( ఫైల్ ఫోటో )
సాక్షి, తాడేపల్లి: నేడు విజయ్ దివస్. ఈ సందర్బంగా భారత సాయుధ బలగాల పరాక్రమంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం సైనికులు చేసిన ధైర్య సాహసాలను అందరూ స్మరించుకోవాలన్నారు.
విజయ్ దివస్ సందర్భంగా వైఎస్ జగన్ స్పందించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘విజయ్ దివస్ సందర్భంగా మన సాయుధ బలగాల ధైర్యసాహసాలు, త్యాగాలను స్మరించుకుని, సెల్యూట్ చేద్దాం. 1971లో జరిగిన ఈ చారిత్రక విజయంలో మన సైనికులు చూపిన పరాక్రమం, సంకల్పం ఎనలేనిది. దేశం కోసం సైనికులు చేసిన ధైర్య సాహసాలు చరిత్రలో నిలిచిపోయేలా చేశాయి’ అని కామెంట్స్ చేశారు.
On this special day of Vijay Diwas, we remember and salute the bravery and sacrifice of our armed forces. Their valor and determination in the historic 1971 victory liberated a nation and etched India’s courage in history. Jai Hind!
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 16, 2024
Comments
Please login to add a commentAdd a comment