Relay race
-
Asian Games 2023: భారత్ ఖాతాలో 18వ స్వర్ణం.. ఆల్‌టైమ్ రికార్డు
ఏషియన్ గేమ్స్ 2023 పతకాల వేటలో భారత్ దూసుకుపోతుంది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించిన నిమిషాల వ్యవధిలోనే భారత ఫురుషుల రిలే టీమ్ (ముహమ్మద్ అనాస్ యహియా, అమోజ్ జాకబ్, ముహమ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్) 4X400 మీటర్ల రేసులో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఈ రేసును భారత అథ్లెట్లు 3:01.58 సమయంలో పూర్తి చేశారు. ఈ పతకంతో భారత్ పతకాల సంఖ్య 81కి (18 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) చేరింది. ఇవాళ ఉదయమే పతకాల సంఖ్య విషయంలో గత రికార్డును (2018 జకార్తా గేమ్స్‌లో 70 పతకాలు) అధిగమించిన భారత్.. నీరజ్, ఫురుషుల రిలే టీమ్ స్వర్ణాలతో ఏషియన్ గేమ్స్ ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పింది. ఈ క్రీడల్లో స్వర్ణాల విషయంలో భారత్ గత రికార్డు 16గా ఉండింది. 2018 జకార్తా క్రీడల్లో భారత్ అత్యధికంగా 16 పతకాలు సాధించింది. తాజా క్రీడల్లో భారత్ స్వర్ణాల విషయంలో ఆల్‌టైమ్ రికార్డు (18) సాధించింది. ప్రస్తుత క్రీడల్లో భారత్ ఇదే జోరును కొనసాగిస్తే 100కు పైగా పతకాలు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే, మెన్స్ రిలే టీమ్ స్వర్ణంతో భారత్ పతకాల సంఖ్యను 81కి పెంచుకుని, పతాకల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 316 పతకాలతో (171 గోల్డ్, 94 సిల్వర్, 51 బ్రాంజ్) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. జపాన్ 147 మెడల్స్‌తో (37, 51, 59) రెండో స్థానంలో, రిపబ్లిక్ ఆఫ్ కొరియా 148 పతకాలతో (33, 45, 70) మూడో స్థానంలో ఉన్నాయి. -
నోవా లైల్స్ ‘డబుల్’
బుడాపెస్ట్ (హంగేరీ): అమెరికా అథ్లెట్ నోవా లైల్స్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ‘డబుల్’ సాధించాడు. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటికే 100 మీటర్ల స్ప్రింట్‌లో విజేతగా నిలిచిన అతను ఇప్పుడు 200 మీటర్ల పరుగులో కూడా అగ్రస్థానాన్ని అందుకున్నాడు. అంచనాలకు తగినట్లుగానే సత్తా చాటిన లైల్స్ 19.52 సెకన్లలో పరుగు పూర్తి చేసి పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఈవెంట్లో ఎరియోన్ నైటాన్ (అమెరికా – 19.75 సెకన్లు) రజతం సాధించగా, లెట్సిలో టె»ొగో (బోట్స్వానా – 19.81 సెకన్లు) కాంస్యం గెలుచుకున్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ 200 మీటర్ల పరుగులో లైల్స్‌కు ఇది వరుసగా మూడో స్వర్ణం కావడం విశేషం. గత ఏడాది ఒరెగాన్‌లో జరిగిన పోటీల్లోనూ అతను బంగారు పతకం సాధించాడు. తద్వారా బోల్ట్ తర్వాత ఒకే ఈవెంట్లో వరుసగా కనీసం మూడు స్వర్ణాలు గెలిచిన రెండో అథ్లెట్‌గా లైల్స్ నిలిచాడు. 4గీ100 మీటర్ల రిలేలో అమెరికా జట్టు ఫైనల్ చేరింది. ఇందులో కూడా భాగంగా నిలిచి విజయం సాధిస్తే లైల్స్ ఖాతాలో మూడో స్వర్ణం చేరుతుంది. ప్రపంచ రికార్డుకు చేరువై... 100 మీటర్ల స్ప్రింట్‌లో రజతం సాధించిన షెరికా 200 మీటర్ల ఈవెంట్లో తన పరుగుకు మరింత పదును పెట్టింది. ఈ జమైకా అథ్లెట్ 200 మీటర్ల పరుగులో రెండో అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేస్తూ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుందిు. 21.41 సెకన్లలో షెరికా పరుగులు పూర్తి చేసింది. గాబ్రియెల్ థామస్ (అమెరికా – 21.18 సెకన్లు), షకారి రిచర్డ్సన్ (అమెరికా – 21.92 సెకన్లు)లకు వరుసగా రజత, కాంస్యాలు దక్కాయి. ప్రపంచ రికార్డు ఇప్పటికీ అమెరికాకు చెందిన ఫ్లోరెన్స్ గ్రిఫిత్ జాయ్నర్ (21.34 సెకన్లు) పేరిటే ఉంది. 1988లో ఆమె ఈ టైమింగ్‌ను నమోదు చేసింది. గత ఏడాది కూడా ఈ ఈవెంట్లో షెరికా స్వర్ణం సాధించింది. ఆసియా రికార్డుతో ఫైనల్లోకి భారత 4్ఠ400 రిలే బృందం ప్రదర్శన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత 4్ఠ400 మీటర్ల రిలే బృందం అద్భుత ప్రదర్శనతో సత్తా చాటింది. ఆసియా రికార్డుతో ఫైనల్‌కు అర్హత సాధించింది. తొలి హీట్‌లో మన జట్టు రెండో స్థానంలో నిలిచింది. మొహమ్మద్ అనస్ యాహియా, అమోజ్ జాకబ్, మొహమ్మద్ అజ్మల్ వరియత్తోడి, రాజేశ్ రమేశ్ భాగంగా ఉన్న భారత్ ఈ రేసును 2 నిమిషాల 59.05 సెకన్లలో పూర్తి చేసింది. ఇది కొత్త ఆసియా రికార్డు కావడం విశేషం. ఈ హీట్స్‌లో అమెరికా జట్టు మొదటి స్థానంలో నిలవగా, గ్రేట్ బ్రిటన్ టీమ్‌కు మూడో స్థానం దక్కింది. నేడు ఫైనల్ రేస్ జరుగుతుంది. -
ఒలింపిక్ స్ఫూర్తి..థ్యాంక్యూ అమ్మమ్మా!
అమ్మమ్మలు, నానమ్మలు ఏం చేస్తారు? ఇదిగో దేశానికి ఇలాంటి వరాల మూటను అందిస్తారు. తమిళనాడు నుంచి ఒలింపిక్స్‌కు పయనమైన 23 ఏళ్ల రేవతి వీరమణి 4 X 400 మీటర్ల మిక్స్డ్ రిలే పరుగులో భారత్‌కు మెడల్ అవకాశాలపై ఆశలు రేపుతోంది. ఏడేళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయిన రేవతిని పనిలో పెట్టు అని అందరూ ఆమె అమ్మమ్మకు సూచిస్తే ‘నా మనవరాలు చదువుకోవాలి’ అని ఇటుక బట్టీల్లో తాను శ్రమించి రేవతిని క్రీడాకారిణిని చేసిందా అమ్మమ్మ. అందుకే ‘ఇదంతా మా అమ్మమ్మ’ ఘనతే అంటోంది రేవతి. విధి జీవితంతో ఆట ఆడొచ్చు. కాని విధిని గెలిచే ఆట మనం తప్పక ఆడాలి. 2016. కోయంబత్తూరులో 32వ జూనియర్ అథ్లెటిక్ నేషనల్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. 100 మీటర్ల పరుగు ఫైనల్. ట్రాక్ మీద ఉన్న ఆ అమ్మాయిని ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి జమాజట్టీల్లాంటి జూనియర్ అథ్లెట్లు ట్రాక్ మీద ఉన్నారు. తుపాకీ మోగింది. ఆ అమ్మాయి చిరుతలా కదిలింది. రెప్పపాటు సమయంలో 100 మీటర్లను ముగించింది. 12.2 సెకన్ల కాలంలో 100 మీటర్లను ఫినిష్ చేసిన ఆ అమ్మాయి పేరేమిటా అని అందరూ ఆరా తీశారు. రేవతి వీరమణి. ఆ తర్వాత ఆ చాంపియన్‌షిప్‌లో రేవతి 200 మీటర్లను, 4 X 100 రిలేను గెలిచి తమిళనాడును పతకాల పంటలో రెండోస్థానంలో నిలిపింది. అప్పుడే అందరూ అనుకున్నారు ఈ అమ్మాయి ఒలింపిక్స్ వరకూ వెళుతుందని. ఇవాళ అదే జరిగింది. జపాన్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ తరఫున 4 X 400 మీటర్ల మిక్స్డ్ రిలేలో పాల్గొననుంది రేవతి. కచ్చితంగా మెడల్ సాధిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. అమ్మమ్మ అరమ్మాళ్తో రేవతి వీరమణి ఉత్త కాళ్లతో పరిగెత్తి... రేవతిది మదురైకు ఆనుకుని ఉండే సక్కిమంగళం అనే చిన్న పల్లె. ఆమెకు ఏడేళ్ల వయసు ఉండగా తండ్రి ఉదర సంబంధమైన వ్యాధితో మరణించాడు. ఆ తర్వాత ఆరు నెలలకే తల్లి బ్రెయిన్ ఫీవర్‌తో ప్రాణాలు వదిలింది. రేవతి, రేవతి చెల్లెలు అనాథలయ్యారు. ఆ సమయంలో వారి వెనుక ఉక్కు గోడలా నిలిచి కాపాడుకుంది అమ్మమ్మ అరమ్మాళ్. ఇద్దరు మనవరాళ్లను ఆమె ప్రాణంగా పెంచుకోవాలని నిశ్చయించుకుంది. ఆమె అతి పేదరాలు. పొలాల్లో, ఇసుక బట్టీల్లో పని చేస్తేనే పొట్ట నిండేది. ‘నువ్వు వాళ్లను ఏం పెంచుతావు. పనిలో పెట్టు’ అని బంధువులందరూ చెప్పినా ‘నా మనవరాళ్లను చదివించుకుంటాను’ అని ఆమె కష్టపడింది. రేవతిని గవర్నమెంట్ స్కూల్లో వేస్తే ఇంటర్వెల్లో ఉత్త కాళ్ల మీద వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మమ్మను చూసి వెళ్లేది. ‘తూనీగలాగా పరిగెడతా ఉంది’ అనుకున్న అమ్మమ్మ పరుగులో రేవతిని ప్రోత్సహించింది. షూస్ కొనుక్కునే స్తోమత కూడా లేని రేవతి ఉత్త కాళ్లతో పల్లె రోడ్ల మీద పరుగులు తీస్తూ ప్రాక్టీసు చేసేది. ఆ సమయంలోనే మదురైకి చెందిన కోచ్ కన్నన్ దృష్టిలో పడటంతో రేవతి జీవితం మారింది. అమ్మమ్మను ఒప్పించి ఇంటర్ వరకూ ప్రాక్టీసుకు ఒప్పుకున్న అరమ్మాళ్ డిగ్రీ మదురైలో ఉండి చదువుకుంటూ రన్నింగ్‌ను సాధన చేయాలని కోచ్ చెప్పేసరికి భయపడింది. కాని కాలేజీలో సీటు ఫ్రీ హాస్టల్ ఏర్పాటు చేశాక అంగీకరించింది. మదురై పల్లెల్లో పిల్లలు చాలా వేగంగా ఆటలు ఆడతారు. వారికి జల్లికట్టు, మంజు విరాట్టు వంటి ఆటలు వేగాన్ని ఇస్తాయి. రేవతికి కూడా అలాంటి వేగం వచ్చింది. జాతీయస్థాయిలో మెడల్స్ సాధించి తమిళనాడు ప్రభుత్వ ప్రోత్సాహం అందుకుంది. అలాగే రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగం పొందింది. ఆమె చెల్లెలు పోలీస్ ఆఫీసర్ అయ్యింది. గాయపడినా... ఆసియా క్రీడల్లో రేవతి 4 X 400 రిలేలో 4వ స్థానంలో వచ్చింది. వరల్డ్ ఛాంపియన్ షిప్లో కూడా పాల్గొంది. కాని ఆ తర్వాత ఆమెకు మోకాలి సమస్య వచ్చింది. ‘నేను చాలా కష్టపడాల్సి వచ్చింది దాని నుంచి బయటపడటానికి’ అని రేవతి అంది. రేవతి అమ్మమ్మ ఆ సమయంలో మనవరాలి ఆత్మస్థయిర్యం చెదరకుండా చూసుకుంది. ‘ఆమె నన్ను ఆపలేదు. వెళ్లు. పరిగెత్తు’ అంది. కోచ్‌ల సాయంతో మళ్లీ నేను మామూలు స్థితికి వచ్చాను’ అంది రేవతి. ఒలంపిక్స్ సన్నాహాల్లో భాగంగా పాటియాలాలో జరిగిన క్యాంప్‌లో 4 X 400 మిక్స్డ్ రిలేలో 54 సెకన్ల వ్యక్తిగత సమయాన్ని నమోదు చేసింది రేవతి. ∙∙ రేవతి జపాన్‌కు వెళ్లింది. ఆమె అమ్మమ్మ ఎప్పటిలాగే పొలంలో పని చేసుకుంటూ మనవరాలు తెచ్చే శుభవార్త కోసం ఎదురు చూస్తోంది. రేవతి మెడల్ తెస్తే అందులో సగం ఆమె అమ్మమ్మకే దక్కుతుంది. అమ్మమ్మ లేకపోతే ఇవాళ నేను లేను. కూతురి పెళ్లి చేసి బాధ్యతలు తీరాయి అనుకునే వయసులో నేను, నా చెల్లి ఆమె ఒడికి చేరాము. ఆమె తిరిగి మాకు అమ్మైంది. ఆమెకు చెప్పకుండా నేను ఏ పనీ చేయను. మేము కాకుండా ఆమెకు వేరే లోకం లేదు. – రేవతి -
11 గంటల్లో 180 కి.మీ పరుగు!
న్యూఢిల్లీ: విజయ్ దివస్ సందర్భంగా బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధ వీరులను స్మరించుకుంది. వారి గౌరవార్థం 180 కిలోమీటర్ల బ్యాటన్ రిలే ర్యాలీ నిర్వహించింది. 930 బీఎస్ఎఫ్ సైనికులతో డిసెంబర్ 13 అర్థరాత్రి నుంచి 14 వ తేదీ ఉదయం వరకు రాజస్తాన్‌లోని అనూప్‌ఘర్‌లో ఈ ర్యాలీ కొనసాగింది. బీఎస్ఎఫ్ ప్రయత్నాన్ని కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు కొనియాడారు. బ్యాటర్ రిలే ర్యాలీలో పాల్గొన్న సైనికులపై ప్రశంసలు కురిపించారు. 930 మంది బీఎస్ఎఫ్ జవాన్లు రాజస్తాన్‌లోని అంతర్జాతీయ సరిహద్దు గుండా 1971 యుద్ధ వీరుల గౌరవార్థం బ్యాటన్ రిలే ర్యాలీ నిర్వహించారని ట్విటర్లో పేర్కొన్నారు. ర్యాలీకి సంబంధించిన వీడియో షేర్ చేశారు. కాగా, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించేందుకు భారత్ 1971లో యుద్ధ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఆర్మీపై భారత ఆర్మీ పట్టు సాధించింది. దాంతో అప్పటి పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఆమిర్ అబ్దుల్లా ఖాన్ నాయిజీ, అతని 93 వేల సైనిక బలగంతో భారత్ ఎదుట లొంగిపోయారు. తద్వారా బంగ్లాదేశ్ స్వతంత్ర్య దేశంగా ఆవిర్భవించింది. ఇక ఈ యుద్ధంలో విజయానికి గుర్తుగా ప్రతియేడు డిసెంబర్ 16న విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. (చదవండి: రజనీ కొత్త పార్టీ పేరు మక్కల్ సేవై కర్చీ, గుర్తు అదేనా ?) -
వైరల్: ఆమె పోరాటానికి హ్యాట్సాఫ్!
‘వీలైతే ఎగురు! లేకుంటే పరిగెత్తు! కుదిరితే నడువు! అదీ కాకుంటే పాకు! అంతే కానీ నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకు!’అంటూ ఓ మహాకవి యువతను ఉద్దేశించి పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ మహనీయుడి మాటలు విన్నదో ఏమో గానీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రయత్నం మాత్రం ఆపలేదు.. చివరికి లక్ష్యాన్ని పూర్తి చేసింది. పరుగు పందెం మధ్యలో కాలికి గాయమైనా.. తన సంకల్పం ముందు అది చిన్నదైపోయింది. నడవలేని పరిస్థితుల్లో ఉన్నా మోకాళ్లపై పాకుకుంటూ 42 కిలోమీటర్ల రిలే మారథాన్‌ను తన జట్టు పూర్తి చేసేలా చేసింది జపాన్‌కు చెందిన క్రీడాకారిణి రీ లిడా. ప్రస్తుతం ఈ 19ఏళ్ల క్రీడాకారిణి చూపించిన పోరాట తెగువకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆమె పోరాటానికి ఫిదా అయిన సెలబ్రిటీలు సైతం ట్వీట్ చేస్తున్నారు. ఇక నెటిజన్లు రీ లిడా క్రీడా స్పూర్తిని, అసమాన పోరాటానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. జపాన్‌లోని రిలే మారథాన్‌లో భాగంగా 42 కిలోమీటర్ల పరుగు పందెం ప్రారంభమైంది. వంతుల వారీగా పరిగెత్తే దానిలో భాగంగా 3.5కిలో మీటర్ల దూరం లక్ష్యంగా పరుగు మొదలుపెట్టిన రీ లిడా ఇంకా 700 మీటర్ల దూరం ఉండగానే కుడి కాలికి గాయంకావడంతో కుప్పకూలిపోయింది. కాలు ఫ్యాక్చర్ అయిందని పరిగెత్తడం కష్టమని, పోటీనుంచి తప్పుకొవడం మంచిదని జట్టు మేనేజర్ వారించినా లిడా వినలేదరు. ఇంకా ఎంత దూరం పరిగెత్తాలని తెలుసుకొని, మోకాళ్లపై పాకుతూ తన లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇక రీలిడా క్రీడా స్పూర్థిని చూసి సహచర క్రీడాకారిణులు, స్టేడియంలోని అభిమానులు కరతలాధ్వనులతో ఉత్తేజపరిచారు. A Japanese runner who broke her leg during a relay race. She crawled to her partner so the team would be able to continue the race. Lets share her story with the world. pic.twitter.com/NNiSL9Q64F — Kevin W (@kwilli1046) 11 November 2018 -
‘కనక’ కాంతలు...
- 4x400 రిలేలో నాలుగోసారి భారత మహిళలకు పసిడి పతకం - షాట్‌పుట్‌లో ఇందర్‌జిత్‌కు కాంస్యం ఇంచియాన్: రిలే రేసుల్లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ భారత మహిళల జట్టు వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 4ఁ400 మీటర్ల రిలేలో ప్రియాంక, టింటూ లుకా, మన్దీప్ కౌర్, పూవమ్మలతో కూడిన భారత బృందం విజేతగా నిలిచింది. దీంతో 2002 బుసాన్ గేమ్స్ నుంచి వరుసగా నాలుగోసారి పసిడి పతకం భారత్ సొంతమైంది. 3ని 28.68 సెకన్లలో రేసును పూర్తి చేసిన భారత బృందం ఆసియా క్రీడల రికార్డును నెలకొల్పింది. 2010లో తమ పేరిటే ఉన్న రికార్డును (3ని 29.02 సెకన్లు) తిరగరాసింది. జపాన్ (3ని 30.80 సెకన్లు), చైనా (3ని 32.02 సెకన్లు)లు రజతం, కాంస్యం దక్కించుకున్నాయి. తొలి అంచెలో పరుగెత్తిన ప్రియాంక..... జపాన్ అమ్మాయి కంటే కాస్త వెనుకబడింది. అయితే రెండో అంచెలో టింటూ అద్భుతమైన పరుగుతో భారత్ లోటును పూర్తి చేసింది. మూడో అంచెలో జపాన్ నుంచి సవాలు ఎదురైనా మన్దీప్ ఏమాత్రం తడబడకుండా ఆధిక్యాన్ని కొనసాగిస్తూ పరుగు పూర్తి చేసింది. చివరిదైన నాలుగో అంచెలో పూవమ్మ యాంకర్ పాత్రలో అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చి భారత్‌కు కనకాన్ని అందించింది. పురుషుల షాట్‌పుట్‌లో భారత్‌కు కాంస్యం లభించింది. ఫైనల్లో ఇందర్జిత్ సింగ్ ఇనుప గుండును 19.63 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు. ఐదో ప్రయత్నంలో భారత షాట్ పుటర్ ఈ దూరాన్ని అందుకున్నాడు.