న్యూఢిల్లీ : ఐన్‌ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరంకు సాధారణ ఆహారమే ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. చిదంబరం బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆయనకు ఇంటి ఆహారం అందించాలని న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. అయితే ఆ అభ్యర్థనను జస్టిస్ సురేశ్ కుమార్ ఖైత్ తోసిపుచ్చారు. ఈ సందర్భంగా కపిల్ సిబల్ వాదిస్తూ చిదంబరం వయస్సు 74 ఏళ్లు అని, ఆయన వయసును దృష్టిలో ఉంచుకునే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. ఇంతలో సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కల్పించుకొని.. చిదంబరం కంటే పెద్ద వయస్కుడైన ఇండియన్ నేషనల్ లోక్‌దల్ నాయకుడైన ఓంప్రకాశ్ చౌతాలాకు కూడా సాధారణ ఆహారమే ఇస్తున్నామని గుర్తుచేశారు. జైలులో ప్రతీఒక్కరిని సమానంగా చూస్తామని తెలిపారు.
ప్రస్తుతం చిదంబరంపై వస్తున్న ఆరోపణలకు ఏడేళ్ల కారాగారా శిక్షకు మాత్రమే అర్హుడని.. కానీ ఈ ఆరోపణలతో ఆయనకు ఏమాత్రం సంబంధం లేదని కపిల్ సిబల్ వాదించారు. ''ఈ కేసు ప్రీఛార్జ్‌షీట్ దశలో ఉంది. ఆగస్టు 21న పిటీషనర్ ఈ కేసులో అరెస్టయ్యారు. 2007లో జరిగిన ఐన్‌ఎఎక్స్ కేసులో చిదంబరంకు సంబంధం ఉందని'' తుషార్ మెహతా తిప్పికొట్టారు. ఇంతలో కోర్టు కలగజేసుకొని సెప్టెంబరు 5న అరెస్టైన చిదంబరంకు ప్రత్యేక ఆహారం ఇవ్వాలని ఇంత ఆలస్యంగా ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించింది. ఆ విషయాన్ని తెలిపేలోగానే కోర్టుకు మధ్యంతర సెలవులు వచ్చాయని కపిల్ సమాధానమిచ్చారు. అన్ని వాదనలు విన్న కోర్టు ఈ వ్యవహారంలో సీబీఐ స్సందించాలని కోరింది. కాగా, తదుపరి విచారణను సెప్టెంబర్ 23 కు వాయిదా వేసింది.(చదవండి : తీహార్ జైలుకు చిదంబరం)
Comments
Please login to add a commentAdd a comment