
న్యూ ఢిల్లీ: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు నేడు(సోమవారం) ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ శాసనసభ్యుడు భర్తృహరి మహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీతో సహా కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతోంది. జూన్ 26న స్పీకర్ ఎన్నికల జరగనుంది.
కాగాసమావేశాల్లో తొలి రోజే నీట్-యూజీ, యూజీసీ-నెట్‌లో అవకతవకలు, ప్రొటెం నియామకంపై వివాదం, స్పీకర్ ఎన్నికల వంటి అంశాలపై ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడనున్నట్లు తెలుస్తోంది.అయితే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీల మధ్య మాటల యుద్ధం నెలకొంది.
పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిరణ్ రిజుజు సోమవారం ఉదయం18వ లోక్‌సభ సభ్యులకు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కొత్తగా ఎంపికైన ఎంపీలకు స్వాగతం. నేడు(జూన్ 24) లోక్‌సభ మొదటి సమావేశం జరగనుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా సభ్యులకు సాయం చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. సభను సమర్ధవంతంగా నడిపేందుకు సభ్యుల నుంచి సమన్వయం కోసం ఎదురుచూస్తున్నారు
ఈ పోస్ట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాటల కంటే చర్యలు ముఖ్యమని, చెప్పిన మాటలను ఆచరణలో పెట్టాలని కౌంటర్ ఇచ్చారు.
జైరాం రమేష్ ట్వీట్‌పై కేంద్రమంత్రి రిజిజు బదులిచ్చారు. మీరు సానుకూలంగా సహకరించడమే సభకు గొప్ప ఆస్తి అని పేర్కొన్నారు. "ఖచ్చితంగా. జైరాం రమేష్ జీ. మీరు తెలివైన సభ్యులు. మీరు సానుకూలంగా సహకరిస్తే సభకు విలువైన ఆస్తి అవుతారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్య విభేదాలు అలాగే ఉంటాయి. కానీ మనమంతా దేశానికి మాసేవ చేసేందుకు ఐక్యంగా ఉన్నాం. భారతదేశపు గొప్ప పార్లమెంటరీ సంప్రదాయాలను కొనసాగించడంలో మీ సహకారం ఓసం ఎదురుచూస్తున్నాం." అని తెలిపారు.
అయితే ఈ సంభాషణ ఇక్కడితో ఆగలేదు. కేంద్రమంత్రి ట్వీట్‌కు మరోసారి జైరాం రమేష్ కౌంటర్ ఇచ్చారు. నీట్ పరీక్షను నిర్వహించడంలో విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంశాన్ని ప్రస్తావిస్తూ... "ధన్యవాదాలు మంత్రి. నా తెలివితేటలకు మీ సర్టిఫికేట్.. ఎన్టీయే గ్రేడింగ్ కాదని నేను భావిస్తున్నాను. దీనికేమైనా గ్రేస్ మార్కుల ఉన్నాయా?" అంటూ పంచ్‌లు విసిరారు.