
న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు నియామకం కానున్నారు. నిన్న(బుధవారం) జరిగిన కొలీజియం సమావేశంలో న్యాయాధికారుల కోటాలో తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సు చేసిన వారిలో శ్రీ సుధ, సుమలత, రాధా రాణి, లక్ష్మణ్, ఎన్. తుకారాం, వెంకటేశ్వర రెడ్డి , మాధవి దేవి ఉన్నారు. వీరిని హైకోర్టు జడ్జిలుగా పదోన్నతిపై నియమించాలన్న ప్రతిపాదనలకు సుప్రీం కొలీజియం ఆమోదం తెలిపింది.
చదవండి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ముగ్గురు మహిళలు
Comments
Please login to add a commentAdd a comment