కేంద్ర న్యాయశాఖ మంత్రి కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఈ మేరకు రిజిజ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియమాకానికి సంబంధించి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న సుప్రీం కోర్టు కొలీజియంకి సంబంధించిన సిఫార్సులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కొలీజియం ఇష్యూ అంతా మైండ్‌గేమ్‌గా అభివర్ణించారు. దీనిపై తాను మాట్లాడనని కూడా చెప్పారు.
ఈ మేరకు అరుణాచల్ ప్రదేశ్‌లో 4జీ సేవల కోసం 254 మైబెల్ టవర్లను అంకితం చేసే కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రిజిజు మాట్లాడుతూ..కఠినమైన భూభాగాలను కలిగిన సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత స్థానికులకు ప్రధాన సమస్యగా ఉందన్నారు. రిజిజు అరుణాచల్ ప్రదేశ్‌లోని తపిర్ గావో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహస్తున్నారు. కాగా, ఆయన కొలీజియంని మన రాజ్యాంగానికి విరుద్ధమైనదిగా కూడా పిలివడం గమనార్హం.
(చదవండి: ఇది నిజం మాట్లాడినందుకు చెల్లిస్తున్న మూల్యం! రాహుల్ గాంధీ)
Comments
Please login to add a commentAdd a comment