vijay diwas
-
విజయ్ దివస్ సందర్భంగా YS జగన్ ట్వీట్
-
విజయ్ దివస్.. సాయుధ బలగాలకు సెల్యూట్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు విజయ్ దివస్. ఈ సందర్బంగా భారత సాయుధ బలగాల పరాక్రమంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం సైనికులు చేసిన ధైర్య సాహసాలను అందరూ స్మరించుకోవాలన్నారు.విజయ్ దివస్ సందర్భంగా వైఎస్ జగన్ స్పందించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘విజయ్ దివస్ సందర్భంగా మన సాయుధ బలగాల ధైర్యసాహసాలు, త్యాగాలను స్మరించుకుని, సెల్యూట్ చేద్దాం. 1971లో జరిగిన ఈ చారిత్రక విజయంలో మన సైనికులు చూపిన పరాక్రమం, సంకల్పం ఎనలేనిది. దేశం కోసం సైనికులు చేసిన ధైర్య సాహసాలు చరిత్రలో నిలిచిపోయేలా చేశాయి’ అని కామెంట్స్ చేశారు. On this special day of Vijay Diwas, we remember and salute the bravery and sacrifice of our armed forces. Their valor and determination in the historic 1971 victory liberated a nation and etched India’s courage in history. Jai Hind!— YS Jagan Mohan Reddy (@ysjagan) December 16, 2024 -
Vijay Diwas: ‘చనిపోయానని ఇంటికి టెలిగ్రాం పంపారు’: నాటి సైనికుని అనుభవం..
అది 1971, డిసెంబర్ 16.. భారతదేశ చరిత్ర పుటల్లో గర్వకారణంగా నిలిచిన రోజు. ఆ రోజున భారతదేశం యుద్ధంలో పాకిస్తాన్‌కు ఘోరమైన ఓటమి ఎలా ఉంటుందో చూపింది. నాటి యుద్ధంలో సుమారు 3,900 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందగా, 9,851 మంది గాయపడ్డారు. యుద్ధం అనంతరం 93 వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఈ నేపధ్యంలోనే తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా, బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించింది.నాటి యుద్ధంలో బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన పలువురు వీర సైనికులు పాకిస్తాన్ సేనను ధైర్యంగా ఎదుర్కొని, వారిని మట్టికరిపించారు. ప్రతీయేటా డిసెంబర్ 16 రాగానే.. నాటి యుద్ధంలో పాల్గొని, పాక్ సైనికులను ఓడించిన వీర జవాన్లకు నాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి.నాటి యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడు మీడియాతో మాట్లాడుతూ ‘నేను యుద్ధం ప్రారంభమైనప్పుడు లక్నోలో వైర్లెస్ ఆపరేటర్‌గా పని చేశాను. నాడు నన్ను బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు పంపారు. అక్కడ మా ఎనిమిది మంది సైనికుల బృందం పాకిస్తాన్ సైనికుల కాన్వాయ్‌పై మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో పలువురు పాకిస్తానీ సైనికులు మరణించారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో మేము స్పృహ కోల్పోయాం. నేను చనిపోయానని సైన్యం భావించి, మా ఇంటికి టెలిగ్రామ్ పంపింది. అయితే ఆ తర్వాత నేను స్పృహలోకి రాగానే, నేను బతికే ఉన్నానంటూ మా ఇంటిలోనివారికి సైన్యం తిరిగి మరో సందేశం పంపింది’ అని తెలిపారు.మరో సైనికుడు తన యుద్ధ అనుభవాలను మీడియాతో పంచుకుంటూ ‘యుద్ధం జరుగుతున్న సమయంలో నేను ఢాకాలో ఉన్నాను. రాత్రంతా వైర్లెస్ బ్యాటరీని ఛార్జ్ చేసేవాడిని. కరెంటు లేకపోవడంతో జనరేటర్‌తో పని చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో మేము నిత్యం అప్రమత్తంగా ఉన్నాం. పాకిస్తాన్ సైనికులు ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భావనతో ఉండేవాళ్లం’ అని తెలిపారు. నాడు భారత సైనికులు ప్రదర్శించిన ధైర్యం అందరికీ ఎనలేని స్ఫూర్తినిస్తుంది. నాటి యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందిన సైనికులకు ప్రతి ఏటా డిసెంబర్ 16న దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తారు.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: లక్షలాది రుద్రాక్షలు ధరించి ప్రయాగ్‌రాజ్‌కు.. -
Vijay Diwas: బంగ్లాదేశ్ ఆవిర్భవించిన రోజు.. భారత్‌కు ఎందుకు ప్రత్యేకం?
దేశమంతా ఈరోజు (డిసెంబరు 16) విజయ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1971లో ఇదే రోజున భారత్ యుద్ధంలో పాక్ సైన్యాన్ని మట్టికరిపించింది. అలాగే తూర్పు పాకిస్తాన్‌ను అణచివేత నుండి విముక్తి చేసింది. ఈ రోజు భారతదేశంతో పాటు బంగ్లాదేశ్‌కు కూడా ఎంతో ప్రత్యేకమైనది. పాక్‌పై యద్ధంలో గెలిచినందుకు గుర్తుగా భారత సాయుధ బలగాల త్యాగాలను ఈరోజు గుర్తుచేసుకుంటారు.నాటి ప్రధాని ఇందిరాగాంధీ చొరవతో..1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర యుద్ధంలో బెంగాలీ జాతీయవాద సమూహానికి భారత్ మద్దతుపలికింది. ఈ నేపధ్యంలో తూర్పు పాకిస్తాన్లో భారత్.. పాక్‌తో యుద్ధం చేసింది. అంతిమంగా ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓటమిని చవిచూసింది. 1970-71లలో పాకిస్తాన్ జనరల్ యాహ్యా ఖాన్ తన అణచివేత సైనిక పాలనతో తూర్పు పాకిస్తాన్‌లోని సామాన్యులను ఊచకోతకు గురిచేశారు. ఈ నేపధ్యంలో షేక్ ముజిబుర్ రెహమాన్ సామాన్యులను పోరాటం దిశగా ప్రేరేపించేందుకు ముక్తి బాహినీ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే ఈ పోరాటానికి భారత్ నుంచి సహాయం కూడా కోరారు. నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ తూర్పు పాకిస్తాన్ ప్రజలను పాక్ అరాచకాల నుంచి రక్షించేందుకు భారత సైన్యాన్ని పాక్‌తో యుద్ధానికి అనుమతించారు.అతిపెద్ద సైనిక లొంగుబాటుభారత సైన్యం 1971, డిసెంబర్ 4న ఆపరేషన్ ట్రైడెంట్‌ను ప్రారంభించింది. ఈ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ సైన్యానికి తగిన సమాధానం ఇచ్చింది. దీంతో 1971, డిసెంబర్ 16న బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఆవిర్భవించింది. ఈ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీని లొంగిపోయేలా ఒత్తిడి చేయడంతో మరోమార్గంలేక అతను అందుకు తలొగ్గాడు. ఈ యుద్ధకాలంలో 93 వేలమంది పాకిస్తానీ సైనికులు లొంగిపోయారు. దీనిని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైనిక లొంగుబాటుగా చెబుతారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎప్పటికీ గుర్తుండే 10 రాజకీయ ఘటనలు -
1971 యుద్ధంలో భారత్‌కు ఇజ్రాయెల్ చేసిన సాయం ఏమిటి?
ఈరోజు డిసెంబర్ 16.. భారతదేశ చరిత్రలో నేడు విజయ దినోత్సవం. 1971వ సంవత్సరంలో ఇదే రోజున పాకిస్తాన్ రెండు ప్రాంతాలుగా విడిపోయింది. దక్షిణాసియాలో కొత్త దేశం బంగ్లాదేశ్ ఉనికిలోకి వచ్చింది. బంగ్లాదేశ్ విమాచనకు జరిగిన ఈ యుద్ధంలో భారత సైన్యం, బంగ్లాదేశ్ సైన్యం కలసిగట్టుగా పాకిస్తాన్ సైన్యంతో పొరాటం సాగించాయి. ఈ యుద్ధం 13 రోజులపాటు కొనసాగగా, 90 వేల మంది పాకిస్తాన్ సైనికులు భారత సైన్యం ముందు తమ ఆయుధాలు ప్రయోగించారు. ఆ విపత్కర సమయంలో భారత్ తన అత్యంత విశ్వసనీయ మిత్రదేశమైన ఇజ్రాయెల్ నుండి సహాయం పొందింది. రెండు దేశాల మధ్య బంధం ఈనాటిది కాదు. 1971లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ కూడా భారత్‌కు సహాయం చేసిందనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రముఖ రచయిత శ్రీనాథ్ రాఘవన్ ‘1971’ పేరిట ఒక పుస్తకాన్ని ఇటీవల వెలువరించారు. దీనిలో 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన అనేక విషయాలు వెల్లడించారు. న్యూఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో ఉంచిన పీఎన్ హక్సర్ పత్రాల ఆధారం చేసుకుని పలు కీలక అంశాలను రాఘవన్ వెల్లడించారు. పీఎన్ హక్సర్ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి సలహాదారు. రాఘవన్ ‘హక్సర్ పత్రాల’పై పరిశోధన చేశారు. ఆ సమయంలో భారతదేశం ఇజ్రాయెల్ నుండి సహాయం పొందిందని రాఘవన్ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లోని భారత రాయబారి డీఎన్ ఛటర్జీ 1971, జూలై 6న ఒక నోట్‌తో ఇజ్రాయెల్ ఆయుధ ప్రతిపాదన గురించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలియజేసినట్లు రాఘవన్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను ఇందిరా గాంధీ ఎదుట ఉంచగా, ఆమె వెంటనే అంగీకరించారు. దీని తరువాత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ "రా" (RAW)ద్వారా ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలను స్వీకరించే ప్రక్రియ ప్రారంభమైంది. ఆ సమయంలో ఇజ్రాయెల్ ఆయుధాల కొరతతో బాధపడుతోందని ఆ పత్రాలు చెబుతున్నాయి. అయితే ఇరాన్‌కు ఇచ్చిన ఆయుధాలను భారతదేశానికి ఇవ్వాలని అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని గోల్డా మీర్ నిర్ణయించారు. ‘1971’ పుస్తకంలోని వివరాల ప్రకారం.. ఈ రహస్య బదిలీని నిర్వహించే సంస్థ డైరెక్టర్ ష్లోమో జబుల్డోవిచ్ ద్వారా ఇందిరా గాంధీకి.. ఇజ్రాయెల్ ప్రధాని హిబ్రూ భాషలో ఒక నోట్ పంపారు. ఇందులో ఆయుధాలకు బదులుగా దౌత్య సంబంధాలు అభ్యర్థించారు. ఆ సమయంలో భారతదేశానికి ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేవు. అయితే ఆ సమయంలో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడలేదు. పీవీ నరసింహారావు భారత ప్రధానిగా ఉన్న సమయంలో అంటే 1992లో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటుకు వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలోనూ భారతదేశం తటస్థ వైఖరి అనుసరించింది. ఇజ్రాయెల్‌పై దాడి జరగ్గానే ఉగ్రవాదుల చర్యను ఖండించింది. అలాగే, గాజాలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఇజ్రాయెల్‌కు పిలుపునిచ్చింది. దాడులకు సంబంధం లేని వ్యక్తులు ముఖ్యంగా చిన్నారులకు ఎలాంటి ముప్పు వాటిల్లొద్దని, శాంతి నెలకొనాలని ఆశించింది. ఇది కూడా చదవండి: దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలకలం -
భారత్, బంగ్లా మధ్య ఏడు ఒప్పందాలు
ఢాకా: భారత్, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయి. మొత్తం ఏడు రంగాల్లో పరస్పర సహకారం కోసం ఇరుపక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య గురువారం జరిగిన ఆన్లైన్ సదస్సులో ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల మధ్య గత 55 ఏళ్లుగా నిలిచిపోయిన రైలు మార్గాన్ని సైతం పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాక్‌పై జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ విజయం సాధించి 50 ఏళ్లవుతున్న సందర్భంగా విజయ్ దివస్ జరుపుకుంటున్న వేళ భారత్, బంగ్లాల మధ్య ఒప్పందాలు కుదరడం గర్వకారణమని ప్రధాని మోదీ చెప్పారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబీర్ రెహ్మాన్ జీవితాలను ఆవిష్కరించే డిజిటల్ ఎగ్జిబిషన్‌ను ప్రధానులిద్దరూ సంయుక్తంగా ప్రారంభించారు. హైడ్రోకార్బన్స్, వ్యవసాయం, ఇంధనం, టెక్స్టైల్స్ రంగాల్లో పరస్పర సహకారంతో పాటు సరిహద్దుల్లో ఏనుగుల సంరక్షణ, బంగ్లాకు చెత్తను శుద్ధి చేసే పరికరాల ఎగుమతి వంటి వాటిపై ఒక అవగాహనకు వచ్చాయి. భారత్‌కు కృతజ్ఞతలు: హసీనా భారత్ తమకు అసలైన మిత్రదేశమని షేక్ హసీనా అన్నారు. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో అండదండలు అందించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
ఆ 54 మంది సైనికులు ఏమయ్యారు?
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌పై భారత్ సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతీ ఏడాది డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుకొంటాము. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం చేకూర్చిన 1971 నాటి ఇండో- పాక్ యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తాం. ఇక ఈ యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద బుధవారం స్వర్ణ జ్యోతిని వెలిగించారు. వీర జవాన్ల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. దాయాది దేశం పాకిస్తాన్ మీద భారత ఆర్మీ సాధించిన అతి గొప్ప చారిత్రక విజయాల్లో ఒకటిగా నిలిచిన నేటి రోజున భారతీయుల గుండెలు ఉద్వేగంతో ఉప్పొంగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, అదే సమయంలో ఇండో- పాక్ యుద్ధ కాలం (1947-48, 1965, 1971)లో ముఖ్యంగా 1971 యుద్ధంలో అదృశ్యమై పోయిన 54 మంది భారత సైనికులను కూడా గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. పాకిస్తాన్ ఆర్మీకి పట్టుబడిన ఆ జవాన్లు ఇంకా బతికే ఉన్నారని వారి కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు. కొంతమందైతే వారి జాడను వెదుక్కుంటూ పాక్‌కు వెళ్లారు కూడా. కానీ అక్కడ వారికి నిరాశే ఎదురైంది. మరి.. యుద్ధ ఖైదీలుగా పాకిస్తాన్‌కు చిక్కిన ఆ 54 మంది సైనికులు ఏమయ్యారు? నాలుగు దశాబ్దాలు గడిచినా తమవారు తిరిగి వస్తారని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యుల ఎదురుచూపులకు సమాధానం దొరుకుతుందా?! నిజానికి అధికారికంగా 54 మంది మాత్రమే అదృశ్యమయ్యారని పైకి చెబుతున్నా.. ఇవే కచ్చితమైన గణాంకాలు కావనే వాదనలూ ఉన్నాయి. వారు బతికే ఉన్నారా లేదా మరణించారా అన్న సందేహాలకు కూడా జవాబు లేదు. అయితే పాకిస్తాన్ నుంచి వచ్చిన కొన్ని ఉత్తరాలు మాత్రం వారు బతికే ఉన్నాయని ఆశలు కల్పిస్తున్నాయి. (చదవండి : పాకిస్తాన్ మెడలు వంచిన భారత ఆర్మీ) మోకరిల్లిన పాక్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆమిర్ అబ్దుల్లా ఖాన్ నాయిజీతో సహా 93 వేల మంది పాక్ సైనికులు భారత దళాల ఎదుట బేషరతుగా లొంగిపోవడంతో 13 రోజుల పాటు ఏకధాటిగా సాగిన యుద్ధం ముగిసింది. భారత్ విజయంతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది. కానీ, పాకిస్తాన్లో చెరలో ఉన్నట్టు భావిస్తున్న సైనికుల కుటుంబాల్లో నెలకొన్న చీకట్లు తొలగిపోలేదు. అశోక్ అనే సైనికుడు తాము పాకిస్తాన్లో చిక్కుకున్నామని చెప్తూ డిసెంబరు 26, 1974న భారత్‌లోని తన తండ్రి ఆర్ఎస్ సురికి రాసిన ఓ లేఖ మాత్రం వారి మనసుల్లో కాంతిరేఖలు ప్రసరింపజేసింది. 1975 ఆగస్టులో.. ‘ప్రియమైన నాన్న.. ఆశీర్వాదం కోసం అశోక్ మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాడు. నేనిక్కడ బాగానే ఉన్నాను. ఇండియన్ ఆర్మీ, భారత ప్రభుత్వంతో మా గురించి మాట్లాడండి. మేమిక్కడ 20 మంది ఆఫీసర్లం ఉన్నాం. నా గురించి బాధ పడొద్దు. ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి. ముఖ్యంగా అమ్మ, తాతయ్యను. మాకు విముక్తి కల్పించేందుకు భారత ప్రభుత్వం పాకిస్తాన్ సర్కారును సంప్రదిస్తే బాగుంటుంది’అని లేఖలో పేర్కొన్నాడు. అప్పటి రక్షణ శాఖా కార్యదర్శి ఆ లేఖలో ఉన్న సంతకం అశోక్‌దేనని నిర్ధారించారు. మేజర్ ఏకే ఘోష్ పాకిస్తాన్‌తో యుద్ధంలో పాల్గొన్నట్టు ఆయన ఫొటోలు టైమ్ మ్యాగజీన్లో ప్రచురితమయ్యాయి. కానీ, యుద్ధానంతరం ఆయన మాత్రం ఇండియాకు తిరిగి రాలేదు. ఆయన మరణించి ఉండొచ్చనే అభిప్రాయాలు ఒకవైపు, పాక్‌లో పట్టుబడి ఉన్నారేమోననే వాదనలు మరోవైపు వినిపించాయి. ఇదిలాఉంటే.. మోహన్‌లాల్ భాస్కర్ అనే సైనికుడు 1968- 1974 వరకు పాకిస్తాన్ జైలులో గడిపిన ఆయన డిసెంబరులో విడుదలయ్యారు. యాన్ ఇండియన్ స్పై ఇన్ పాకిస్తాన్ పేరిట పుస్తకం రాశారు. పాకిస్తాన్ సెకండ్ పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన కల్నల్ అసీఫ్ షఫీని తాను కలిసినట్టు అందులో పేర్కొన్నారు. అదేవిధంగా మేజర్ అయాజ్ అహ్మద్ సిప్రాను కలిశానని 1968-71 యుద్ధ సమయంలో దాదాపు 40 భారత సైనికులు జైళ్లలో మగ్గుతున్నట్టు ఆయన చెప్పినట్టు రాసుకొచ్చారు. ఇక బేనజీర్ భుట్టో బయోగ్రఫీలో బ్రిటీష్ చరిత్రకారులు విక్టోరియస్ కఫిల్ తనకు పాకిస్తాన్లో భారత యుద్ధ ఖైదీలు ఉన్నట్టు ఆ దేశానికి చెందిన ఓ లాయర్ తనకు చెప్పారని పేర్కొన్నారు. అంతేకాక పాకిస్తాన్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. భారత వింగ్ కమాండర్ హరిసేన్ గిల్ నడుపుతున్న యుద్ధ విమానం డిసెంబర్ 3న కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్‌ను ప్రాణాలతో పట్టుకున్నట్టు ఆర్మీ అధికార ప్రతినిధి చెప్పిన మాటలు రేడియో ప్రకటనలో వెలువడ్డాయి. 54 మంది అదృశ్యం.. ఎన్నో అనుమానాలు చందర్ సుతా డోగ్రా వంటి సీనియర్ జర్నలిస్టులు వీరి గురించి వివరాలు తెలుసుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. రిటైర్డ్ ఆర్మీ అధికారులు, బ్యూరోక్రాట్లు, జవాన్ల బంధువులు, వారి దగ్గర ఉన్న ఉత్తరాలు, వార్తా పత్రికల క్లిప్పింగులు, డైరీలు, ఫొటోలు, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న వివరాల ఆధారంగా వారు ఏమైపోయారన్న ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు కృషి చేశారు. తన పరిశోధనలో భాగంగా.. పాకిస్తాన్ నిజంగానే ఈ 54 మందిని చంపేసిందా? వారు పాక్‌లోనే బంధీలుగా ఉన్నారని ఇండియా నిరూపించగలదా? వారి శరీరంలో చిప్‌లు పెట్టి భవిష్యత్తులో వారిని ఆయుధాలుగా ఉపయోగిస్తుందా? నిజానికి చాలా మంది పాక్ అధికారులు.. తమ దేశంలో గూఢచర్యం చేసేందుకే ఈ సైనికులు పట్టుబడ్డారని భావించడం, పట్టుబడిన భారత జవాన్లలో కొద్ది మందిని వెంటనే చంపేయడం, మిగతా వారిని యుద్ధ ఖైదీలుగా బంధించడం వెనుక గల కారణాల గురించి ఆమె అన్వేషించారు. ఇక అదృశ్యమై పోయిన 54వ మంది సైనికుల గురించి పిటిషన్ దాఖలైన నేపథ్యంలో.. వారిలో 15 మంది కచ్చితంగా వీరమరణం పొందారని భారత ప్రభుత్వం రెండు అఫిడవిట్లలో పేర్కొనడం వంటి అంశాల ఆధారంగా.. భారత్ ఇంకా 54 మంది మాయమైపోయారని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటన్న అంశాల గురించి ఆరా తీశారు. పాక్ జైళ్లకు వెళ్లి మరి ఇక తమ వారి జాడను వెదుక్కుంటూ ఈ సైనికుల బంధువులు పాకిస్తాన్‌కు వెళ్లారు. వారి ఫొటోలు పట్టుకుని, వివరాలు అడుగుతూ 1983లో ఆరుగురు, 2007లో 14 మంది పాక్‌ను సందర్శించారు. అక్కడి జైళ్లకు వెళ్లి ఆరా తీశారు. తమ వాళ్లు జైళ్ల గోడల అవతలే ఉన్నారంటూ వారు బలంగా విశ్వసించారు. దీంతో యుద్ధఖైదీలు ఎవరూ లేరని పాక్ ప్రభుత్వం మరోసారి ప్రకటన చేసింది. కానీ, మిస్టరీగా మారిన భారత సైనికుల ఆచూకీ ఏమై ఉంటుందన్న ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది.. ఏనాటికైనా దీనికి జవాబు దొరుకుతుందా! భారత సైన్యం సిబ్బంది 1. మేజర్ ఎస్పీఎస్ వారాయిచ్ (15 పంజాబ్ ఈయనను పాక్ఖైదీగా పట్టుకున్న వెంటనే తుపాకీ కాల్పుల్లో చనిపోయారని చెప్తున్నారు) 2. మేజర్ కన్వల్జిత్సింగ్సంధూ (15 పంజాబ్) 3. సెకండ్ లెఫ్టినెంట్ సుధీర్ మోహన్ సభర్వాల్(87 లైట్‌రెజిమెంట్) 4. కెప్టెన్ రవీందర్ కౌరా (మెడికల్ రెజిమెంట్) 5. కెప్టెన్ గిరిరాజ్ సింగ్(5 అస్సాం) 6. కెప్టెన్ ఓమ్ ప్రకాష్ దలాల్(గ్రెనేడియర్స్) 7. మేజర్ సూరజ్ సింగ్(15 రాజ్‌పుత్) 8. మేజర్ ఎ.కె.సూరి (5 అసోం) 9. కెప్టెన్ కల్యాణ్ సింగ్ రాథోడ్(5 అసోం) 10. మేజర్ జస్కిరణ్ సింగ్ మాలిక్(8 రాజ్రైఫిల్స్) 11. మేజర్ ఎస్.సి. గులేరి (9 జాట్) 12. లెఫ్టినెంట్ విజయ్‌కుమార్ ఆజాద్(1/9 జి రెజ్) 13. కెప్టెన్ కమల్బక్షి (5 సిఖ్) 14. సెకండ్ లెఫ్టినెంట్ పరస్రామ్ శర్మ (5/8 జి. ఆర్.) 15. కెప్టెన్ వశిష్ట్ నాథ్ 16. లెఫ్టినెంట్ హవల్దార్ కృష్ణలాల్ శర్మ (1 జమ్మూకశ్మీర్రైఫిల్స్) 17 సుబేదార్ అస్సాసింగ్(5 సిఖ్) 18. సుబేదార్ కాళిదాస్(8 జమ్మూకశ్మీర్ఎల్ఐ) 19. లాన్స్‌నాయక్ జగదీశ్‌రాజ్(మహర్రెజిమెంట్) 20 లాన్స్‌నాయక్ హజూరాసింగ్ 21 గన్నర్ సుజన్ సింగ్(14 ఫార్వర్డ్రెజిమెంట్) 22. సిపాయ్ దలేర్ సింగ్(15 పంజాబ్) 23. గన్నర్ పాల్‌సింగ్(181 లైట్‌రెజిమెంట్) 24. సిపాయ్ జాగీర్‌సింగ్(16 పంజాబ్) 25 గన్నర్ మదన్ మోహన్(94 మౌంటెయిన్రెజిమెంట్) 26. గన్నర్గ్యాన్చంద్/ గన్నర్శ్యామ్సింగ్ 27. లాన్స్‌నాయక్ బల్బీర్సింగ్ఎస్.బి.ఎస్. చౌహాన్ 28. కెప్టెన్ డి.ఎస్.జామ్వాల్(81 ఫీల్డ్రెజిమెంట్) 29. కెప్టెన్ వశిష్ట్నాథ్(అటాక్) భారత వైమానిక దళ సిబ్బంది 30. స్క్వాడ్రన్‌లీడర్ మోహీందర్ కుమార్ జైన్(27 స్క్వాడ్రన్) 31. ఫ్లైట్‌లెఫ్టినెంట్ సుధీర్ కుమార్ గోస్వామి (5 స్క్వాడ్రన్) 32. ఫ్లైయింగ్ ఆఫీసర్ సుధీర్ త్యాగి (27 స్క్వాడ్రన్) 33. ఫ్లైట్‌లెఫ్టినెంట్ విజయ్ వసంత్ తాంబే (32 స్క్వాడ్రన్) 34. ఫ్లైట్ లెఫ్టినెంట్ నాగస్వామి శంకర్(32 స్క్వాడ్రన్) 35. ఫ్లైట్ లెఫ్టినెంట్ రామ్ మేథారామ్ అద్వానీ (జేబీసీయూ) 36. ఫ్లైట్ లెఫ్టినెంట్ మనోహర్ పురోహిత్(5 స్క్వాడ్రన్) 37. ఫ్లైట్‌లెఫ్టినెంట్ తన్మయ సింగ్ దాన్దాస్(26 స్క్వాడ్రన్) 38. వింగ్ కమాండర్ హర్శరన్ సింగ్(47 స్క్వాడ్రన్) 39. ఫ్లైట్ లెఫ్టినెంట్ బాబుల్గుహ 40. ఫ్లైట్ లెఫ్టినెంట్ సురేశ్చందర్ సందాల్(35 స్క్వాడ్రన్) 41. స్క్వాడ్రన్‌లీడర్ జల్మాణిక్షా మిస్త్రీ 42. ఫ్లైట్‌లెఫ్టినెంట్ హర్వీందర్‌సింగ్(222 స్క్వాడ్రన్) 43. స్క్వాడ్రన్‌లీడర్ జతీందర్దాస్కుమార్(3 స్క్వాడ్రన్) 44. ఫ్లైట్‌లెఫ్టినెంట్ ఎల్.ఎం.సాసూన్(జేబీసీయూ) 45. ఫ్లైట్‌లెఫ్టినెంట్ కుషల్పాల్ సింగ్ నందా (35 స్క్వాడ్రన్) 46. ఫ్లాగ్‌ఆఫీసర్ కృషన్ఎల్. మల్కానీ (27 స్క్వాడ్రన్) 47. ఫ్లైట్‌లెఫ్టినెంట్ బల్వంత్ధవాలే (1 స్క్వాడ్రన్) 48. ఫ్లైట్‌లెఫ్టినెంట్ శ్రీకాంత్సి. మహాజన్(5 స్క్వాడ్రన్) 49. ఫ్లైట్‌లెఫ్టినెంట్ గుర్దేవ్సింగ్రాయ్(27 స్క్వాడ్రన్) 50. ఫ్లైట్‌లెఫ్టినెంట్ రమేశ్‌జి. కాదమ్(టీఏసీడీఈ) 51. ఫ్లాగ్‌ఆఫీసర్ కె.పి.మురళీధరన్(20 స్క్వాడ్రన్) 52. నావల్ పైలట్లెఫ్టినెంట్ కమాండర్అశోక్రాయ్ 53. స్క్వాడ్రన్‌లీడర్ దేవప్రసాద్ఛటర్జీ 54. పెటీ ఆఫీసర్ తేజీందర్‌సింగ్ సేథీ -
మన సైనికుల పరాక్రమం గర్వకారణం
న్యూఢిల్లీ: 1971లో దాయాది దేశం పాకిస్తాన్‌పై జరిగిన యుద్ధంలో భారత సైనికులు ప్రదర్శించిన ధైర్య సాహసాలు సర్వదా శ్లాఘనీయం, గర్వకారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన సైనిక దళాల పరాక్రమంతో భారత్‌కు నిర్ణయాత్మక విజయం దక్కిందని గుర్తుచేశారు. విజయ్ దివస్ సందర్భంగా ఆయన బుధవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ్ జ్యోతిని వెలిగించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని మోదీ వెల్లడించారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత్ విజయానికి 49 ఏళ్లు నిండాయి. ఏడాది పాటు జరగనున్న 50వ వార్షికోత్సవాలను మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ్ జ్యోతిని స్వయంగా వెలిగించి, వేడుకలకు శ్రీకారం చుట్టారు. 4 విజయ జ్యోతులను(కాగడాలు) దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లనున్నట్లు రక్షణ శాఖ తెలియజేసింది. 1971 యుద్ధంలో పరమ వీరచక్ర, మహా వీరచక్ర పురస్కారాలు పొందిన విజేతల సొంత గ్రామాలకు ఈ జ్యోతులు వెళ్తాయని తెలిపింది. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసిన 1971 యుద్ధంలో పాకిస్తాన్లో భారత్ విజయానికి గుర్తుగా ప్రతిఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విజయానికి 49 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఈసారి ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఏడాదిపాటు స్వర్ణ విజయోత్సవాలు జరుగుతాయి. -
పాకిస్తాన్ మెడలు వంచిన భారత ఆర్మీ
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌కు స్వేచ్ఛ ప్రసాదించిన ఇండో-పాక్ యుద్ధానికి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది డిసెంబర్ 16న విజయ్ దివాస్ పేరుతో పాకిస్తాన్‌పై భారత్ సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటాము. ఇక చరిత్రలో ఈనాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏఏ ఖాన్ నియాజీతో సహా 93 వేల మంది పాక్ సైనికులు భారత దళాల ఎదుట బేషరతుగా లొంగిపోయారు. దాంతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అలాగే నాటి ఇండో-పాక్ యుద్ధంలో మరణించిన సైనికులకు దేశం ఘనంగా నివాళులర్పిస్తోంది. ఇదిలా ఉండగా భారత దేశం బెంగాలీ ముస్లింలు, హిందువులకు మద్దతుగా నిలవడంతో పాక్, ఇండియాల మధ్య డిసెంబర్ 3, 1971న యుద్ధం ప్రారంభమయ్యింది. 13 రోజుల పాటు ఏకధాటిగా సాగిన యుద్ధం పాక్ ఆర్మీ చీఫ్, సైన్యం భారత దళాల ముందు బేషరుతుగా లొంగిపోవడంతో ముగిసింది. ఇది పాక్ మీద భారత ఆర్మీ సాధించిన అతి గొప్ప చారిత్రక విజయాల్లో ఒకటిగా నిలిచింది. యుద్ధానికి తక్షణ కారణం... తూర్పు పాకిస్తాన్ నుంచి విడిపోయి సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని 1971 మార్చి 26న బంగ్లాదేశ్ పిలుపునిచ్చింది. ఆ తరువాతి రోజు వారి స్వాతంత్ర్య పోరాటానికి భారతదేశం పూర్తి మద్దతు ప్రకటించింది. అప్పట్లో పాకిస్తాన్ మిలటరీ బెంగాలీలపై, ప్రధానంగా హిందువులపై ఎన్నో దారుణాలకు పాల్పడింది. దీంతో సుమారు 10 మిలియన్ల మంది ప్రజలు మన దేశానికి వలస వచ్చారు. బెంగాలీ శరణార్థులను భారత్ ఆహ్వానించింది. (చదవండి: 11 గంటల్లో 180 కి.మీ పరుగు!) ఒక్క సంతకంతో ముగింపు ఈ యుద్ధం 20 వ శతాబ్దపు అత్యంత హింసాత్మక యుద్ధాలలో ఒకటిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఈ యుద్ధంలో పాక్ సైన్యం పెద్ద ఎత్తున దురాగతాలకు పాల్పడింది. యుద్దం వల్ల 10 మిలియన్ల మంది శరణార్థులుగా మారడమే కాక.. మరో 3 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ సాయుధ దళాలకు నాయకత్వం వహిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ, డిసెంబర్ 16, 1971 న లొంగుబాటు పత్రంపై సంతకం చేయడంతో ఇండో-పాక్ యుద్ధం ముగిసింది. ఇక ఈ లిఖితపూర్వక లొంగుబాటు ఒప్పంద పత్రం బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్ ఈస్టర్న్ కమాండ్ లొంగిపోవడానికి వీలు కల్పించింది. 1971 ఇండో-పాక్ యుద్ధం ముగిసింది. ఇక ఆ సయమంలో అప్పటి భారత ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా పాక్ దళాలకు పంపిన సందేశం చరిత్రలో నిలిచిపోయింది. డిసెంబర్ 13, 1971న సామ్ మానేక్షా పాక్ దళాలను ఉద్దేశిస్తూ.. ‘లొంగిపొండి లేదంటే మిమ్మల్ని మేం నాశనం చేస్తాం’ అని హెచ్చరించారు. దాంతో పాక్ ఆర్మీ చీఫ్‌తో సహా 93 వేల మంది సైనికులు భారత్ ముందు బేషరతుగా లొంగిపోయారు. తర్వాత సిమ్లా ఒప్పందంలో భాగంగా భారత్ వారిని విడుదల చేసింది. సత్తా చాటిన త్రివిధ దళాలు పాకిస్తాన్ వైమానిక దళం మన దేశంలో వాయువ్య ప్రాంతాలపై దాడులు చేసిన తరువాత మన దేశం అధికారికంగా యుద్ధంలోకి దిగింది. ‘ఆపరేషన్ చెంగిజ్ ఖాన్’లో భాగంగా ఆగ్రా, తాజ్‌మహల్‌పై దాడులు చేసేందుకు ప్రణాళిక రచించింది. అప్పట్లో శత్రు దేశాల దృష్టిని మళ్లించేందుకు తాజ్‌మహల్‌ను ఆకులు, కొమ్మలతో కప్పివేశారు. పాకిస్తాన్‌కు ప్రతిస్పందనగా భారత వైమానిక దళం వెస్ట్రన్ ఫ్రంట్‌లో పటిష్ట ఏర్పాట్లు చేసింది. యుద్ధం ముగిసే వరకు ఐఏఎఫ్, పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ స్థావరాలపై దాడి చేస్తూనే ఉంది. ఈ యుద్దంలో ఇండియన్ నేవీ కూడా కీలక పాత్ర పోషించింది. ‘ఆపరేషన్ ట్రైడెంట్’ పేరుతో కరాచీ పోర్ట్‌పై భారత నావికాదళం డిసెంబర్ 4-5 మధ్యరాత్రి దాడి చేసింది. దీంతో పాకిస్తాన్ తమ దళాలను భారత పశ్చిమ సరిహద్దు వద్ద మోహరించింది. అప్పటికే మన సైన్యం పాక్ భూభాగంలోకి దూసుకువెళ్లింది. కొన్ని వేల కిలోమీటర్ల పాక్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ యుద్ధంలో పాకిస్తాన్‌కు చెందిన 8000 మంది సైనికులు చనిపోగా.. 25,000 మంది వరకు గాయపడ్డారు. సుమారు 3,843 మంది భారత సైనికులు మరణించారు. మరో 9,851మంది గాయపడ్డారు. -
ఢిల్లీలో అమరవీరులకు త్రివిధి దళాల నివాళి
-
స్వర్ణ విజయజ్యోతి వెలిగించిన మోదీ
ఢిల్లీ : బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం కలిగించిన 1971 ఇండో-పాక్ యుద్దానికి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. యుద్ధంలో మరణించిన జవాన్లకు సంఘీభావంగా స్వర్ణ విజయజ్యోతిని వెలిగించారు. కాగా ఈ స్వర్ణ విజయజ్యోతిని 1971 యుద్ధం తర్వాత పరమ్‌వీర్ చక్ర, మహావీర్ చక్ర పురస్కార గ్రహీత గ్రామాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రదేశాలకు తీసుకెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింఘ, చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు. కాగా ఈ ఏడాదితో భారత్ విజయానికి 50 ఏళ్ల పూర్తయిన సందర్భంగా స్వర్ణ విజయ సంవత్సరంగా పేర్కొంటూ దేశవ్యాప్తంగా వేడుకలను నిర్వహించనున్నట్లు రక్షణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 1971లో తూర్పు పాకిస్తాన్(ఇప్పటి బంగ్లాదేశ్)లో స్వతంత్రం పేరుతో మొదలైన ఇది భారత్- పాక్ యుద్దానికి తెరలేపింది. డిసెంబర్ 3 1971న మొదలైన యుద్ధం డిసెంబర్ 16న ముగిసింది. ఈ యుద్ధంలో భారత్ పాకిస్తాన్‌పై విజయం సాధించడంతో బంగ్లాదేశ్ ఏర్పడింది. యుద్ధంలో పాక్‌పై సాధించిన విజయానికి గుర్తుగా భారత ప్రభుత్వం ప్రతి ఏటా డిసెంబర్ 16ను విజయ్ దివస్ నిర్వహిస్తున్నారు. -
11 గంటల్లో 180 కి.మీ పరుగు!
న్యూఢిల్లీ: విజయ్ దివస్ సందర్భంగా బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధ వీరులను స్మరించుకుంది. వారి గౌరవార్థం 180 కిలోమీటర్ల బ్యాటన్ రిలే ర్యాలీ నిర్వహించింది. 930 బీఎస్ఎఫ్ సైనికులతో డిసెంబర్ 13 అర్థరాత్రి నుంచి 14 వ తేదీ ఉదయం వరకు రాజస్తాన్‌లోని అనూప్‌ఘర్‌లో ఈ ర్యాలీ కొనసాగింది. బీఎస్ఎఫ్ ప్రయత్నాన్ని కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు కొనియాడారు. బ్యాటర్ రిలే ర్యాలీలో పాల్గొన్న సైనికులపై ప్రశంసలు కురిపించారు. 930 మంది బీఎస్ఎఫ్ జవాన్లు రాజస్తాన్‌లోని అంతర్జాతీయ సరిహద్దు గుండా 1971 యుద్ధ వీరుల గౌరవార్థం బ్యాటన్ రిలే ర్యాలీ నిర్వహించారని ట్విటర్లో పేర్కొన్నారు. ర్యాలీకి సంబంధించిన వీడియో షేర్ చేశారు. కాగా, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించేందుకు భారత్ 1971లో యుద్ధ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఆర్మీపై భారత ఆర్మీ పట్టు సాధించింది. దాంతో అప్పటి పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఆమిర్ అబ్దుల్లా ఖాన్ నాయిజీ, అతని 93 వేల సైనిక బలగంతో భారత్ ఎదుట లొంగిపోయారు. తద్వారా బంగ్లాదేశ్ స్వతంత్ర్య దేశంగా ఆవిర్భవించింది. ఇక ఈ యుద్ధంలో విజయానికి గుర్తుగా ప్రతియేడు డిసెంబర్ 16న విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. (చదవండి: రజనీ కొత్త పార్టీ పేరు మక్కల్ సేవై కర్చీ, గుర్తు అదేనా ?) -
ఆ సాహసం.. సదా స్మరణీయం
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధవీరుల ధైర్య సాహసాలను ప్రధాని మోదీ స్మరించుకున్నారు. సాయుధ దళాల నైతిక స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడకూడదని, వారి ధైర్య సాహసాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని ఆదివారం మాసాంతపు రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో ప్రజలకు సూచించారు. ‘దేశం తరువాతే ఏదైనా’అనే భావంతో ప్రజలంతా ఉంటే సైనికుల ఆత్మస్థైర్యం మరింత పెరుగుతుందన్నారు. కార్గిల్ యుద్ధంలో సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ జరుపుకునే విజయ్ దివస్ (జూలై 26) కూడా ఇదే రోజు రావడంతో ప్రధాని ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు. 1999లో ఇదే రోజు కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. స్నేహ హస్తం చాచిన భారత్‌కు ఆనాడు పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచిందని ప్రధాని గుర్తు చేశారు. ‘అంతర్గత సమస్యల నుంచి తప్పించుకునేందుకు.. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే దుస్సాహసానికి పాక్ ఒడిగట్టింది’అన్నారు. ‘శత్రు సైన్యం శిఖరాల పైభాగంలో ఉంది. భారతీయ సైనికులు ఆ పర్వత పాదాల ప్రాంతాల్లో ఉన్నారు. భౌగోళికంగా వారికి అనుకూల స్థితి. కానీ భారత సైనికులు అత్యంత ధైర్య సాహసాలు, నైతిక స్థైర్యంతో వారిని మట్టికరిపించారు’అని కార్గిల్ యుద్ధాన్ని ప్రధాని గుర్తు చేశారు. తూర్పు లద్దాఖ్‌లో ఇటీవలి చైనా దుష్ట పన్నాగాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘కొందరు శత్రువులుగానే ఉండాలని కోరుకుంటారు’అని వ్యాఖ్యానించారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ దేశ ప్రజలను హెచ్చరించారు. కరోనా ముప్పు నేపథ్యంలో ఈ సారి స్వాతంత్య్ర దినోత్సవం కూడా ప్రత్యేకంగా ఉండబోతోందన్నారు. ఆరోజు స్వావలంబ, కరోనా రహిత భారత్ దిశగా ముందుకు వెళ్తామని యువత ప్రతినబూనాలన్నారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రధాని కోరారు. కార్గిల్ యుద్ధం అనంతరం నాటి ప్రధాని వాజ్‌పేయి చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని మోదీ గుర్తు చేశారు. సురినామ్ కొత్త అధ్యక్షుడు చంద్రిక ప్రసాద్ సంతోఖి ప్రమాణ స్వీకారం చేసిన తీరు భారతీయులందరికీ గర్వకారణమని మోదీ తెలిపారు. వేద మంత్రాలు పఠిస్తూ, అగ్ని దేవుడిని స్తుతిస్తూ ఆయన ప్రమాణం చేశారన్నారు. -
కార్గిల్ యుద్ధం : సైనికుల త్యాగానికి జాతి నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ సమగ్రత, భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను గుర్తుచేసుకుంటూ కార్గిల్ విజయ్ దివస్ 21వ వార్షికోత్సవాన్ని ఆదివారం దేశం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు కార్గిల్ హీరోలకు ఘనంగా నివాళులు అర్పించారు. 1999లో సరిగ్గా ఇదే రోజున కార్గిల్ -ద్రాస్ సెక్టార్లో పాకిస్తాన్ చొరబాటుదారులు ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ విజయ్’ విజయవంతమైంది. కార్గిల్‌లో పాకిస్తాన్ దళాలను గుర్తించడంతో 1999 మే 3 నుంచి జులై 26 వరకూ కార్గిల్ యుద్ధం సాగింది. 1998లోనే పాకిస్తాన్ దళాలు దాడికి ప్రణాళికలు రూపొందించాయి. అంతకుముందు పాకిస్తాన్ సైన్యాధ్యక్షులు ఈ తరహా సూచనలు చేసినా దాడులు యుద్ధానికి దారితీస్తాయనే ఆందోళనతో ఆ ప్రతిపాదనలను పాకిస్తాన్ నేతలు తోసిపుచ్చారు. అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సైతం భారత ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి నుంచి ఫోన్‌కాల్ వచ్చేవరకూ తనకు దాడి గురించి ఎలాంటి సమాచారం లేదని చెప్పడం గమనార్హం. కాగా, ఆపరేషన్ విజయ్ భారీ సక్సెస్‌కు ఒక రోజు ముందు ఏం జరిగిందనే విషయాలను వివరిస్తూ భారత సైన్యం శనివారం ట్వీట్ చేసింది. ‘ఆ రోజు భారత సైన్యం అత్యంత సాహసంతో ముస్కో లోయలో జులూ శిఖరంపై దాడికి పాల్పడింది..మన సేనలు సమరోత్సాహంతో అంకితభావంతో ముందుకు దూకి ప్రత్యర్ధుల ముట్టడిలో ఉన్న మన ప్రాంతాన్ని విజయవంతంగా స్వాధీనం చేసుకున్నా’రని సోషల్ మీడియా వేదికగా సైన్యం పేర్కొంది. జాతి సమగ్రతను కాపాడేందుకు భారత సైనికులు చేసిన సమున్నత త్యాగానికి గుర్తుగా జులై 26ను అమరవీరులకు దేశం అంకితం చేసింది. 12,000 అడుగుల ఎత్తులో మన సైనికులు ద్రాస్, కక్సర్, బటాలిక్, తుర్తుక్ సెక్టార్లలో ప్రత్యర్ధి సేనలకు చుక్కలు చూపారు. ఈ యుద్ధంలో ఇరుపక్షాలకు చెందిన పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ సేనల చెరలో ఉన్న మన భూభాగంపై భారత సైన్యం తిరిగి పట్టుబిగించడంతో ‘ఆపరేషన్ విజయ్’ విజయవంతంగా ముగిసింది. చదవండి : డబ్బులు తీసుకుని పాత ఆయుధాలిచ్చారు -
‘డిసెంబర్ 6’కు పోలీసుల ముందస్తు తనిఖీలు
నేరేడ్మెట్: డిసెంబర్ 6 బ్లాక్ డే, విజయ్ దివస్‌ల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు డిసెంబర్ 6ను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉందన్న సమాచారంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. నేరేడ్మెట్ ప్రాంతంలో శుక్రవారం పోలీసులు బస్టాప్‌లు, రైల్వే స్టేషన్, దేవాలయాలు, రద్దీగా ఉండే ప్రాంతాలలో బాంబ్ స్వ్కాడ్‌తో విస్తృత తనిఖీలు నిర్వహించి అనుమానితులను అదుపులోకి ప్రశ్నిస్తున్నారు.