం హైకోర్టు కొలీజియంల నుంచి అందిన సిఫారసులు వివిధ దశల్లో పరీశీలనలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. మరో 216 జడ్జీల పోస్టులకు హైకోర్టుల కొలీజియంల నుంచి సిఫారసులు అందాల్సి ఉందని వివరించింది.
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు గురువారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. మార్చి 10వ తేదీ నాటికి సుప్రీంకోర్టులో ఖాళీలు లేవన్నారు. 25 హైకోర్టుల్లో మంజూరైన 1,114 జడ్జీ పోస్టులకు గాను 334 ఖాళీలున్నాయన్నారు. జడ్జీ పోస్టుల ఖాళీల భర్తీ నిరంతర ప్రక్రియ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment