న్యూఢిల్లీ: విజయ్ దివస్ సందర్భంగా బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధ వీరులను స్మరించుకుంది. వారి గౌరవార్థం 180 కిలోమీటర్ల బ్యాటన్ రిలే ర్యాలీ నిర్వహించింది. 930 బీఎస్‌ఎఫ్ సైనికులతో డిసెంబర్ 13 అర్థరాత్రి నుంచి 14 వ తేదీ ఉదయం వరకు రాజస్తాన్‌లోని అనూప్‌ఘర్‌లో ఈ ర్యాలీ కొనసాగింది. బీఎస్‌ఎఫ్ ప్రయత్నాన్ని కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు కొనియాడారు. బ్యాటర్ రిలే ర్యాలీలో పాల్గొన్న సైనికులపై ప్రశంసలు కురిపించారు. 930 మంది బీఎస్‌ఎఫ్ జవాన్లు రాజస్తాన్‌లోని అంతర్జాతీయ సరిహద్దు గుండా 1971 యుద్ధ వీరుల గౌరవార్థం బ్యాటన్ రిలే ర్యాలీ నిర్వహించారని ట్విటర్‌లో పేర్కొన్నారు.
ర్యాలీకి సంబంధించిన వీడియో షేర్ చేశారు. కాగా, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించేందుకు భారత్ 1971లో యుద్ధ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఆర్మీపై భారత ఆర్మీ పట్టు సాధించింది. దాంతో అప్పటి పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఆమిర్ అబ్దుల్లా ఖాన్ నాయిజీ, అతని 93 వేల సైనిక బలగంతో భారత్ ఎదుట లొంగిపోయారు. తద్వారా బంగ్లాదేశ్ స్వతంత్ర్య దేశంగా ఆవిర్భవించింది. ఇక ఈ యుద్ధంలో విజయానికి గుర్తుగా ప్రతియేడు డిసెంబర్ 16న విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
(చదవండి: రజనీ కొత్త పార్టీ పేరు మక్కల్ సేవై కర్చీ, గుర్తు అదేనా ?)
Comments
Please login to add a commentAdd a comment