
ఆనంద్ శర్మ ప్రశ్నతో రచ్చరచ్చ
కేంద్రంలోని పెద్దల సభ మరోసారి మార్మోగింది. రెండుసార్లు వాయిదా పడిన రాజ్యసభ కాంగ్రెస్‌పార్టీ నేత ఆనంద్ శర్మ కేంద్ర మంత్రి కిరెన్ రిజీజుపై తలెత్తిన ఆరోపణలు లేవనెత్తడంతో గందరగోళం నెలకొంది.
న్యూఢిల్లీ: కేంద్రంలోని పెద్దల సభ మరోసారి మార్మోగింది. రెండుసార్లు వాయిదా పడిన రాజ్యసభ కాంగ్రెస్‌పార్టీ నేత ఆనంద్ శర్మ కేంద్ర మంత్రి కిరెన్ రిజీజుపై తలెత్తిన ఆరోపణలు లేవనెత్తడంతో గందరగోళం నెలకొంది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని హైడ్రో ప్రాజెక్టు విషయంలో రిజీజు అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని, పదవిలో నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్‌చేయడంతో రాజ్యసభలో అధికార విపక్షాల మధ్య దుమారం రేగింది. ఉభయ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో చివరకు రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు.