సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాధ్ నియమితులయ్యారు. న్యాయమూర్తిగా పదోన్నతి పొందినప్పటి నుంచి సీనియర్ న్యాయమూర్తిగా విక్రమ్ నాధ్ అలహాబాద్ హైకోర్టులో సేవలందించారు. 160 మంది జడ్జీలు మంజూరైన అలహాబాద్ హైకోర్టు దేశంలోనే అతిపెద్ద హైకోర్టుగా గుర్తింపు పొందింది.
ఇక అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నఅనంతరం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విక్రమ్ నాధ్ పేరును కొలీజియం ఖరారు చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విక్రమ్ నాధ్ మెరుగైన సేవలందిస్తారని కొలీజియం ఆయన నియామకం వైపు మొగ్గుచూపిందని సుప్రీం కొలీజియం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఏపీ హైకోర్టు ఏర్పడిన అనంతరం ఇప్పటివరకూ ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీగానే ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment