![SC Collegium recommends to Manmohan Singh as Supreme Court Judge](/styles/webp/s3/article_images/2024/11/29/JUSTICE-MANMOHAN.jpg.webp?itok=BeZx02ZD)
సిఫారసు చేసిన కొలీజియం
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్‌మోహన్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఇటీవల సమావేశమై జస్టిస్ మన్‌మోహన్ పేరును సిఫారసు చేసిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఏ.ఎస్.ఓకా సుప్రీంకోర్టు కొలీజియంలోని ఇతర సభ్యులు. సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 34 కాగా.. ప్రస్తుతం 32 మందే ఉన్నారు. మాజీ సీజేఐ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీల పదవీ విరమణతో ఈ రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. జస్టిస్ మన్‌మోహన్ డిసెంబరు 17, 2009లో ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరు 29న ఢిల్లీ సీజేగా పదోన్నతి పొందారు.
Comments
Please login to add a commentAdd a comment