
న్యూఢిల్లీ: గత సంవత్సర కాలంలో వేర్వేరు హైకోర్టుల్లో జడ్జీలుగా నియమాకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం 80 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిందని న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు గురువారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ పేర్లలో 45 మందిని జడ్జీలుగా నియమించడం పూర్తయిందని మంత్రి పేర్కొన్నారు. మిగతా వారి నియామకానికి సంబంధించిన ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియంల వద్ద వేర్వేరు దశల్లో కొనసాగుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో 1,098 మంది జడ్జీల నియామకానికి అనుమతి ఉండగా ప్రస్తుతం 645 మంది జడ్జీలు విధుల్లో ఉన్నారు. 453 జడ్జీ పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి.
► 2020 ఏడాదిలో సివిల్స్ పరీక్షను రాయలేకపోయిన వారికి మరో అవకాశం ఇచ్చే ప్రతిపాదన ఏదీ తమ వద్ద పరిశీలనలో లేదని సిబ్బంది శిక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment