సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. బెయిల్ ఇవ్వకూడదన్న సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. సాక్షులను ప్రభావితం చేస్తారన్న వాదనను కొట్టిపారేయలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో చిదంబరానికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు మాయమయ్యాయని అడిషనల్ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఢిల్లీ హైకోర్టుకు ఇదివరకే తెలిపిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన చిదంబరం ఆధారాలన్నింటినీ మాయం చేశారని కోర్టుకు విన్నవించారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో సీబీఐ చిదంబరాన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment