BSF personnel
-
11 గంటల్లో 180 కి.మీ పరుగు!
న్యూఢిల్లీ: విజయ్ దివస్ సందర్భంగా బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధ వీరులను స్మరించుకుంది. వారి గౌరవార్థం 180 కిలోమీటర్ల బ్యాటన్ రిలే ర్యాలీ నిర్వహించింది. 930 బీఎస్ఎఫ్ సైనికులతో డిసెంబర్ 13 అర్థరాత్రి నుంచి 14 వ తేదీ ఉదయం వరకు రాజస్తాన్‌లోని అనూప్‌ఘర్‌లో ఈ ర్యాలీ కొనసాగింది. బీఎస్ఎఫ్ ప్రయత్నాన్ని కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు కొనియాడారు. బ్యాటర్ రిలే ర్యాలీలో పాల్గొన్న సైనికులపై ప్రశంసలు కురిపించారు. 930 మంది బీఎస్ఎఫ్ జవాన్లు రాజస్తాన్‌లోని అంతర్జాతీయ సరిహద్దు గుండా 1971 యుద్ధ వీరుల గౌరవార్థం బ్యాటన్ రిలే ర్యాలీ నిర్వహించారని ట్విటర్లో పేర్కొన్నారు. ర్యాలీకి సంబంధించిన వీడియో షేర్ చేశారు. కాగా, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించేందుకు భారత్ 1971లో యుద్ధ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఆర్మీపై భారత ఆర్మీ పట్టు సాధించింది. దాంతో అప్పటి పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఆమిర్ అబ్దుల్లా ఖాన్ నాయిజీ, అతని 93 వేల సైనిక బలగంతో భారత్ ఎదుట లొంగిపోయారు. తద్వారా బంగ్లాదేశ్ స్వతంత్ర్య దేశంగా ఆవిర్భవించింది. ఇక ఈ యుద్ధంలో విజయానికి గుర్తుగా ప్రతియేడు డిసెంబర్ 16న విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. (చదవండి: రజనీ కొత్త పార్టీ పేరు మక్కల్ సేవై కర్చీ, గుర్తు అదేనా ?) -
మళ్లీ బరితెగించిన పాకిస్థాన్
జమ్మూ: పాకిస్థాన్ మళ్లీ బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా కాల్పులకు దిగింది. జమ్మూకశ్మీర్ సాంబా జిల్లాలోని చామ్‌లియాల్ ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దుల్లో మీదుగా పాక్ మంగళవారం రాత్రి కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు మృతిచెందారు. అమరులైన వారిలో అసిస్టెంట్ కమాండెంట్ జతిందర్ సింగ్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రామ్ నివాస్, కానిస్టేబుల్ హన్స్ రాజ్‌లుగా గుర్తించారు. మరో జవాను చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందారు. బీఎస్ఎఫ్ బలగాలు అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా రాత్రిపూట గస్తీ నిర్వహిస్తుండగా.. పాక్ రేంజర్లు ఇలా బరితెగించి ఏకపక్షంగా కాల్పులు జరిపారని తెలుస్తోంది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాలని ఇటీవల జరిగిన బీఎస్ఎఫ్-పాక్ రేంజర్స్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంతలోనే పాక్ కాల్పులకు తెగబడటంతో భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. -
భారీ చొరబాటు యత్నం భగ్నం
జమ్మూ: భారత్‌లో భారీ విధ్వంసానికి జరిగిన కుట్రను సరిహద్దు భద్రతా దళం భగ్నం చేసింది. పెద్ద సంఖ్యలో మందుగుండు సామగ్రి, రాకెట్లు, గ్రనేడ్లు తీసుకుని అంతర్జాతీయ సరిహద్దు గుండా కథువా జిల్లాలో చొరబాటుకు యత్నించిన ఆరుగురు మిలిటెంట్లను జవాన్లు అడ్డుకున్నారు. ‘బుధవారం రాత్రి 11.45 గంటల ప్రాంతంలో కథువా జిల్లాలో సరిహద్దు వద్ద వాహనంలో బీఎస్ఎఫ్ జవాన్లు గస్తీ కాస్తున్నారు. ఈ సమయంలో కొందరు కంచె దాటేందుకు యత్నించటాన్ని గమనించిన జవాన్లు కాల్పులు జరిపారు. దీంతో ఆ ఆరుగురు పారిపోయారు. వారి వద్ద భారీగా రాకెట్ లాంచర్లు, గ్రనేడ్లున్నాయి. వీరికి మద్దతుగా సరిహద్దు సమీపంలోని పాక్ ఔట్‌పోస్టు నుంచి భారత జవాన్లపై కాల్పులు జరిగాయి. వీటిని సైనికులు తిప్పికొట్టారు’ అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనను కొనసాగిస్తోంది.