
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరంపై లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ కోర్టు అనుమతిని కోరే అవకాశం ఉందని భావిస్తున్నారు. అవినీతి కేసులో ఈనెల 30వరకూ సీబీఐ కస్టడీలో ఉండేందుకు కోర్టు అనుమతించడంతో దర్యాప్తు అధికారులు ఆయనను పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా తాము అడిగే ప్రశ్నలకు చిదంబరం స్పష్టంగా సమాధానం ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు చిదంబరం, ఇంద్రాణి ముఖర్జీలను ఎదురెదుగా ఉంచి ముఖాముఖి ప్రశ్నించేందుకు కూడా సీబీఐ అధికారులు కోర్టు అనుమతిని కోరవచ్చని భావిస్తున్నారు. చిదంబరం బెయిల్ పిటిషన్‌ను ఇప్పటికే సుప్రీంకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఈడీని ఆదేశించాలని కోరుతూ చిదంబరం అప్పీల్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. మంగళవారం వరకూ చిదంబరంను అరెస్ట్ చేయరాదని ఈడీని సుప్రీం కోర్టు కోరింది.
Comments
Please login to add a commentAdd a comment