![Senior Advocate R Venkataramani is new Attorney General for India - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/29/ag.jpg.webp?itok=ex5VTBL7)
న్యూఢిల్లీ: భారత తదుపరి అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ఈ మేరకు ట్వీట్ చేశారు. నియామకాన్ని నిర్ధారిస్తూ కేంద్ర న్యాయ శాఖ పరిధిలోని లీగల్ అఫైర్స్ విభాగం బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పదవిలో వెంకటరమణి మూడు సంవత్సరాలపాటు కొనసాగుతారు. ప్రస్తుత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీకాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుంది.
వేణుగోపాల్ స్థానంలో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని నియమించాలని గతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, సొంత కారణాలతో రోహత్గీ ఆ ప్రతిపాదనను ఇటీవల తిరస్కరించారు. వెంకటరమణి అక్టోబర్ ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. మోదీ తొలిసారిగా ప్రధాని అయినపుడు 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు రోహత్గీనే అటార్నీగా ఉన్నారు. ఆయన పదవీకాలం ముగిశాక వేణుగోపాల్ సేవలందించారు.
Comments
Please login to add a commentAdd a comment