
సాక్షి, న్యూఢిల్లీ : రోహింగ్యా ముస్లింలు కొందరు ఆధార్, పాన్, ఓటరు కార్డులు సంపాదిస్తున్న ఉదంతాలు వెలుగులోకి వచ్చాయని హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. అక్రమ పద్ధతుల్లో వారు ఈ పత్రాలను పొందుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఘటనలను గుర్తించిన వెంటనే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర అధికారులు కఠిన చర్యలు చేపట్టడంతో పాటు ఆయా పత్రాలను రద్దు చేస్తారని మంత్రి పార్లమెంట్‌కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
రోహింగ్యా ముస్లింలు ఆధార్, పాన్ కార్డులు సంపాదిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నా..వారికి కొందరు అక్రమంగా ఆశ్రయం కల్పిస్తున్న ఉదంతాలు ప్రభుత్వం దృష్టికి రాలేదని మంత్రి తెలిపారు.