'పాక్, బంగ్లా మైనారిటీలకు భారత పౌరసత్వం' | citizenship to Pak, B'desh persecutors, says Kiren Rijiju | Sakshi
Sakshi News home page

'పాక్, బంగ్లా మైనారిటీలకు భారత పౌరసత్వం'

Published Tue, Aug 4 2015 2:07 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

'పాక్, బంగ్లా మైనారిటీలకు భారత పౌరసత్వం'

'పాక్, బంగ్లా మైనారిటీలకు భారత పౌరసత్వం'

న్యూఢిల్లీ: స్వదేశంలో మైనారిటీలుగా ఉంటూ.. మతపరమైన హింసను ఎదుర్కోలేక భారత్కు శరణార్థులుగా వచ్చినవారందరికీ పౌరసత్వం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ల నుంచి ఇప్పటికే భారత్లోకి ప్రవేశించినవారికి లాంగ్టర్మ్ వీసా లేదా పౌరసత్వం ఇస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ రిజిజు మంగళవారం లోక్సభలో చెప్పారు.

స్వదేశంలో అక్కడి ప్రభుత్వ నిర్బంధాన్ని తాళలేక భారత్కు వచ్చిన వారిలో బాంగ్లాదేశీలే అధికం. ఆ తరువాతి స్థానంలో పాకిస్థానీలు ఉన్నారు. మతద్వేషం ఎదుర్కోలేక ఇక్కడికి వచ్చిన వారిని ఆదుకోవడం కనీస ధర్మంగా భావిస్తున్నామని, అలాంటి శరణార్థులకు పౌరసత్వం జారీ చేసేందుకు సులువైన విధివిధానాలు రూపొందించామని రిజిజు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement