Collegium recommended
-
సుప్రీం జడ్జిగా కర్ణాటక సీజే
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జజ్టిస్ ప్రసన్న బి.వరాలే పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ఆయన స్థానంలో జస్టిస్ పి.ఎస్.దినేశ్‌కుమార్‌ను కర్ణాటక హైకోర్టు సీజేగా నియమించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం శుక్రవారం సమావేశమై ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది. జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్ అనంతరం సుప్రీంకోర్టులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి మూ డో న్యాయమూర్తిగా జస్టిస్ వరాలే నిలవనున్నారు. ‘‘జస్టిస్ ఎస్.కె.కౌల్ రిటైర్మెంట్తో గత డిసెంబర్ 25 నుంచి సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తి స్థానం ఖాళీగా ఉంది. న్యాయమూర్తులపై పనిభారం ఎక్కువగా ఉన్నందున ఖాళీలుండరాదు. అందుకే జస్టిస్ వరాలే పేరును సిఫార్సు చేస్తున్నాం’’ అని కొలీజియం పేర్కొంది. 56 మంది సుప్రీం న్యాయవాదులకు సీనియర్ హోదా 11 మంది మహిళలతో సహా 56 మంది న్యాయవాదులను సీనియర్ న్యాయవాదులుగా సుప్రీంకోర్టు నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. వీరిలో తెలుగు న్యాయవాది శ్రీధర్ పోతరాజు కూడా ఉన్నారు. -
కొలీజియం సిఫార్సుల అమలేదీ?
న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం, నచి్చన జడ్జిలనే బదిలీ చేయడం, ఇతరులను పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరి తప్పుడు సంకేతాలను పంపిస్తుందని వెల్లడించింది. 11 మంది జడ్జిలను బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేయగా, ఐదుగురిని కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మరో ఆరుగురి బదిలీ వ్యవహారం పెండింగ్‌లో ఉంది. కొలీజియం సిఫార్సుల అమలు విషయంలో 2021 నాటి సుప్రీంకోర్టు తీర్పునకు కేంద్ర న్యాయ శాఖ కట్టుబడటం లేదని, కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలని కోరుతూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్‌తోపాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. హైకోర్టు జడ్జిలుగా పలువురి పేర్లను కొలీజియం ఇటీవల సిఫార్సు చేయగా, 8 మంది పేర్లకు కేంద్రం ఇంకా ఆమోదం తెలియజేయాలని గుర్తుచేసింది. కేంద్రం జడ్జిలుగా నియమించిన వారికంటే వీరిలో కొందరు సీనియర్లు ఉన్నారని వెల్లడించింది. -
నేపథ్యం ఆధారంగా జడ్జీలపై ఆ ముద్రలు వేయొద్దు
న్యూఢిల్లీ: అడ్వొకేట్ లక్ష్మణచంద్ర విక్టోరియా గౌరీని మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సమరి్థంచారు. విక్టోరియా గౌరీ గతంలో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో కేంద్ర ప్రభుత్వం తరపున వాదించారు. ఆమె బీజేపీ అభిమాని అనే పేరుంది. ఆమెను మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఆమె మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నియామకం వివాదానికి దారితీసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు బార్ సభ్యులు కొందరు జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. కొలీజియం సిఫార్సును రద్దు చేయాలని కోరారు. విక్టోరియా గౌరీ గతంలో పలు సందర్భాల్లో క్రైస్తవులకు, ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇటీవల హార్వర్డ్ లా కాలేజీ సెంటర్ కార్యక్రమంలో మాట్లాడారు. మద్రాస్ హైకోర్టు బార్ సభ్యుల లేఖపై స్పందించారు. కొలీజియం అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తుందని గుర్తుచేశారు. లాయర్లుగా ఉన్నప్పుడు వారి నేపథ్యాన్ని, వెలిబుచి్చన సొంత అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని జడ్జిలపై ఒక వర్గం వ్యతిరేకులుగా ముద్ర వేయడం సరైంది కాదని అన్నారు. గొప్ప తీర్పులు వెలువరించిన జస్టిస్ కృష్ణ అయ్యర్‌కు కూడా రాజకీయ నేపథ్యం ఉండేదని అన్నారు. -
216 జడ్జీల పోస్టుల భర్తీకి సిఫారసులు రాలేదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో మొత్తం 334 జడ్జీల పోస్టులు ఖాళీలుండగా 118 పోస్టుల భర్తీ కోసం హైకోర్టు కొలీజియంల నుంచి అందిన సిఫారసులు వివిధ దశల్లో పరీశీలనలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. మరో 216 జడ్జీల పోస్టులకు హైకోర్టుల కొలీజియంల నుంచి సిఫారసులు అందాల్సి ఉందని వివరించింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు గురువారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. మార్చి 10వ తేదీ నాటికి సుప్రీంకోర్టులో ఖాళీలు లేవన్నారు. 25 హైకోర్టుల్లో మంజూరైన 1,114 జడ్జీ పోస్టులకు గాను 334 ఖాళీలున్నాయన్నారు. జడ్జీ పోస్టుల ఖాళీల భర్తీ నిరంతర ప్రక్రియ అని వివరించారు. -
ఆకాంక్షలను నెరవేర్చండి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామకం, బదిలీల విషయంలో కొలీజియం ఆకాంక్షలను(సిఫార్సులను) చాలావరకు నెరవేర్చాలని(ఆమోదించాలని) కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. కొలీజియం సిఫార్సులను ఆమోదించకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. జడ్జీల నియామకానికి సంబంధించి కొన్ని అంశాల పట్ల తాము ఆందోళన చెందుతున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణకు అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి హాజరు కాలేదు. కొలీజియం సిఫార్సులను చాలావరకు ఆమోదించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని అటార్నీ జనరల్‌కు తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది. -
నాలుగు హైకోర్టులకు సీజేలను సిఫార్స్ చేసిన కొలీజియం
న్యూఢిల్లీ: పట్నా, హిమాచల్ ప్రదేశ్, గువాహటి, త్రిపుర హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను ఎంపికచేస్తూ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు పంపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ సభ్యులుగా ఉన్నారు. కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌ను పట్నా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా, జస్టిస్ సబీనాను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు సీజేగా, త్రిపుర హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌ను, జస్టిస్ సందీప్ మెహతాను గువాహటి హైకోర్టు సీజేగా ఎంపికచేయాలంటూ కొలీజియం.. కేంద్రప్రభుత్వానికి తాజాగా సిఫార్సుచేసింది. -
Collegium Controversy: ఇబ్బందికరంగా కేంద్రం తీరు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా గత డిసెంబర్లో కొలీజియం సిఫార్సు చేసిన ఐదు పేర్లను త్వరలో ఆమోదించనున్నట్టు కేంద్రం పేర్కొంది. రాజస్తాన్, పట్నా, మణిపూర్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్‌కరోల్, జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌తో పాటు పట్నా హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అష్నదుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ మిశ్రా వీరిలో ఉన్నారు. కొలీజియం సిఫార్సులను కేంద్రం పెండింగ్‌లో పె డుతున్న వైనంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకా ధర్మాసనానికి అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి శుక్రవారం ఈ మేరకు సమాచారమిచ్చారు. ‘‘ఆ ఐదు సిఫార్సులు గత డిసెంబర్ 13న చేసినవి. ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది’’ అని ధర్మాసనం గుర్తు చేయగా, ఆదివారానికల్లా నియామక ఉత్తర్వులు రావచ్చని బదులిచ్చారు. కోర్టులపై దాడి పరిపాటైంది: జస్టిస్ కౌల్ కొలీజియం సిఫార్సులను తొక్కిపడుతున్న తీరుపై ధర్మాసనం ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీల సిఫార్సు సంగతేమిటని ప్రశ్నించింది. అందుకు ఇంకాస్త సమయం పడుతుందని ఏజీ చెప్పగా మండిపడింది. ‘‘ఇది చాలా చాలా సీరియస్ అంశం. ఈ విషయంలో కేంద్రం వైఖరి మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతోంది. బదిలీ సిఫార్సులను కూడా పెండింగ్‌లో పెడితే మేమింకేం చేయాలని మీరు ఆశిస్తున్నట్టు? మీరు ఉత్తర్వులిచ్చే దాకా సదరు న్యాయమూర్తులు చేతులు ముడుచుకుని కూర్చోవాలా? మీరదే కోరుకుంటున్నారా?’’ అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. ‘‘ఈ విషయంలో మేం ఒక వైఖరికి వచ్చి అతి కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నారు. అది అంతిమంగా అందరికీ చాలా అసౌకర్యంగా ఉంటుంది’’ అంటూ ఏజీని హెచ్చరించింది. ‘‘హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల్లో జాప్యాన్ని అస్సలు అనుమతించేది లేదు. ఎందుకంటే ఈ విషయంలో కేంద్రం పాత్ర అతి స్వల్పం. ఈ విషయమై ఎవరో మూడో శక్తి మాతో ఆటలాడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోం. మీ జాప్యం వల్ల న్యాయ, పాలనపరమైన విధులకు విఘాతం కలగడం అస్సలు ఆమోదనీయం కాదు’’ అంటూ మండిపడింది. ‘‘హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి ఒక న్యాయమూర్తి పేరును కొలీజియం సిఫార్సు చేస్తే ఇప్పటిదాకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మరో 19 రోజుల్లో ఆయన రిటైరవుతున్నారు. సీజే అవకుండానే రిటైరవాలని మీరు ఆశిస్తున్నట్టా?’’ అని నిలదీసింది. ఇది తమ దృష్టిలో ఉందని, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఏజీ బదులిచ్చినా సంతృప్తి చెందలేదు. ‘‘కొలీజియం సిఫార్సులను ఒక్కోసారి రాత్రికి రాత్రే ఆమోదిస్తున్నారు. మరికొన్నిసార్లు విపరీతంగా జాప్యం చేస్తున్నారు’’ అంటూ తీవ్రంగా తప్పుబట్టింది. కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లనూ పెండింగ్‌లో పెడుతున్నారని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కోర్టులపై బయట తీవ్ర దాడికి పాల్పడుతున్నారని మరో న్యాయవాది ఆరోపించగా వీటికి అలవాటు పడిపోయామని జస్టిస్ కౌల్ ఆవేదన వెలిబుచ్చారు. విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేశారు. కొలీజియం విషయమై కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనడం తెలిసిందే. కొలీజియం సిఫార్సులను కేంద్రం పెండింగ్‌లో పెట్టడం దాన్ని మరింత పెంచింది. తాజాగా అలహాబాద్, గుజరాత్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం జనవరి 31న సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 27 మందే ఉన్నారు. -
వెనకబడ్డ తరగతుల జడ్జిలు... హైకోర్టుల్లో 15 శాతమే
న్యూఢిల్లీ: దేశంలో గత ఐదేళ్లలో హైకోర్టుల్లో నియమితులైన న్యాయమూర్తుల్లో వెనుకబడిన తరగతులకు చెందినవారు కేవలం 15 శాతం మందే ఉన్నారని డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించింది. బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీని నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఈ విషయాన్ని నివేదించింది. జడ్జిలను నియమించే అధికారాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని కొలీజియంకు కట్టబెట్టి 3 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ హైకోర్టుల్లో బీసీ జడ్జిల సంఖ్య పెరగడం లేదని స్పష్టంచేసింది. జడ్జిలుగా ఎవరిని నియమించాలన్నది కొలీజియమే తేలుస్తుందని గుర్తుచేసింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను మాత్రమే ప్రభుత్వం ఆమోదించగలదని వెల్లడించింది. న్యాయస్థానాల్లో సామాజిక వైవిధ్యాన్ని ఇంకా సాధించలేకపోయామని డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్‌అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయమూర్తుల నియామకం విషయంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలతోపాటు మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తరచుగా కొలీజియంను కోరుతూనే ఉందని వివరించింది. 2018 నుంచి 2022 డిసెంబర్ 19 వరకూ హైకోర్టుల్లో 537 మందిని జడ్జిలుగా నియమించగా, వీరిలో 1.3 శాతం మంది ఎస్టీలు, 2.8 శాతం మంది ఎస్సీలు, 11 శాతం మంది ఓబీసీలు, 2.6 శాతం మైనారిటీలు ఉన్నారని తెలియజేసింది. -
న్యాయమూర్తుల నియామకంలో ఏమిటీ జాప్యం?
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం కోసం కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం సత్వరం నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తుండడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీరు విసుగు తెప్పించేలా ఉందని ఆక్షేపించింది. జడ్జీల నియామకాల ప్రక్రియకు భంగం కలిగించవద్దని సూచించింది. జడ్జీలను నిర్దేశిత గడువులోగా నియమించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్ 20న టైమ్‌లైన్ ప్రకటించింది. ఈ టైమ్‌లైన్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ కౌల్, జస్టిస్ ఓజాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎప్పుటికప్పుడు ప్రకటించడం లేదని అటార్నీ జనరల్ వెంకటరమణికి ధర్మాసనం తెలియజేసింది. వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది. తమ అసహనాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేసింది. త్రిసభ్య ధర్మాసనం నిర్దేశించిన టైమ్‌లైన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. కొలీజియం ఒకసారి ఒక పేరును సిఫార్సు చేసిందంటే, అక్కడితో ఆ ఆధ్యాయం ముగిసినట్లే. వాటిపై ప్రభుత్వం మళ్లీ సంప్రదింపులు జరిపే పరిస్థితి ఉండకూడదు’’ అని ఉద్ఘాటించింది. కొన్ని పేర్లు ఏడాదిన్నర నుంచి పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపింది. జడ్జీలుగా పదోన్నతి పొందాల్సిన వారు ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం కారణంగా వెనక్కి తగ్గుతున్నారని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఈ కేసులో ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తున్నాం. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి’’ అని ఏజేకు సూచించింది. తాము చట్టపరంగా నిర్ణయం తీసుకొనే పరిస్థితి తేవొద్దని కేంద్రానికి సూచించింది. నియామకాల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. ఉన్నత పదవుల్లో ఉంటూ అనుచిత వ్యాఖ్యలా? కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజుపై ధర్మాసనం ఆగ్రహం కొలీజియం వ్యవస్థ పట్ల కేంద్ర న్యాయ శాఖ కిరణ్ రిజిజు ఇటీవల చేసిన వ్యా్ఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తలను సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రిజిజు వ్యాఖ్యలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు అలా మాట్లాడడం సమంజసం కాదని పేర్కొంది. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టం కార్యరూపం దాల్చకపోవడం పట్ల కేంద్రం బహుశా అసహనంగా ఉన్నట్లు కనిపిస్తోందని జస్టిస్ ఎస్కే కౌల్ అన్నారు. కానీ న్యాయమూర్తుల నియామకంలో చట్ట నిబంధనలను పాటించకపోవడానికి అది కారణం కారాదని స్పష్టం చేశారు. ఆ పేర్లపై అభ్యంతరాలున్నాయి: కేంద్రం హైకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసిన 20 పేర్లను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ‘‘ఆ పేర్లపై చాలా గట్టి అభ్యంతరాలున్నాయి. కనుక మీ సిఫార్సులను పునఃపరిశీలించండి’’ అని సూచించింది!! కేంద్రం తిప్పి పంపిన ఈ 20 పేర్లలో 11 కొలీజియం రెండోసారి సిఫార్సు చేసినవి కావడం విశేషం! మిగతా తొమ్మిదేమో కొత్త పేర్లు. తాను స్వలింగ సంపర్కినని బాహాటంగా ప్రకటించిన అడ్వకేట్ సౌరభ్ కృపాల్ పేరు కూడా తిప్పి పంపిన జాబితాలో ఉంది. ఆయన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బి.ఎన్.కృపాల్ కుమారుడు. ఢిల్లీ హైకోర్టు కొలీజియం ఆయన పేరును 2017లో కొలీజియానికి సిఫార్సు చేసింది. దానిపై కొలీజియం మూడుసార్లు విభేదించింది. జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే సీజేఐగా ఉండగా కృపాల్ గురించి ప్రభుత్వం నుంచి మరింత సమాచారం కోరారు. అనంతరం 2021లో జస్టిస్ రమణ సీజేఐగా కృపాల్ పేరును ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సిఫార్సు చేశారు. -
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు ఆరుగురు న్యాయాధికారుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. హైకోర్టు జడ్జీలుగా కొలీజియం సిఫారసు చేసిన వారిలో ఈవీ వేణుగోపాల్, నగేష్ భీమపాక, పుల్లా కార్తీక్, కాజా శరత్, జె.శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వరరావు ఉన్నారు. న్యాయాధికారుల పేర్లను కొలీజియం.. కేంద్రానికి పంపింది. కేంద్రం ఆమోదముద్ర వేసిన తరువాత ఆ పేర్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళతాయి. రాష్ట్రపతి ఆమోదం తరువాత వారు న్యాయమూర్తులుగా ప్రమాణం చేస్తారు. చదవండి: భట్టీతో భేటీ.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు -
హైకోర్టుకు ఏడుగురు జడ్జీలు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టులకు ఏడుగురు న్యాయవాదుల పేర్లను సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం చేసింది. ఈ నెల 29న సమావేశమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ ఉమేశ్ ఉదయ్ లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్లతో కూడిన కొలీజియం ఈ మేరకు తీర్మానం చేస్తూ ఏడుగురు న్యాయవాదుల పేర్లను కేంద్రానికి పంపింది. కేంద్ర ప్రభుత్వం ఈ పేర్లకు ఆమోదం తెలిపిన తరువాత అవి రాష్ట్రపతికి చేరుతాయి. రాష్ట్రపతి నియామక ఉత్తర్వులు వెలువడిన అనంతరం ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన వారిలో కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీమలపాటి, వడ్డిబోయన సుజాత పేర్లున్నాయి. 27కి చేరుకోనున్న న్యాయమూర్తుల సంఖ్య హైకోర్టు కొలీజియం గతేడాది ఏడుగురి పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. వీరితోపాటు ఎస్ఎం సుభానీ పేరును కూడా హైకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఎనిమిది మంది పేర్లపై చర్చించిన సుప్రీంకోర్టు కొలీజియం సుభానీ మినహా మిగిలిన ఏడుగురు పేర్లకు ప్రస్తుతం ఆమోదముద్ర వేసింది. సుభానీ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం తెలియరాలేదు. సుప్రీంకోర్టు ఆమోదించిన ఏడుగురిలో శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజశేఖరరావు, సుబ్బారెడ్డి, రవి, సుజాత హైకోర్టు న్యాయవాదులు కాగా రామకృష్ణ ప్రసాద్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా కొనసాగుతున్నారు. కొనకంటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, సుజాత ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి, రవి గతంలో వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిళ్లుగా ఉన్నారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 27కి చేరుకుంటుంది. గన్నమనేని రామకృష్ణ ప్రసాద్.. 1964 మే 28న జన్మించారు. తండ్రి గన్నమనేని గాంధీ చౌదరి. ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరు లయోలా పబ్లిక్ స్కూల్లో సాగింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 12వ తరగతి వరకు చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ఆంధ్ర విద్యాలయ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్‌లో బీకాం చదివారు. 1990లో ఏసీ కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1991–93లో నాగార్జున యూనివర్సిటీ నుంచి మాస్టర్ లా పొందారు.1991లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2000లో సుప్రీంకోర్టుకు ప్రాక్టీస్ మార్చారు. అక్కడ పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. రాజ్యసభ సెక్రటేరియట్, రాజ్యసభ టెలివిజన్‌కు స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్నారు. నాగాలాండ్ ప్రభుత్వం తరఫున పలు కేసులు వాదించారు. నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు.. 1967 జూలై 1న జన్మించారు. తండ్రి రామకృష్ణారావు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీకాం చదివారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంఎల్ పూర్తి చేశారు. 1992 జూన్ 30న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2014 డిసెంబర్ నుంచి 2019 వరకు హైకోర్టులో ఆంధ్ర ప్రాంత మునిసిపాలిటీలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2015–16లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టాండింగ్ కౌన్సిల్‌గా కూడా ఉన్నారు. తర్లాడ రాజశేఖరరావు.. 1967 ఆగస్టు 3న జన్మించారు. శ్రీకాకుళం జిల్లా మూలసవలాపురం స్వగ్రామం.తల్లి కళ్యాణి. తండ్రి సురన్నాయుడు. విశాఖపట్నం ఎన్‌బీఎం కాలేజీలో బీఎస్సీ, బీఎల్ పూర్తి చేశారు. 1993 ఆగస్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వీవీఎస్ రావు న్యాయవాదిగా ఉన్న సమయంలో జూనియర్‌గా వృత్తి మెలకువలు నేర్చుకున్నారు. తరువాత సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. విశ్రాంత న్యాయమూర్తి టీసీహెచ్ సూర్యారావుకు సమీప బంధువు. రవి చీమలపాటి.. 1967 డిసెంబర్ 4న విశాఖపట్నంలో జన్మించారు. తండ్రి శ్రీరామమూర్తి విశాఖలో పేరుపొందిన న్యాయవాది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1995లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తండ్రి వద్దే వృత్తి జీవితాన్ని ఆరంభించారు. సోదరుడు కూడా న్యాయవాదే. ఏడాదిన్నర తరువాత ప్రాక్టీస్‌ను హైకోర్టుకు మార్చారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసులు వాదించారు. మూడేళ్ల పాటు పంచాయతీరాజ్ శాఖ స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్నారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు న్యాయవాదిగా వ్యవహరించారు. వడ్డిబోయన సుజాత.. 1966 సెప్టెంబర్ 10న జన్మించారు. పాఠశాల విద్య మొత్తం ఢిల్లీ కేంద్రీయ విద్యాలయంలో పూర్తి చేశారు. ఎంఏ (పొలిటికల్‌సైన్స్), ఎంఏ (సైకాలజీ), ఎల్ఎల్ఎం చదివారు. 1998లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాదులు ఏవీ శివయ్య, భాస్కర లక్ష్మీల వద్ద జూనియర్‌గా పనిచేశారు. రాజ్యాంగ సంబంధిత కేసుల్లో మంచి పేరు సంపాదించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు ప్యానెల్ అడ్వొకేట్‌గా ఉన్నారు. హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి న్యాయవాదిగా వ్యవహరించారు. ప్రస్తుతం హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్నారు. కొనకంటి శ్రీనివాసరెడ్డి.. 1966 జూన్ 3న హైదరాబాద్‌లో జన్మించారు. తల్లిదండ్రులు రామలక్ష్మీ, లక్ష్మిరెడ్డి. కొనకంటి శ్రీనివాసరెడ్డి తండ్రి లక్ష్మిరెడ్డి గతంలో ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంకు ఏజీఎంగా పని చేశారు. శ్రీనివాసరెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల సాగింది. హైదరాబాద్ నాగార్జున జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1991 ఆగస్టు 11న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది చాగరి పద్మనాభరెడ్డి వద్ద వృత్తి జీవితాన్ని ప్రారంభించి క్రిమినల్ లాలో మెలకువలు నేర్చుకున్నారు. తరువాత సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించి పలు కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. 2019లో రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులై ప్రస్తుతం ఆ పోస్టులో కొనసాగుతున్నారు. మద్రాస్ హైకోర్టు సీజేగా జస్టిస్ భండారీ! కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసు సాక్షి, న్యూఢిల్లీ: మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వర్‌నాధ్ భండారీని ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయవాదులు, ముగ్గురు జ్యుడిషియల్ అధికారులను న్యాయమూర్తులుగా నియమించాలని కూడా సిఫార్సు చేసింది. ఒడిశా హైకోర్టులో నలుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని కొలీజియం సిఫార్సు చేసింది. సత్తి సుబ్బారెడ్డి.. 1970 ఫిబ్రవరి 5న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు లక్ష్మీదేవి, బాలనాగేంద్రరెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా అరవల్లి స్వస్థలం. 1989లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి బీఏ పూర్తి చేశారు. 1993లో అదే విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1994 జూన్ 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తాడేపల్లిగూడెంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 1994–97 వరకు అక్కడే ఉన్నారు. 1997లో హైకోర్టుకు ప్రాక్టీస్ మార్చారు. సీనియర్ న్యాయవాది వీఎల్ఎన్ గోపాలకృష్ణమూర్తి వద్ద జూనియర్‌గా చేరారు. తరువాత సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. సివిల్ కేసుల్లో మంచి పేరు సంపాదించారు. హైకోర్టులో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. -
సంచలన నిర్ణయం..ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ‘గే’ లాయర్ !
న్యూ ఢిల్లీ: భారత అత్యున్నత న్యాయ స్థానం సంచలన నిర్ణ యం తీసుకుంది. సీనియర్ న్యాయవాది, గే అయిన సౌరభ్ కిర్పాల్ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. కొలీజియం సిఫార్సును ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే దేశంలోనే తొలి గే జడ్జిగా సౌరభ్ వార్తలకెక్కనున్నారు. ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీలో ‘లా’లో అండర్ అండర్‌గ్రాడ్యుయేషన్, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేసిన సౌరభ్.. సుప్రీంకోర్టులో రెండు దశాబ్దాలకుపైగా లాయర్‌గా ఉన్నారు. తొలిసారిగా 2017 అక్టోబర్‌లోనే ఆయనకు పదోన్నతి కల్పించాలంటూ ఢిల్లీ హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసినా అది కార్యరూపం దాల్చలేదు. ఆయన పేరును సిఫార్సు చేయడం ఇది నాలుగోసారి అని తెలుస్తోంది. -
ఏపీ కొత్త సీజేగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా?
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నియమితులు కానున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది. కొలీజియం ఇటీవల సమావేశమై పలు హైకోర్టుల సీజేలు, న్యాయమూర్తుల బదిలీపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజే జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఏపీ హైకోర్టుకు బదిలీ కానున్నట్లు భోగట్టా. అలాగే, ఎనిమిది మంది న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ.. ఐదుగురు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు, 28 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని కేంద్రానికి కొలిజియం సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఏపీకి మరో ఇద్దరు న్యాయమూర్తులు రానున్నట్లు సమాచారం. కొలిజియం సిఫార్సులను అధికారికంగా వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంది. జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా గురించి.. జస్టిస్ మిశ్రా ఆగస్టు 29, 1964న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయగఢ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకుని రాయ్‌గఢ్‌లోని జిల్లా కోర్టు, జబల్పూర్లోని మధ్యప్రదేశ్ హైకోర్టు, బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో పేరుగాంచారు. ఛత్తీస్‌గఢ్ బార్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. 2004 జూన్ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఆ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. అనంతరం సెపె్టంబరు 1, 2007 నుంచి న్యాయమూర్తి అయ్యే వరకూ అడ్వొకేట్ జనరల్‌గా కొనసాగారు. డిసెంబరు 10, 2009న ఛత్తీస్‌గఢ్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
Telangana: హైకోర్టుకు కొత్త జడ్జీలు
సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు రానున్నారు. సీనియర్ జిల్లా జడ్జి స్థాయి నుంచి హైకోర్టు జడ్జిగా ఏడుగురికి పదోన్నతులు కల్పించాలం టూ.. సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ జాబితాలో సీనియర్ జిల్లా జడ్జీలు పి.శ్రీసుధ, డాక్టర్ సి.సుమలత, డాక్టర్ జి.రాధారాణి, ఎం.లక్ష్మణ్, ఎన్.తుకారాంజీ, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, ఆదాయపన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ అథారిటీ (ఐటీఏటీ) సభ్యురాలిగా ఉన్న టి.మాధవీదేవి ఉన్నారు. ఏడుగురు కొత్త న్యాయమూర్తుల్లో నలుగురు మహిళా జడ్జీలే ఉండటం విశేషం. సుప్రీం కొలీజియం పంపిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించగానే.. కొత్త జడ్జీల నియామక ప్రక్రియ పూర్తికానుంది. పోస్టుల సంఖ్య పెంచాక.. తెలంగాణ హైకోర్టులో జడ్జి పోస్టుల సంఖ్య 24గా ఉండేది. ఇటీవలే పోస్టుల సంఖ్యను 42కి పెంచారు. ప్రస్తుతం కేవలం 12 మంది న్యాయమూర్తులే ఉండగా.. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా ఏడుగురు రానున్నారు. వాస్తవానికి జిల్లా జడ్జీల నుంచి సీనియారిటీ ఆధారంగా హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. కానీ చాలా ఏళ్లుగా పదోన్నతులు ఇవ్వలేదు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడ్డాక ప్రతిపాదన వచ్చినా అమల్లోకి రాలేదు. తాజాగా జడ్జి పోస్టుల సంఖ్యను పెంచిన నేపథ్యంలో పదోన్నతులతో కొత్త నియామకాలు చేపట్టారు. ప్రస్తుతం హైకోర్టులో 2.32 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త జడ్జీలు వస్తే విచారణల వేగం పెరగనుంది. కొత్త న్యాయమూర్తులు వీరే.. 1. పి.శ్రీసుధ 1967 జూన్ 6న జన్మించారు. తొలుత నిజామాబాద్ అదనపు జిల్లా జడ్జిగా, 2002లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా, విశాఖపట్నం, వరంగల్, నిజామాబాద్ జిల్లాలు, సిటీ సివిల్ కోర్టుల చీఫ్ జడ్జిగా, ఉమ్మడి ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం కోఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉన్నారు. 2. డాక్టర్ సి.సుమలత 1972 ఫిబ్రవరి 5న నెల్లూరు జిల్లాలో జన్మించారు. 2006లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. మదనపల్లి, కర్నూలు, గుంటూరు జల్లాల్లో న్యాయమూర్తిగా, ఉమ్మడి జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా ఉన్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడం ఎలా అన్న అంశం ఆమె డాక్టరేట్ చేశారు. 3. డాక్టర్ జి.రాధారాణి 1963 జూన్ 29న జన్మించారు. ఏలూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. 2008లో జిల్లాజడ్జిగా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని పలు కోర్టుల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా చీఫ్ జడ్జిగా ఉన్నారు. 4. వికారాబాద్ జిల్లాకు చెందిన ఎం.లక్ష్మణ్ 1965 డిసెంబర్ 24న జన్మించారు. హైదరాబాద్‌లోని పలు కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని పలు కోర్టుల్లో, ఖమ్మం జిల్లా చీఫ్ జడ్జిగా పనిచేశారు. ప్రస్తుతం లేబర్ కోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. 5. ఎన్.తుకారాంజీ 1973 ఫిబ్రవరి 24న జన్మించారు. విద్యాభాస్యం మొత్తం హైదరాబాద్‌లో సాగింది. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, రాజమండ్రి జిల్లాల చీఫ్ జడ్జిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ క్రిమినల్ కోర్టుల మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా ఉన్నారు. 6. ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి 1961 ఏప్రిల్ 1న జన్మించారు. 1994లో జడ్జిగా ఎంపికయ్యారు. రంగారెడ్డి జిల్లాతోపాటు పలు జిల్లాల్లో న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా పనిచేస్తున్నారు. 7. పి.మాధవిదేవి ఆదాయ పన్నుశాఖ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) జ్యుడిషియల్ సభ్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. -
తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తులు
న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు నియామకం కానున్నారు. నిన్న(బుధవారం) జరిగిన కొలీజియం సమావేశంలో న్యాయాధికారుల కోటాలో తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సు చేసిన వారిలో శ్రీ సుధ, సుమలత, రాధా రాణి, లక్ష్మణ్, ఎన్. తుకారాం, వెంకటేశ్వర రెడ్డి , మాధవి దేవి ఉన్నారు. వీరిని హైకోర్టు జడ్జిలుగా పదోన్నతిపై నియమించాలన్న ప్రతిపాదనలకు సుప్రీం కొలీజియం ఆమోదం తెలిపింది. చదవండి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ముగ్గురు మహిళలు -
ఖాళీగా ఉన్న జడ్జి పోస్టుల భర్తీ ఎప్పుడు?
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం విషయంలో కొలీజియం చేసిన సిఫార్సులపై నిర్ణయం తీసుకొనేందుకు తగిన కాల వ్యవధిని(టైమ్ ఫ్రేమ్) సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గురువారం సూచించింది. మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్(ఎంఓపీ)లోని కాల వ్యవధికి కట్టుబడి ఉంటామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించిందని గుర్తుచేసింది. కొలీజియం 10 పేర్లను ప్రతిపాదించిందని, వీటిపై ప్రభుత్వం ఏడాదిన్నరగా నిర్ణయం తీసుకోలేదని ఆక్షేపించింది. ఈ 10 పేర్లపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. హైకోర్టుల్లో జడ్జీల నియామకంపై నిర్ణయం తీసుకోవడానికి ఎంఓపీలో ప్రధానమంత్రికి గడువు ఏదీ నిర్దేశించలేదని గుర్తుచేశారు. పీఎంఓ నుంచి ఆదేశాలు రాగానే కొలీజియం ప్రతిపాదించిన పేర్లను రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తామన్నారు. సుప్రీంకోర్టుకు 34 జడ్జీ పోస్టులను మంజూరు చేయగా, ప్రస్తుతం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. హైకోర్టులకు 1,080 జడ్జీ పోస్టులను మంజూరు చేయగా, 416 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తుచేశారు. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని చెప్పారు. హైకోర్టుల్లో జడ్జీల పోస్టులను భర్తీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. -
సుప్రీంలోకి నలుగురు జడ్జీలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కొత్తగా నలుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లను కొత్త జడ్జీలుగా నియమించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 10న సిఫారసులు పంపడం తెలిసిందే. ఆ సిఫారసులను బుధవారం కేంద్రం ఆమోదించింది. అనంతరం రాష్ట్రపతి నియామక పత్రాలపై సంతకం చేశారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ ధీరూభాయ్ పటేల్, మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అజయ్ కుమార్ మిత్తల్ నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టుకు మరో నలుగురు జడ్జీలను కేంద్రం నియమించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లను న్యాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. జస్టిస్ బోపన్న, జస్టిస్ బోస్‌ల పేర్లను కొలీజియం ఏప్రిల్‌లోనే సిఫారసు చేసినప్పటికీ, సీనియారిటీ, ప్రాంతాల వారీ ప్రాతినిధ్యం తదితర కారణాలు చూపుతూ కేంద్రం ఆ సిఫారసులను వెనక్కు పంపింది. అయితే వారిద్దరూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి అన్ని రకాలా అర్హులేననీ, వారికి సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతులు కల్పించాల్సిందేనంటూ కొలీజియం మరోసారి కేంద్రానికి సిఫారసులు పంపింది. వీరిద్దరితోపాటు కొత్తగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ గవాయ్‌ల పేర్లను కూడా చేర్చి, మొత్తం నలుగురి పేర్లను సిఫారసు చేయగా కేంద్రం ఆమోదించింది. కొత్తగా నియమితులు కానున్న కర్ణాటక హైకోర్టుకు చెందిన జస్టిస్ బోపన్న ప్రస్తుతం గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. కలకత్తా హైకోర్టుకు చెందిన జస్టిస్ బోస్ ప్రస్తుతం జార్ఖండ్ హైకోర్టు ప్రధాన జడ్జీగా విధులు నిర్వర్తిస్తున్నారు. జస్టిస్ సూర్యకాంత్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ గవాయ్ బాంబే హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. గొగోయ్ పర్యవేక్షణలోనే 10 మంది గతేడాది అక్టోబర్‌లో సీజేఐగా గొగోయ్ నియమితులు కాగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన 10 మందిని సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియమించి, తనకు ముందు పనిచేసిన సీజేఐల్లో చాలా మందికి లేని ఘనతను జస్టిస్ గొగోయ్ సొంతం చేసుకున్నారు. అలాగే సుప్రీంకోర్టులో పూర్తిస్థాయిలో 31 మంది న్యాయమూర్తులు ఉండటం కూడా గత కొన్ని దశాబ్దాల్లో ఇదే తొలిసారి. జస్టిస్ గవాయ్‌కి 2025లో సీజేఐ పదవి జస్టిస్ గవాయ్ 2025 మే నెలలో సీజేఐగా పదోన్నతి పొందనున్నారు. జస్టిస్ కేజీ బాలక్రిష్ణన్ తర్వాత రెండో దళిత సీజేఐగా జస్టిస్ గవాయ్ నిలవనున్నారు. తొలి దళిత సీజేఐ అయిన కేజీ బాలక్రిష్ణన్ 2010 మే నెలలో పదవీ విరమణ పొందారు. దశాబ్దాల తర్వాత 31కి ప్రధాన న్యాయమూర్తితో కలిపి సుప్రీం కోర్టుకు మంజూరు చేసిన జడ్జి పోస్టుల సంఖ్య 31 కాగా, ప్రస్తుతం 27 మంది జడ్జీలు సుప్రీంకోర్టులో ఉన్నారు. కొత్తగా నలుగురు నియమితులు కానుండటంతో మొత్తం జడ్జీల సంఖ్య గరిష్ట పరిమితి అయిన 31కి చేరనుంది. కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ సుప్రీంకోర్టులో ఒకేసారి 31 మంది జడ్జీలు లేరు. -
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విక్రమ్ నాధ్
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాధ్ నియమితులయ్యారు. న్యాయమూర్తిగా పదోన్నతి పొందినప్పటి నుంచి సీనియర్ న్యాయమూర్తిగా విక్రమ్ నాధ్ అలహాబాద్ హైకోర్టులో సేవలందించారు. 160 మంది జడ్జీలు మంజూరైన అలహాబాద్ హైకోర్టు దేశంలోనే అతిపెద్ద హైకోర్టుగా గుర్తింపు పొందింది. ఇక అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నఅనంతరం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విక్రమ్ నాధ్ పేరును కొలీజియం ఖరారు చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విక్రమ్ నాధ్ మెరుగైన సేవలందిస్తారని కొలీజియం ఆయన నియామకం వైపు మొగ్గుచూపిందని సుప్రీం కొలీజియం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఏపీ హైకోర్టు ఏర్పడిన అనంతరం ఇప్పటివరకూ ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీగానే ఉండటం గమనార్హం. -
సుప్రీంకోర్టు జడ్జీలుగా ఇద్దరికి పదోన్నతి!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరి, ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నాను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలని సిఫార్సు చేసింది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జనవరి 10న సమావేశమైన కొలీజియం వీరిద్దరికి పదోన్నతి కల్పించాలని నిర్ణయం తీసుకుంది. గతేడాది డిసెంబర్ 12న అప్పటి కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని తాజా సమావేశంలో న్యాయమూర్తులు సమర్థించారు. ‘సుప్రీంకోర్టు జడ్జీలుగా సిఫార్సు చేసిన వ్యక్తులు అన్నివిధాలుగా అర్హులైనవారు, సమర్థులు’ అని కొలీజియం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు కొలీజియంలో సీజేఐ జస్టిస్ గొగోయ్‌తో పాటు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. -
సుప్రీంకోర్టుకు నలుగురు కొత్త జడ్జీలు
న్యూఢిల్లీ: నాలుగు వేర్వేరు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు కోర్టు కొలీజియం పంపిన సిఫార్సులకు 48 గంటల్లోనే కేంద్రం ఓకే చెప్పింది. జస్టిస్ హేమంత్ గుప్తా(మధ్యప్రదేశ్ హైకోర్టు), జస్టిస్ అజయ్ రస్తోగి(త్రిపుర హైకోర్టు), జస్టిస్ ఎంఆర్ షా(పట్నా హైకోర్టు), జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి(గుజరాత్ హైకోర్టు)లను సుప్రీం జడ్జీలుగా నియమిస్తూ న్యాయ శాఖ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన జస్టిస్ సుభాష్‌రెడ్డి 2002లో ఏపీ హైకోర్టులో అదనపు జడ్జిగా, 2016లో గుజరాత్ సీజేగా పదోన్నతి పొందారు. కొత్త జడ్జీలు బాధ్యతలు చేపట్టాక కోర్టులో జడ్జీల సంఖ్య 28కి పెరగనుంది. ప్రజల సందర్శనకు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టును సామాన్యప్రజలు కూడా సందర్శించేందుకు వీలు కల్పించాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. ఇకపై సుప్రీంకోర్టు గదులు, జడ్జీల గ్రంథాలయాన్ని సెలవు దినాలు మినహాయించి ప్రతి శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని వర్గాల వారూ సందర్శించేందుకు వీలుంది. సందర్శకులు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని, థింక్‌ట్యాంక్ ‘సెంటర్ ఫర్ రీసెర్చి అండ్ ప్లానింగ్’ను సీజేఐ ప్రారంభించారు. ‘ఈ కేంద్రం ఏర్పాటు కేవలం నాకు తట్టిన ఆలోచన మాత్రమే. మిమ్మల్ని సంప్రదించకుండా దీనిని ఏర్పాటు చేసినందుకు క్షమించాలని కోరుతున్నా’ ఆవిష్కరణ కార్యక్రమంలో సీజేఐ వ్యాఖ్యానించారు. -
జస్టిస్ జోసెఫ్ పదోన్నతికి గ్రీన్‌సిగ్నల్!
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలన్న కొలీజియం సిఫార్సుకు కేంద్రం ఎట్టకేలకు ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. జస్టిస్ జోసెఫ్‌తో పాటు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వినీత్ శరణ్‌ల పదోన్నతికి ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిసింది. ఈ నియామకాలకు సంబంధించిన దస్త్రాలకు ఆమోదం లభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 25కు పెరగనుంది. అయినా మరో 6 పోస్టులు ఖాళీగా ఉంటాయి. జస్టిస్ జోసెఫ్‌కు సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించాలని సుప్రీం సీజేఐ నేతృత్వంలోని కొలీజియం జనవరి 10న కేంద్రానికి సిఫార్సుచేసింది. కేరళ నుంచి సుప్రీంలో ఇది వరకే తగిన ప్రాతినిధ్య ఉందని పేర్కొంటూ ఈ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కేంద్రం వెనక్కి పంపింది. ఆయన పేరును సుప్రీం జడ్జి పదవికి పరిశీలించాలని మే 10న కొలీజియం మరోసారి కేంద్రానికి సూచించగా, తాజాగా ఆమోదం లభించింది. మరోవైపు, జస్టిస్ జోసెఫ్‌కు ఉత్తరాఖండ్ హైకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించింది. -
సుప్రీంకు మళ్లీ జస్టిస్ జోసెఫ్ పేరు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును సుప్రీంకోర్టు జడ్జి పదవికి కొలీజియం మరోసారి సిఫార్సు చేసింది. ఆయన పదోన్నతిపై గతంలో కేంద్రం వెలిబుచ్చిన అభ్యంతరాలను పక్కనపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రాసిన లేఖల్లో జస్టిస్ జోసెఫ్ అర్హతను తక్కువచేసి చూపే విషయాలేవీ లేవని పేర్కొంది. జస్టిస్ జోసెఫ్‌తో పాటు మద్రాస్ హైకోర్టు సీజే జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒడిశా హైకోర్టు సీజే జస్టిస్ వినీత్ శరణ్‌ల పేర్లను సుప్రీంజడ్జీలుగా ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. సుప్రీంకోర్టు జడ్జి పదవికి జస్టిస్ జోసెఫ్ పేరుకు కొలీజియం తొలుత జనవరి 10నే పచ్చజెండా ఊపగా, ఏప్రిల్ 28న కేంద్రం తిరస్కరించింది. జస్టిస్ జోసెఫ్ సొంత రాష్ట్రం కేరళకు ఇది వరకే సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం ఉన్నందున, ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కొలీజియంకు తిరిగి లేఖ రాసింది. మరోవైపు, కలకత్తా హైకోర్టు జడ్జి అనిరుద్ధ బోస్‌ను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలన్న సుప్రీం కొలీజియం సిఫార్సును కేంద్రం తోసిపుచ్చింది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరింది. 2004లో జడ్జిగా పదోన్నతి పొందిన జస్టిస్ బోస్‌కు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం లేదని పేర్కొంది. ఆయనకు బదులు మరో సీనియర్ జడ్జి పేరును ప్రతిపాదించాలని సూచించింది. నిర్మాణ కార్మికుల పథకంపై డెడ్‌లైన్ భవన, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం చేపట్టే పథకానికి సెప్టెంబర్ 30వ తేదీలోగా తుదిరూపు ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రానికి గడువు విధించింది. శుక్రవారం విచారణ సందర్భంగా బెంచ్ ఎదుట కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి హాజరయ్యారు. రోడ్డు ప్రమాదాలపై సుప్రీం ఆందోళన గుంతలమయమైన రోడ్ల వల్ల జరుగుతున్న ప్రమాదాలతో దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న మరణాలు భయం పుట్టిస్తున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో రోడ్డు భద్రత అంశంపై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ‘ఉగ్రవాద దాడుల్లో మరణిస్తున్నవారి కంటే కూడా రోడ్లపై గుంతల వల్ల ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న వారే ఎక్కువ’అని ధర్మాసనం మీడియా నివేదికలను ఊటంకించింది. -
హైకోర్టు జడ్జీలుగా నియమించలేం
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న ఇద్దరికి అదే హైకోర్టులో న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం రెండోసారి కూడా వెనక్కు పంపింది. కొలీజియం సిఫారసు చేసిన న్యాయవాదులపై ఫిర్యాదులు ఉన్నందున వారిని జడ్జీలుగా నియమించలేమని కేంద్రం పేర్కొంది. ఆ ఇద్దరు న్యాయవాదుల్లో ఒకరైన మహ్మద్ మన్సూర్.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దివంగత సాఘిర్ అహ్మద్ కుమారుడు కావడం గమనార్హం. న్యాయవాదులు మహ్మద్ మన్సూర్‌తోపాటు బష్రత్ అలీని అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తులుగా నియమించాలంటూ చాలా రోజుల క్రితమే సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఆ ఇద్దరిపై ఫిర్యాదులున్నాయన్న కారణం చూపుతూ అప్పట్లో కేంద్రం ఈ ప్రతిపాదనను తిప్పిపంపింది. ఆ ఫిర్యాదులు తీవ్రమైనవేమీ కాదంటూ కొలీజియం మరోసారి అవే పేర్లను సిఫారసు చేయగా, ఏ నిర్ణయమూ తీసుకోకుండా రెండున్నరేళ్లు కాలయాపన చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు వారిరువురీ పేర్లను తిరస్కరిస్తున్నట్లు గత నెలలో కొలీజియంకు తెలిపింది. కొలీజియం సభ్యుల్లో ఒకరైన జస్టిస్ చలమేశ్వర్ ఇటీవలే పదవీ విరమణ పొందినందున కొత్త కొలీజియం ఏర్పాటైన అనంతరం ఈ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. -
జస్టిస్ గొగోయ్‌కి అన్ని అర్హతలున్నాయి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యేందుకు జస్టిస్ రంజన్ గొగోయ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని శుక్రవారం పదవీవిరమణ చేసిన జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. పదవీవిరమణ అనంతరం ఆయన పలు మీడియా సంస్థలతో మాట్లాడారు. ధర్మాసనాల కేటాయింపు సహా పలు అంశాలపై సీజేఐ తీరును తప్పుబడుతూ జనవరి 12న తనతో పాటు మరో ముగ్గురు జడ్జిలు కలిసి పెట్టిన ప్రెస్‌మీట్‌పై స్పందిస్తూ.. తాను తప్పు చేశానని భావించడం లేదని స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని పలువురు మాజీ సీజేఐలు కూడా ప్రశంసించారని గుర్తు చేశారు. న్యాయవ్యవస్థలో లోపాలున్నాయని, వాటిని సరిదిద్దేందుకు సరైన దిశలో ఆలోచించే వారంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కేసుల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో సమస్య ఉందని పునరుద్ఘాటించారు. న్యాయవ్యవస్థలోని అన్ని విభాగాల్లో మరింత పారదర్శకత రావాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవ్యవస్థలో నెలకొన్న అవినీతిపై మరింత తీవ్ర స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్ పెట్టిన రోజు తన ఇంటికి సీపీఐ నేత రాజా రావడంపై స్పందిస్తూ.. రాజా తనకు చాన్నాళ్ల నుంచి మిత్రుడని, తామిద్దరమూ మద్రాస్ యూనివర్సిటీ విద్యార్థులమేనని తెలిపారు. ఆ రోజు(ప్రెస్ మీట్ పెట్టిన రోజు) తన ఇంటి ముందు భారీగా మీడియా ఉండటంతో.. ఏం జరిగిందనే ఆందోళనతో ఆయన వచ్చారని వివరించారు. ‘అయితే, అప్పటికి మరికొన్ని వారాల్లో నేను రిటైర్ అవబోతున్నా. అప్పుడు నా ఇంటికి ఎవరొచ్చారనే విషయం కన్నా.. అధికారంలో ఉన్నవారితో ఎవరు(న్యాయమూర్తులు) సమావేశమవుతున్నారనేది మరింత కీలకమైన అంశం’ అని చలమేశ్వర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘న్యాయవ్యవస్థలో, న్యాయపరమైన అంశాల్లో సీనియర్ మోస్ట్ జడ్జి, అత్యంత జూనియర్ జడ్జి సమానమే. అయితే, ప్రధాన న్యాయమూర్తిగా సీజేఐకి కొన్ని అదనపు పరిపాలనాపరమైన అధికారాలుంటాయి’ అని వివరించారు. సీజేఐకి వ్యతిరేకంగా విచారణకు వచ్చిన ఒక కేసుకు సంబంధించి తాను ఏర్పాటు చేసిన ఐదుగురు సీనియర్ జడ్జిల ధర్మాసనాన్ని మారుస్తూ తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. జస్టిస్ జోసెఫ్ సమర్ధుడు ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించే విషయంలో కేంద్రం తీరును ఆయన తప్పుబట్టారు. సమర్ధుడైన న్యాయమూర్తి అయిన జస్టిస్ జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించేందుకు, ఆయన పేరును కొలీజియం మరోసారి సిఫారసు చేయాలన్నారు. జస్టిస్ జోసెఫ్ తన ప్రాంతంవాడో, తన భాషవాడో, తన మతం వాడో కాదని, అయినా ఆయన పదోన్నతి కోసం పోరాడానని వివరించారు. కొలీజియంలోకి జస్టిస్ ఏకే సిక్రీ! సీనియర్ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ రిటైర్మెంట్తో సుప్రీంకోర్టు కొలీజియంలో మార్పులు జరగనున్నాయి. చలమేశ్వర్ స్థానంలో జస్టిస్ ఏకే సిక్రీ ఐదుగురు సభ్యుల బృందంలో చోటు దక్కించుకోనున్నారు. -
న్యాయ వ్యవస్థపై కూడా మోదీ ముద్ర
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని న్యాయ వ్యవస్థ స్వతంత్రపై ఆందోళన మొదలైంది. సుప్రీం కోర్టు కొలీజియం చేసిన రెండు సిఫార్సుల్లో ఒక సిఫార్సును ఆమోదించిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో సిఫార్సును తిరస్కరించడమే అందుకు కారణం. సుప్రీం కోర్టు జడ్జీలుగా సీనియర్ అడ్వకేట్ ఇందు మల్హోత్ర, ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసఫ్‌ల పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం గురువారం ప్రతిపాదించగా వారిలో ఇందు మల్హోత్ర నామినేషన్‌ను అంగీకరించిన మోదీ ప్రభుత్వం జోసఫ్ నామినేషన్‌ను అంగీకరించని విషయం తెల్సిందే. ఈ కొలీజియం వ్యవస్థకు రాజ్యాంగ భద్రతగానీ, పార్లమెంట్ చట్టం భద్రతగానీ లేదు. కేవలం సుప్రీం కోర్టు అభిప్రాయం మేరకు కేంద్రం ఈ కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తితోపాటు మరో నలుగురు సీనియర్ సుప్రీం కోర్టు జడ్జీలు ఉంటారు. హైకోర్టు కొలీజియంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు నలుగురు సీనియర్ హైకోర్టు జడ్జీలు ఉంటారు. ఈ కొలీజియంలు మెజారిటీ అభిప్రాయంతో దిగువ కోర్టుల నుంచి తమ కోర్టులకు పదోన్నతులతో పాటు జడ్జీల బదిలీ వ్యవహారాలను నిర్వర్తిస్తాయి. ఇందులో జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అవకాశం లేదు. అయితే సదరు వ్యక్తుల ప్రవర్తన, గత జీవితాలను తెలుసుకునేందుకు ఇంటెలిజెన్సీ బ్యూరో ద్వారా సమాచారాన్ని సేకరించుకోవచ్చు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల నుంచి ఈ కొలీజియం వ్యవస్థ ఒత్తిడికి గురవుతూనే ఉంది. న్యాయవ్యవస్థ నియామకాలను తన పరిధిలోకి తీసుకోవడానికి వీలుగా 2014లోనే మోదీ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ చట్టాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. అప్పటి నుంచి మోదీ ప్రభుత్వం దొడ్డిదారిన, అంటే మౌఖికంగా న్యాయ వ్యవస్థ నియామకాలను ప్రభావితం చేస్తోంది. కర్ణాటక హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జయంతి పటేల్‌ను 2017లో అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. దాంతో కర్ణాటకకు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాన్ని ఆయన కోల్పోయారు. కక్షతోనే తనను బలి చేశారని నాడు ఆయన ఆరోపించారు. 2004లో ముంబైకి చెందిన ఇశ్రాత్ జహాన్‌ను గుజరాత్ పోలీసులు హత్య చేశారనే ఆరోపణలపై సీబిఐ దర్యాప్తునకు జయంతి పటేల్ ఆదేశించారు. నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. హైకోర్టు కొలీజియం సిఫార్సులను పట్టించుకోకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2016లో గుజరాత్ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఓ జడ్జీ బదిలీని అడ్డుకుంది. 2017లో కూడా ఢిల్లీ హైకోర్టు నుంచి వాల్మీకీ మెహతా బదిలీని కూడా మోదీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు కేఎం జోసఫ్ నియమకాన్ని మోదీ ప్రభుత్వం అడ్డుకోవడానికి కూడా కారణం ఉంది. 2016లో ఉత్తరాఖండ్‌లో మోదీ ప్రభుత్వం విధించిన రాష్ట్రపతి పాలనను జోసఫ్ రద్దు చేశారు. జోసఫ్ తరహాలోనే 2014లో కొలీజియం సిఫార్సు చేసిన గోపాల్ సుబ్రమణియం నామినేషన్‌ను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించి మరో ముగ్గురు నామినేషన్లను అంగీకరించినప్పుడు అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా ఏకపక్షంగా గోపాల్ సుబ్రమణియం నామినేషన్‌ను ఎలా తిరస్కరిస్తారంటూ కేంద్రాన్ని విమర్శించారు. ఇప్పుడు జోసఫ్ విషయంలో అది జరగలేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్ర గురించి మాట్లాడే ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ప్రభుత్వ నిర్ణయనికి తలొగ్గి జోసఫ్ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. సుప్రీం కోర్టు బెంచీలను నిర్ణయించడంలో కేసులను కేటాయించడంలో తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారంటూ నలుగురు సుప్రీం కోర్టు సీనియర్ జడ్జీలు ప్రజల్లోకి వచ్చి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంతో సుప్రీం కోర్టు స్వతంత్రత గురించి చర్చ మొదలైంది. కేసుల కేటాయింపుల్లో దీపక్ మిశ్రాపై ప్రభుత్వ ప్రభావం ఉండొచ్చన్న ఆరోపణలను ఖండించిన ఆయన న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే తాను ప్రాధాన్యం ఇస్తానన్నారు. అలాంటప్పుడు ఆయన ప్రభుత్వ నిర్ణయంతో విభేదించాల్సి ఉంది. న్యాయ వ్యవస్థకు సంబంధించిన నియామకాలను న్యాయవ్యవస్థనే జరుపుకునే విధానం భారత్‌లో తప్పా ప్రపంచంలో మరెక్కడా లేదు. అది వేరే విషయం.