న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామకం, బదిలీల విషయంలో కొలీజియం ఆకాంక్షలను(సిఫార్సులను) చాలావరకు నెరవేర్చాలని(ఆమోదించాలని) కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. కొలీజియం సిఫార్సులను ఆమోదించకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై జస్టిస్ ఎస్‌కే కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
జడ్జీల నియామకానికి సంబంధించి కొన్ని అంశాల పట్ల తాము ఆందోళన చెందుతున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణకు అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి హాజరు కాలేదు. కొలీజియం సిఫార్సులను చాలావరకు ఆమోదించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని అటార్నీ జనరల్‌కు తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment